17, అక్టోబర్ 2010, ఆదివారం

దసరా శుభాకాంక్షలు

"శంకరాభరణం"
బ్లాగు వీక్షకులకు, మార్గదర్శకులకు, కవి మిత్రులకు, హితులకు
విజయదశమి శుభాకాంక్షలు!
వశమయ్యె మీదు స్నేహము
యశమును గడియించె "శంకరాభరణము" బ్లా
గ్యశ కారకులార! విజయ
దశమి శుభాకాంక్షలివె సదా మీ హితుఁడన్.

కంది శంకరయ్య.
దసరా శుభాకాంక్షలు
శంకరాభరణమే సాహిత్య మణి రత్న
మాలయై శోభాయమాన మయ్యె ,
పూర్వ కవీంద్రుల భూరికావ్యము లోని
పద్యచమత్కృతి ప్రాభవాలు
పదపదంబున దాగి పరికించు మనిగోరు
ఆ ప్రహేళికలపై ఆశలూరు
పూరణ చరణాల పూరణల్ సవరించి
పూర్ణత జేకూర్చు పూజ్య గురువు
దత్తపదు లెన్నొ మాలలో దాగియుండు
గళ్ళనుడి కట్టు పదరీతి గతులదెలుపు
ఎన్నగా జూడ భాషకు వన్నె గూర్చ
సఫల మయ్యారు గురువు శ్రీ శంకరయ్య !.

గన్నవరపు మూర్తి మిన్నగా జెప్పును
చంద్ర గారు జెప్పు చక్క గాను ,
నేదునూరి వారు నేర్పుగా చెబుతారు,
అంద రికిని దసర వంద నములు .


యీ బ్లాగులో పాల్గొంటున్న , వీక్షిస్తున్న మిత్రు లందరికి
వి జ య ద శ మి శుభాకాంక్షలు .
మంద పీతాంబర్
ధన్య వాదములు. పీతాంబర్ గారు." మీ వందనములకు అభినందనములు.' అందరికి విజయ దశమి శుభా కాంక్షలు.గురువులు,బహుముఖ ప్రజ్ఞాశాలి ' శంకరయ్య గారికి ప్రత్యేకాభి నందనలు.
ప్రీతి తోడ జెపును పీతాంబరు గారు
గన్నవరపు జెప్పు గగన మెరుపు
చంద్ర గారు జెప్పు చంద్రుని వెలుగంత
సరస గతిని నేర్పు శంకర గురువర్య.
వందనమ్ము లివియె యందుకొను మందరు
దోస మెంచ వలదు దశమి గనుక

రాజేశ్వరి నేదునూరి

5 కామెంట్‌లు:

  1. మీకు,మీ కుటుంబ సభ్యులకు కూడా విజయ దశమి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  2. కంది శంకరయ్య గారు!
    మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయ దశమి పర్వదిన శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  3. రాజ రాజులకును నిజరూప చింతనా
    సక్తులగు యతులకు; రక్తులకు వి
    రాగులకును కోరిన గుణములిచ్చెడు
    మాత శుభము లొసగుగాత మీకు!
    మిత్రులకు, గురువర్యులకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  4. జయవిజయీ భవ, దిగ్వియీభవ ||
    చిన్నప్పుడు బళ్ళో మాచేత పాడించిన దసరా పద్యాలతో
    కవి ముత్రులందరికి దశరా శుభాకాంక్షలు.

    శ్రీకంఠపుత్రాయ సృష్టికర్తాయ,
    వాగీశ వంద్యాయ నాగభూషాయ
    గుజ్జు వేల్పుల మిమ్ము గొల్తు మెపుడు,
    జయ విజయీభవ, దిగ్విజయీభవ||

    జయతు పుస్తక పాణి జయ నీలవేణి
    నీల నీరద వేణి నిత్యకల్యాణి
    శిరులిచ్చి మమ్మేలు శ్రీ శారదా౦బ
    జయ విజయీభవ, దిగ్విజయీభవ ||

    శ్రీరస్తు విజయస్తు చిరకీర్తి రస్తు ||
    బాలలా దీవెనలు బ్రహ్మ దీవెనలు
    ఆశ్వయుజశుద్ధనవమి మొదలు,
    ఏడాది కొకదినము వేడ్కతో మిమ్ము
    శ్రీరస్తు విజయస్తు చిరకీర్తి రస్తు||

    వేడవచ్చితిమిపుడు విభవంబుగాను
    అయ్యవారికి చాలు ఐదు వరహాలు
    పిల్లవాండ్లకు చాలు పప్పుబెల్లాలు
    శ్రీరస్తు విజయస్తు చిరకీర్తి రస్తు ||

    రేపురా మాపురా మళ్ళి రమ్మనక
    ఏదయామీదయా ఇప్పించరండి
    చిన చిన్నబాలురము మేము
    శ్రీరాములిచ్చు శిరుయు నాయువులు||

    శ్రీరస్తు విజయస్తు చిరకీర్తి రస్తు,
    జయ విజయీభవ, దిగ్విజయీభవ||

    రిప్లయితొలగించండి