13, అక్టోబర్ 2010, బుధవారం

గళ్ళ నుడి కట్టు - 61


అడ్డం
1. అందరికి అతనంటే జంకు చూడు. ఇంకెవరు? యముడు (4)
3. అతను క్షాత్రానుకూలాభరణం ధరించాడు. అదే కవచం (4)
7. రాజుగారి భార్య రాగిణిని ఏమంటారు? (2)
8. ఇంకా ఈ రణం అంతం కానందుకు ఏమిటి హేతువు? (3)
9. జింక (3)
12. సొటసొట బడి గుమ్ముగా ఉందీ సౌందర్యం (3)
13. పాలను ఇచ్చేది (3)
17. ఇడ్లీ కోసం ఈ అపనింద పడాలా? (2)
18. పలు విధాల తలరాతలు రాసే బ్రహ్మ (3)
19. చేకూరి రామారావు. ఈయన రాతలు ప్రసిద్ధం (2)
22. పడమటి కొండ (4)
23. తండ్రి నుండి సంపాదించుకున్నది (4)
నిలువు
1. దుర్యోధనుడు కర్ణుడి కిచ్చిన కొత్త పేరు (4)
2. రాశి. సున్నా చేర్చితే చిత్తూరు జిల్లలోని ఇక అసెంబ్లీ నియోజకవర్గం (2)
4. చేదబావి. వెనుక గొయ్యి (2)
5. కరణం రాసిన వ్యాఖ్యలో గ్రామర్ తలక్రిందయింది (4)
6. ఎదతో నడిచే పాము (3)
10. సంపాదన కోసం బడికి రా (3)
11. దురదృష్టం వల్ల దరి జేరిన కండూతి (3)
14. గాలివాటంగా పడవను తీసుకు వెళ్ళేది (4)
15. మేటి ధారణాశక్తితో విలసిల్లే ధీమంతుడు (3)
16. ఆద్యంతాలు వంద ఉన్న బాణం దెబ్బ (4)
20. మేనమామలు మీరు కారు, వారు కారు, మరి .........? (2)
21. హిత మంత్రాలతో రక్షించే వాడు తలక్రిందయ్యాడు (2)

5 కామెంట్‌లు:

  1. మిట్టపెల్లి సాంబయ్యబుధవారం, అక్టోబర్ 13, 2010 3:33:00 PM

    గళ్ళ నుడి కట్టు - 61 సమాధానాలు:
    అడ్డం:
    1.అంతకుడు, 3.త్రనుత్రానం, 7.రాణి, 8.కారణం, 9.జింక, 12.సొబగు, 13.క్షీరదం, 17.రవ్వ, 18.విధాత, 19.చేరా, 22.పశ్ఛిమాద్రి, 23.పిత్రార్జితం
    నిలువు:
    1.అంగరాజు, 2.కుప్పం, 4.నుయ్యి, 5.ణంరకవ్యా[వ్యాకరణం], 6.ఉరగం, 10.రాబడి, 11.దురద, 14.తెరచాప, 15.మేధావి, 16.శరాఘాతం, 20.మేమా, 21.హిత్రా[త్రాహి].

    రిప్లయితొలగించండి
  2. మిట్టపెల్లి సాంబయ్య గారూ,
    అడ్డం 3 చివరి అక్షరం, నిలువు 2 చివరి అక్షరం, 21 మొదటి అక్షరం తప్ప మిగిలినవన్నీ సరిపోయాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. అడ్డము:
    1)అంతకుడు,3)తనుత్రాణం,7)రాణి,8)కారణం,9)జింక,12)సొబగు,13)క్షీరదం,17)రట్టు,18)విధాత,19)చేరా,22)పశ్చిమాద్రి,23)వారసతం(వారసత్వం).
    నిలువు:
    1)అంగరాజు,2)కుప్పం,4)నుయ్యి,5)ణంరకవ్యా,6)ఉరము,10)రాబడి,11)దురద,14)తెరచాప,15)మేధావి,16)శరాఘాతం,20)మేమా,21)క్షిర.

    రిప్లయితొలగించండి
  4. భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
    అడ్డం 17, 23, నిలువు 2(చివరి అక్షరం),6(చివరి అక్షరం), 21 తప్ప మిగిలినవన్నీ సరి పోయాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. గళ్ళ నుడి కట్టు - 61 సమాధానాలు:
    అడ్డం:
    1.అంతకుడు, 3.త్రనుత్రాణం, 7.రాణి, 8.కారణం, 9.జింక, 12.సొబగు, 13.క్షీరదం, 17.రవ్వ, 18.విధాత, 19.చేరా, 22.పశ్చిమాద్రి, 23.పిత్రార్జితం.
    నిలువు:
    1.అంగరాజు, 2.కుప్ప, 4.నుయ్యి, 5.ణంరకవ్యా[వ్యాకరణం], 6.ఉరగం, 10.రాబడి, 11.దురద, 14.తెరచాప, 15.మేధావి, 16.శరాఘాతం, 20.మేమా, 21.తత్రా (త్రాత).

    రిప్లయితొలగించండి