3, అక్టోబర్ 2010, ఆదివారం

చమత్కార (చాటు) పద్యాలు - 41

ఆర్తజన రక్షణోపాయ! ఆంజనేయ! - 6
సీ.
స్తంభ సంభూతావసర ఘోరతర నర
పంచాస్య కహకహార్భటులఁ దెగడి
శాకినీ ఢాకిని సంతత లయకాల
భైరవ కిలకిలార్భటులఁ దెగడి
సంవర్త సమయ ప్రచండ దండధరారి
భర్గ కోలాహలార్భటులఁ దెగడి
దక్షాధ్వరధ్వంసకా క్షుద్రబల వీర
భద్ర హూహూక్రియార్భటులఁ దెగడి
తే. గీ.
పొలుచు భవదట్టహాసంబు చెలఁగఁ బంక్తి
ముఖుని రొమ్ము పగుల్పవే ముష్టిహతిని?
మహిత శ్రీరామ పదభక్తిమద్విధేయ!
ఆర్తజన రక్షణోపాయ! ఆంజనేయ!
( అజ్ఞాత కవి )

4 కామెంట్‌లు:

  1. పద్యాల అర్ధాలు ఇస్తే మంచిదని నా అభిప్రాయం

    రిప్లయితొలగించండి
  2. ఈ పద్య గమనం అర్థం బ్రహ్మాండం గా వున్నాయి. ఇది మననము చేస్తే ఆంజనేయుని అనుగ్రహం వల్ల మనకి "ధీ" శక్తి, వీరశక్తి తప్పక చేకూరుతాయనిపిస్తోంది. ఎప్పుడయినా dull mood లో వుంటే ఈ పద్యం చదువుకోవాలనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  3. జగ్గంపేట వారూ,
    "శంకరాభరణం" బ్లాగుకు స్వాగతం.
    అర్థాలు, వివరణలు ఇవ్వాలని నాకూ ఉంది. కాని సమయాభావం!
    మీ "జగ్గంపేట మెట్టసీమ" బ్లాగు చూసాను. సమకాలీన విషయాలపై వెంట వెంటనే మీ స్పందనలు బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  4. చంద్రశేఖర్ గారూ,
    పద్యాలు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి