12, అక్టోబర్ 2010, మంగళవారం

ప్రహేళిక - 8

ఇది ఏమిటి?
తే.గీ.
తోక, నాగలి, మకరమ్ము, తూతకొమ్ము
పలుక మూడక్షరమ్ముల పదము లందు
మొదటి యక్షరమ్ములఁ జూడఁ బోను రాను
సాధనం బగు నది యేది? సాధుశీల!

(తూతకొమ్ము = పిల్లనగ్రోవి)
ఇది ఏమిటో చెప్పండి.

9 కామెంట్‌లు:

  1. ప్రహేళిక - 8 సమాధానం:

    తోక = వాలము
    నాగలి = హలము
    మకరము = నక్రము
    తూతకొమ్ము = మురళి

    "వాహనము"

    రిప్లయితొలగించండి
  2. శంకరయ్య గారి శంకరాభరణము
    సకల జనులు మెచ్చె! సర్వ శుభము!
    సమయమేమి లేక సతమత మగుచుంటి
    కొలువు జేయు నాకు సులువు గాదు.

    సమస్య:

    తోక = వాలము
    నాగలి = హలము
    మకరము = నకము (మొసలి)
    తూతకొమ్మ = మురళి.

    మొదటి అక్షరాలు చదివితే = వాహనము అని వస్తుంది.

    రిప్లయితొలగించండి
  3. వాలము,హలము,నక్రము,మురళి.= జవాబు = " వాహనము. " అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  4. వాలము, హలము, నక్రము, మురళి => వాహనము.

    రిప్లయితొలగించండి
  5. మందాకిని గారూ,
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మిట్టపెల్లి అమల గారూ,
    నేదునూరి రాజేశ్వరి గారూ,
    పద్మ గారూ,
    మిస్సన్న గారూ,
    మీ అందరి సమాధానాలు సరైనవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    ధన్యవాదాలు.

    మీ కివే వందనమ్ములు టేకుమళ్ళ
    వెంకటప్పయ్య గారు! నా వంకఁ జూచి
    పెక్కు నాళ్ళయ్యె; క్షేమమా? వీలుఁ జూచు
    కొనుచు నా బ్లాగు వీక్షింపఁ గోరుచుంటి.

    రిప్లయితొలగించండి