30, అక్టోబర్ 2010, శనివారం

ప్రహేళిక - 21

ఈ దేవుడు ఎవరు?
ఆ.వె.
నలుమొగములవాని చెలువ యత్త కొడుకు
పగతు భార్య తండ్రి వైరి తనయు
బావ దాయఁ జంపువాని తండ్రి సుతుని
ప్రభువు మీ కొసంగు విభవములను.

ఆ దేవుడు ఎవరో చెప్పండి

9 కామెంట్‌లు:

  1. మహ కష్టంగా ఉంది మాస్టారూ.. సాయంత్రంలోపల ఆలోచిస్తాను. :)

    రిప్లయితొలగించండి
  2. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంశనివారం, అక్టోబర్ 30, 2010 9:36:00 AM

    గురువు గారూ,
    రెండు పేర్లు అనిపిస్తున్నాయి కాని సరిగా తెలియటం లేదు.
    కొంచం క్లిష్టం గానే ఉంది. ప్రయత్నిస్తాను.
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  3. నలుమొగములవాడు బ్రహ్మ
    వాని చెలువ సరస్వతి
    ఆమె అత్త లక్ష్మి
    ఆమె కొడుకు మన్మథుడు
    అతని పగతుడు శివుడు
    అతనిభార్య పార్వతి.
    ఆమె తండ్రి పర్వతుడు
    అతని వైరి ఇంద్రుడు.
    ఆతని తనయుడు అర్జునుడు.
    అతని బావ కృష్ణుడు.
    అతని దాయ(శత్రువు) జరాసంధుడు
    అతని జంపువాడు భీముడు.
    వాని తండ్రి వాయుదేవుడు.
    అతని సుతుడు ఆంజనేయుడు.
    అతని ప్రభువు శ్రీరామచంద్రుడు.

    రిప్లయితొలగించండి
  4. కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
    మీ సమాధానం 100% కరెక్ట్. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. నలుమొగములవాని చెలువ =సరస్వతి
    యత్త కొడుకు -లక్ష్మీ పుత్రుడు మన్మథుడు
    పగతు భార్య తండ్రి =శివుని భార్య తండ్రి హిమాలయము
    వైరి తనయు = ఇంద్రుని తనయుడు జయంతుడు
    బావ =?
    ఈ దారి తప్పేమో! కానీ వేరే దారి తోచట్లేదే!

    రిప్లయితొలగించండి
  6. " బ్రహ్మ దేముడు , లేదా శువుడు " అనుకుంటున్నాను

    రిప్లయితొలగించండి
  7. కోడిహళ్ళి మురళీ మోహన్ గారూ, మీకు analysis power కి జోహార్లు. పార్వతి తండ్రి వరకు వచ్చి loop line లోకి వెళ్ళిపోయాను.

    రిప్లయితొలగించండి
  8. ప్రహేళికా పరిష్కారంలో పాల్గొన్న అందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి