31, అక్టోబర్ 2010, ఆదివారం

సమస్యా పూరణం - 139

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది
నైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యెన్.
దీనిని పంపించిన దోర్నాల హరి గారికి ధన్యవాదాలు.

32 కామెంట్‌లు:

  1. గురువుగారూ ఆరోగ్యానికి ఆదిత్యుణ్ణీ, సిరిసంపదలకు శివుణ్ణీ, మోక్షానికి ముకుందుణ్ణీ ప్రార్ధించాలని పెద్దలు చెప్పగా విన్నాను. అందుకు అలా వ్రాశాను. నమస్సులు.

    రిప్లయితొలగించండి
  2. ఆ ’తెలగాణ’కు మద్దతు
    నే తెలుపుచునుంటి నన్న నేతయె, మార్చెన్
    తా తదుపరి మాట! ఎటుల
    నైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యెన్?

    రిప్లయితొలగించండి
  3. నమస్కారములండీ మాస్టారూ, సేతువుకి వారధి అని అర్ధము తెలుసు, సముద్రము అని కూడా అర్ధము ఉందా ?

    రిప్లయితొలగించండి
  4. మూర్తి గారూ,
    సేతువుకు సముద్రమనే అర్థం లేదు.

    రిప్లయితొలగించండి
  5. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    బాగుంది. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం ఉంది.
    "భీతిని విడి గురుపత్నిని" అంటే సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  6. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    పూరణ అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. వైతాళికుడెవ్వడు,గన,
    బేతాళుడె,నీతుల పలురీతుల గోతిన్
    పాతర జేసెడి ఘనుడే,
    నైతిక విలువలను వీడి నాయకుడయ్యెన్ !

    రిప్లయితొలగించండి
  8. సీతను దెచ్చుట తప్పని
    నేతకు బోధించె కాని నిష్ఫల మయ్యెన్
    నేతయె లంకకు తుదకు అ-
    నైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యెన్.

    రిప్లయితొలగించండి
  9. మంద పీతాంబర్ గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.
    కాని రెండవ పాదంలో యతి తప్పింది.

    రిప్లయితొలగించండి
  10. మిస్సన్న గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. మాస్టారూ, ధన్యవాదములు. అప్పుడు ముందు పంపిన పద్యాన్ని ఉపసం హరించు కొంటాను.

    మొదటి పాదములో, భీతిని వీడి గురుసతిని అని వ్రాసాను. గణాలు సరిపోవాలే.

    మీరు భీతిని విడి గురుపత్నిని గా సరిదిద్దారు అది కూడా సరిపోతుంది. ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  12. ఆ తండ్రి పదవి మాటున
    భూతల వనరులను పొంది, భూములు కబ్జా
    పాతెను, గోతులు తీసెను,
    నైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యెన్.

    రిప్లయితొలగించండి
  13. భీతిని విడి గురుపత్నిని
    పాతకమని యెంచకుండ పైకొని దారన్
    ప్రీతిగ మిన్నంటె శశియు
    నైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యెన్.

    రిప్లయితొలగించండి
  14. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    నిజమే. "భీతిని వీడి గురుసతిని" అన్నప్పుడు గణదోషం లేదు. నేను తప్పుగా ఎలా భావించానో? క్షమించాలి. రెండవ పాదాన్ని సవరించాక ఇప్పుడు బాగుంది.

    రిప్లయితొలగించండి
  15. నచికేత్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. పాతెను లోతుగ నిజమును
    పాతకముల పొంది డబ్బు పంచెను ప్రజకున్
    వాతలు పెట్టగ నాపై
    నైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యెన్

    రిప్లయితొలగించండి
  17. గురువుగారూ! బుర్రకు మరింత పదును పెట్టే వారాంతపు సమస్యకై ఆసక్తిగా యెదురు చూస్తున్నాము.వందనాలు.

    రిప్లయితొలగించండి
  18. జాతికి బ్రాణమ్ముల నిడు
    దాతలకై ధార వోయు ధరణిక భాగం ?
    ఈ తీరు మసలు దైత్యుడు
    నైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యెన్.

    కార్గిలు మృతవీరుల కుటుంబాల కిచ్చిన భూమిలో భాగం కోరడం అన్యాయము

    రిప్లయితొలగించండి
  19. మిస్సన్న గారూ,
    ఉత్తమమైన పూరణ. అభినందనలు.
    వారాంతపు సమస్యా పూరణకై మీ ఉత్సాహం ప్రశంసనీయం. వీలైతే రేపు "వారాంతపు సమస్య"ను ఇస్తాను.

    రిప్లయితొలగించండి
  20. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మంచి భావంతో సమస్యను పూరించారు. అభినందనలు.
    సాధారణంగా పద్యాలను గ్రాంధిక భాషలో వ్రాస్తాం. పదాంతంలో అనుస్వారం వ్యావహారికం. గ్రాంధికంలో "ము, ంబు" ప్రత్యయాలుండాలి. మీ పద్యం రెండవ పాదం చివర "భాగం" అన్నారు. దానిని "భాగం బీ తీరు" అంటే సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  21. ధన్యవాదములు. అందుకే గురువు లేని విద్య రాణించదు అంటారు. ఆ స్థానంలో యుండి మీరు మా బోటి వారలకు వయోజన వి(ప)ద్యా కేంద్రాన్ని నడుపుతున్నారు. ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  22. తా తప్పెరింగిన బలి య (అ)
    నైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యె
    న్నంత హరి యనుగ్రహమున
    నీతడు సావర్ణి మనువున దేవేంద్రుడగున్ !

    రిప్లయితొలగించండి
  23. మాష్టారుగారు, నాల్గవ పాదంలో గణదోషం సవరించి పంపుతున్నాను. ముందు పంపినవి తీసేయండి.

    తా తప్పెరింగిన బలి య (అ)
    నైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యె
    న్నంత హరి యనుగ్రహమున
    నీతడు సావర్ణి మనువు దేవేంద్రుడగున్ !

    రిప్లయితొలగించండి
  24. కవిమిత్రులకు,
    ఆంద్ర రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
    సర్వేజనాస్సుఖినో భవంతు.

    రిప్లయితొలగించండి
  25. చంద్రశేఖర్ గారూ,
    మంచి విషయాన్నెత్తుకొని సమస్యను పూరించారు. అభినందనలు.
    కాని నాల్గవ పాదంలో యతి తప్పింది.

    రిప్లయితొలగించండి
  26. చంద్రశేఖర్ గారూ,
    ధన్యవాదాలు. మీకు కూడ శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  27. యతి గురించి పదం వేసేటప్పుడే ఆలోచించాను. చివరకు "నీతడు" లో "న + ఈ" మరి "దేవేంద్రుడు" లో "ద +ఏ" వుండటంవల్ల "ఈ", "ఏ" లకు యతి కలుస్తుందని అనుకొంటూనే వేశాను. దయచేసి వివరించగలరు.

    రిప్లయితొలగించండి
  28. ఘాతుక చర్యలు జేసియు
    భీతిల్లక హిట్లరునకు భీభత్సమునన్
    రీతిగ గెలిచిన స్టాలిను
    నైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యెన్

    రిప్లయితొలగించండి
  29. ప్రీతిగ పెండ్లాడి భువిని
    నేతను నేనే యనుచును నెత్తిని నేలన్
    పాతర బెట్టుచు మామను
    నైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యెన్

    రిప్లయితొలగించండి