11, అక్టోబర్ 2010, సోమవారం

గళ్ళ నుడి కట్టు - 60


అడ్డం
1. ఆపరాని విజయం మనదైతే వాళ్ళది ఈ ఓటమి (4)
3. ఈ జమానాకు సరిపడ్డ అపరాధ శుల్కం (4)
7. జయ మనిశం తెస్తుంది కీర్తి (2)
8. తమిళుల పప్పుచారు (3)
9. రోజుకోసారి తప్పదు ఈ పవరు "కట్" 92)
12. తెలుపు. సైంధవ లవణంలో కళంకమా? (3)
13. అంతు పట్టని గుణం ఉన్న నగరం (3)
17. తమరిది ఎలాంటిదో మనస్సు? (2)
18. వివాహ మోదం చెడితే గొడవ (3)
19. వాసిగ ముడిచిన శిఖ (2)
22. తిరుగు ప్రయాణం చేసేవాడు (4)
23. మారు వేషం వేసి మరీ సీతను మాయ చేసిన నీచుడు (4)
నిలువు
1. అలాటిలాటి ప్రయాణం కాదు. పారిపోవడ మంటే (4)
2. జలజలమంటూ ప్రవహించే ఉదకం (2)
4. వారి రక్తం పీల్చేస్తే ఖాళీ (2)
5. ఏనాడో గ్రామాంతరం వెళ్ళిన వాడి మారు పేరు (4)
6. లవకుశులకు లక్ష్మణుడు ఏమవుతాడు? (3)
10. వినిపించే నక్షత్రం (3)
11. కోష్ఠ"ము" (3)
14. నలసతి (4)
15. నివసించే చోటు (3)
16. వాతాపిని జీర్ణం చేసుకొన్నవాడు (4)
20. తలకట్టు కట్టి కోటలో వేసేది (2)
21. తలక్రిందైన విధం (2)

5 కామెంట్‌లు:

  1. అడ్డము:
    1)పరాజయం,3)జరిమానా,7)యశం,8)సాంబారు,9)కోత,12)ధవళం,13)పట్టణం,17)మది,18)వివాదం,19)సిగ,22)తిరోగామి,23)మారీచుడు.
    నిలువు:
    1)పలాయనం,2)జలం,4)రిక్తం,5)నామాంతరం,6)బాబాయి(బాబాయ్య),10)శ్రవణం,11)కొట్టము,14)దమయంతి,15)నివాసం,16)అగస్త్యుడు,20)పాగా,21)తిరీ(రీతి)

    రిప్లయితొలగించండి
  2. అడ్డం:1.పరాజయం, 3.జరిమానా, 7.యశం, 8.సాంబారు, 9.కోత, 12.ధవళం, 13.పట్టణం, 17.మది, 18.వివాదం, 18.సిగ, 22.తిరోగామి, 23.మారీచుడు
    నిలువు:1.పలాయనం,2.జలం,4.రిక్తం, 5.నామాంతరం, 6.బాబాయి, 10.శ్రవణ,11.కొట్టము, 14.దమయంతి, 15.నివాసం, 16.అగస్త్యుడు, 20.పాగా,21.తిరీ

    రిప్లయితొలగించండి
  3. 60.గడి అడ్డం. 1.పరాజయం.3.జరిమానా.7.యశం.8.సాంబారు.9.కోత.12.లవణం.13.పట్టము.17.మది.18.వివాదం.19.శిగ .22.తిరుగాడు.23.మారీచుడు.
    నిలువు.1.పలాయనం.2.జలం.4.రిక్త.5.నామాంతరం.6.బాబాయి.10.శ్రవణం.11.కొట్టము .14.దమయంతి.15.నివాసం.16.అగస్త్యుడు.20.పాగా.21.తిరీ [ రీతి. }

    రిప్లయితొలగించండి
  4. శంకరయ్య గారు నమస్కారములు. నెను గడి ,ప్రహేళిక .పంపించాను తమకి చేరలేదను కుంటాను.

    రిప్లయితొలగించండి
  5. భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
    కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
    మీ యిద్దరి సమాధానాలు 100% కరెక్ట్. అభినందనలు.

    రాజేశ్వరి గారూ,
    అడ్డం 13,19,22 తప్ప మిగిలిన వన్నీ సరిపోయాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి