10, అక్టోబర్ 2010, ఆదివారం

ప్రహేళిక - 6

ఇదేమిటి?
తే.గీ.
యముని లోకమ్ము, తాల్మి, గౌతమియు, జింక
యనెడు చతురక్షర పదమ్ము లందు వెదక
వలెను రెండవ యక్షరమ్ములను; జదువఁ
దెలియు రాజమార్గ మ్మేది తెలుప గలరె?

అదేమిటో చెప్పండి.

14 కామెంట్‌లు:

  1. నరకము
    సహనము
    గోదావరి
    హరిణము

    రహదారి

    రిప్లయితొలగించండి
  2. నరకము; సహనము; గోదావరి; హరిణము => ర-హ-దా-రి.

    రిప్లయితొలగించండి
  3. " నరకము"నకు విసుగు చెంది
    " సహనము" కోల్పోయి
    " గోదావరి " లొ దూక బోవ,
    " హరిణము " కనిపించి
    " ర హ దా రి " చూపించె
    తంతి ద్వార మిమ్ము చేరు కొంటి !

    రిప్లయితొలగించండి
  4. నరకము సహనము గోదా
    వరి హరిణము నందు రెండవాక్షరముల ఒం
    టరిజేసి కలిపి చదివిన,
    గురువర్యా, నదియె ప్రశ్నకు విఱుపు తలపన్

    రిప్లయితొలగించండి
  5. " రహదారి = రాజ మార్గము " అనుకుంటున్నాను
    యమలోకము = నరకము ,తాల్మి = క్షమ ,ధైర్యము,సాహసము ,
    గౌతమి = నది , స్త్రీ , జింక = హరిణము. ఇక అన్నిటి నుంచి రెండవ అక్షరం తీసు కుంటే = " రహదారి అని "

    రిప్లయితొలగించండి
  6. మంద పీతాంబర్ గారూ,
    చమత్కార భరితమైన మీ సమాధానానికి ధన్యవాదాలు.

    భాసకర రామిరెడ్డి గారూ,
    ధన్యోస్మి. ఛందోబద్ధమైన మీ సమాధానం నన్ను అలరించింది. ధన్యవాదాలు.

    చంద్రశేఖర్ గారూ,
    కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
    మందామిని గారూ,
    నేదునూరి రాజేశ్వరి గారూ,
    భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
    మీ అందరి సమాధానం కరెక్ట్. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. మాష్టారూ, ఎవరైనా పద్యరూపంగా గానీ చమత్కారంగా గానీ, ఇంకేదయినా విలక్షణంగా గానీ సమాధానాలు పంపితే, answer తోపాటు అవి కూడా పోస్ట్ చేయమని మనవి. అందరం అనందిద్దాము.

    రిప్లయితొలగించండి
  8. చంద్రశేఖర్ గారూ,
    అందరి సమాధానాలను మరుసటి రోజు ప్రచురిస్తున్నాను కదా. వెంటనే ప్రచురిస్తే మిగిలిన వారికి సమాధానం తెలిసిపోయి ఉత్సాహం చూపించరు. ఇకనుండి ఇలా చమత్కారంగా కాని, పద్య రూపంలో కాని వచ్చిన సమాధానాలను మరుసటి రోజు కోత్త పోస్ట్ గా ప్రచురించే "ప్రహేళిక - సమాధానం" లో ప్రస్తావిస్తాను.

    రిప్లయితొలగించండి
  9. బాగుంది. నేను కూడా ఆశించినది అదే. మరునాడు Answer ప్రచురణ చేసినపుడు దానితో పాటు అన్నట్లుగా. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి