5, అక్టోబర్ 2010, మంగళవారం

చమత్కార పద్యాలు - 43

ఎవరా దేవుళ్ళు?
చం.
సలిల విహారు లిద్దఱును, సంతత కాననచారు లిద్దఱున్,
వెలయఁగ విప్రు లిద్దఱును, వీర పరాక్రమ శాలు లిద్దఱున్,
బొలఁతుల డాయువాఁ డొకఁడు భూమిని బుట్టెడువాఁడు నొక్కఁడున్
జెలువుగ మీ కభీష్ట ఫల సిద్ధి ఘటింతు రనంత కాలమున్.

( చాటు పద్య మణిమంజరి )
భావం -
నీటిలో విహరించే వాళ్ళిద్దరు, అడవిలో సంచరించే వాళ్ళిద్దరు, బ్రాహ్మణు లిద్దరు, పరాక్రమవంతు లిద్దరు, స్త్రీల వెంటబడే వాడొక్కడు, భూమిపై పుట్టబోయే వాడొక్కడు మీకెల్లపుడు కోరికలు తీరుస్తారు.

ఎవరా దేవుళ్ళు?

2 కామెంట్‌లు:

  1. దశావతార మూర్తులు! నీటిలో విహరించే మీన, కచ్ఛప రూపులు ఇద్దరు, అడవిలో సంచరించే సూకర, సింహ రూపులు ఇద్దరు, బ్రాహ్మణులైన వామన, భార్గవ రాములు ఇద్దరు, పరాక్రమవంతులైన బల రామ, శ్రీరాములిద్దరు, స్త్రీల వెంటబడే శ్రీకృష్ణుడొక్కడు, భూమిపై అవతరించనున్న కల్కి ఒక్కడు- మొత్తం పదిమందీ మీ కోర్కెల్ని తీర్చెదరు గాక!

    రిప్లయితొలగించండి
  2. నారాయణ గారూ,
    చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి