10, అక్టోబర్ 2010, ఆదివారం

సమస్యా పూరణం - 120

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
పసిబాలుడు మద్య మడిగె పాలొల్ల ననెన్.
( ఈ సమస్యను సూచించిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు )

12 కామెంట్‌లు:

  1. మిసమిస వెలుగులు పొడవగ
    వెస దెరచిన బానసాల వెసనము దోడన్
    బిసరుహ వదనయు దూరగ
    పసిబాలుడు మద్య మడిగె పాలొన్న ననెన్

    రిప్లయితొలగించండి
  2. నమస్కారమండీ, చిన్న సవరణ


    మిసమిస వెలుగులు పొడవడ
    వెస దెరచిన బానసాల వెసనము దోడన్
    బిసరుహ వదనయు దూరగ
    పసిబాలుడు మద్య మడిగె పాలొన్న ననెన్

    రిప్లయితొలగించండి
  3. గురువుగారికి నమస్సులు.త్రాగుబోతు భర్తతో భార్య అన్న పల్కులివి.

    పొసగదు నీకున్నాకును
    పసిబాలుడు మద్యమడిగె పాలొల్లననెన్
    వ్యసనముకు బానిసై మా
    యుసురును తీస్తుంటివింక యోరిమి చచ్చెన్.

    రిప్లయితొలగించండి
  4. ముసి ముసి నగవుల బుడతడు
    పసి వయసునె తన జనకుని పద్దతి గాంచెన్
    దసరకు మాత్రమె తండ్రికి
    పసి బాలుడు మద్యమడిగె పాలొన్నననెన్ !
    (మద్యపానం ఆరోగ్యానికి హానికరం .చట్టబద్ద హెచ్చరిక)

    రిప్లయితొలగించండి
  5. అసుర పురిలోన జరిగిన ,
    నిసి రాతిరి వేడుకలలొ నేమని చెప్పన్
    అసురుల ఏలిక,నతి రూ
    పసి,బాలుడు మద్య మడిగె పాలొన్న నన్ !

    రిప్లయితొలగించండి
  6. బుసలిడు ద్రవము గాంచిన
    పస తెలియని బాలుడంత గ్లాసందు కొనెనన్
    కసిరెను తనయుని విసురుగ
    పసి బాలుడు మధ్య మడిగె పాలొల్ల ననెన్ !

    రిప్లయితొలగించండి
  7. వెస కల్లు,పాల గాంచియు
    పసదెలియక పాత్రమెరుపు(బట్టి ఋజుత
    న్విసమగు నాసీసా గని
    పసిబాలుడు మద్య మడిగె పాలొన్న ననెన్
    సూచన: ఋజుత = అమాయకత్వము.

    రిప్లయితొలగించండి
  8. ఇంకొక పూరణ: "శ" కి "స" కి ప్రాస మైత్రి వుంది కదా!

    కుశుడను మునిబాలకుడట
    కుశలత నతిధి న్ధవునకు గోరస మీయన్
    కసరగ నివ్వెఱపడె తా
    పసి బాలుడు, మద్య మడిగె పాలొన్న ననెన్.

    రిప్లయితొలగించండి
  9. అసలైన పాలు కావవి
    అసరాగా నీళ్లు కలిపి యాశగ నమ్మన్
    సిసలైన సరుకు జూసెను
    పసి బాలుడు, మద్య మడిగె పాలొన్న ననెన్.

    రిప్లయితొలగించండి
  10. గన్నవరపు నరసింహ మూర్తి గారూ
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    మీ పూరణ అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.

    మంద పీతాంబర్ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.

    నేదునూరి రాజేశ్వరి గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    కాని రెండవ పాదంలో యతి తప్పింది. దానిని ఇలా సవరించాను.
    "పస తెలియని బాలుఁ డంత పట్టెను గ్లాసున్"

    చంద్రశేఖర్ గారూ,
    మంచి పూరణలు. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం ఉంది. "బట్టియు ఋజుతన్" అంటే సరిపోతుంది.
    "శ-స" ప్రాసను కొందరు అంగీకరిస్తారు. నిజమే. కాని అందరికీ ఆమోదయోగ్యం కాని ప్రాస అది.

    రిప్లయితొలగించండి
  11. అసురుల రాముడు చంపం
    గ,సురను గ్రోలగ తపసులు గడగడ మనుచున్
    ముసిముసి నవ్వులతో తా
    పసిబాలుడు మద్య మడిగె పాలొల్ల ననెన్

    రిప్లయితొలగించండి
  12. రసికుని యింటను పుట్టుచు
    తసదియ తెలగాణమందు తండ్రిని గాంచన్
    ముసిముసి నవ్వుల తోడన్
    పసిబాలుడు మద్య మడిగె పాలొల్ల ననెన్

    రిప్లయితొలగించండి