27, జులై 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 775 (వరలక్ష్మీవ్రతముఁ జేయ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
వరలక్ష్మీవ్రతముఁ జేయవలదంద్రు బుధుల్.

20 కామెంట్‌లు:

  1. మరి శ్రావణ భృగు వారము
    హరునర్ధాంగికి వ్రతములు నటులే చూడన్
    సరి మంగళ వారమునను
    వరలక్ష్మీవ్రతముఁ జేయవలదంద్రు బుధుల్.

    రిప్లయితొలగించండి
  2. స్థిరభక్తియు, శ్రద్ధ, మనః
    పరిపాకము ధర్మమందు పరమాదరమున్
    మరచిన నాస్తిక జీవులు
    వరలక్ష్మీవ్రతముఁ జేయవలదంద్రు బుధుల్.

    రిప్లయితొలగించండి
  3. పరమత విద్వేషమతులు
    వరలక్ష్మీ వ్రతము ఝెయవలదంద్రు, బుధుల్
    వర హృదయమ్మున నందురు
    వరలక్ష్మీ వ్రతము భాగ్య వరదంబనుచున్

    రిప్లయితొలగించండి
  4. ధరలో నడమంత్రముచే
    సిరులను గోరుచును వేగ శ్రీ దేవి కృపన్
    అరకొర భక్తిని మనమున
    వరలక్ష్మీ! వ్రతముఁ జేయవలదంద్రు బుధుల్.

    రిప్లయితొలగించండి
  5. వీరశైవ, లింగాయత స్త్రీ మనసులో మాటగా:
    పరమేశ్వర జంగమ కా
    వర! లక్ష్మీవ్రతముఁ జేయవలదంద్రు బుధుల్
    మరి నే మంగళగౌరీ
    పర దేవతనే కొలుతును పాపవినాశా!

    రిప్లయితొలగించండి
  6. ధరణిన యోగ్యత లేకనె
    వరముల బడయంగలేరు! వాక్కిది వినుమా!
    వరములఁ బొంద నయోగ్యులు
    వరలక్ష్మీవ్రతముఁజేయవలదంద్రు బుధుల్!

    రిప్లయితొలగించండి
  7. స్థిరనిష్ఠ నాచరింపుము
    వరలక్ష్మీవ్రతముఁ; జేయవలదంద్ర్ర్రు బుధుల్
    సురపాన మాంసభక్షణ
    లరయఁగఁ బాపమ్ముఁ గూర్చు నట్టివటంచున్.

    రిప్లయితొలగించండి
  8. హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘హరి యర్ధాంగికి’ అనబోయి ‘హరు నర్ధాంగికి’ అన్నారేమో అని సందేహం.
    *
    చంద్రమౌళి గారూ,
    ‘చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా’ అన్నట్టు మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    పందిత నేమాని వారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. శంకరార్యా ధన్యవాదములు.
    శ్రావణ మంగళ వారం గౌరీ వ్రతం, శుక్ర వారం వర లక్ష్మీ వ్రతం చేయుట సంప్రదాయం..అటుదిటు ఇటుదటు చేయ కూడదని బుధులంటారని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  10. ధరలో నోములు పూజల
    తరుణుల కింపైన వ్రతము తరియిం చంగన్ !
    స్థిరమైన భక్తి మరచిన
    వరలక్ష్మీ వ్రతముఁ జేయ వలదంద్రు బుధుల్ !

    రిప్లయితొలగించండి
  11. సరవిని విధవలును, స్వయం
    వరము జరుగనట్టి పిన్న పడుచు, లుదక్యల్,
    పురుటింటివా, రశౌచులు
    వరలక్ష్మీ వ్రతముఁ జేయవలదంద్రు బుధుల్.

    రిప్లయితొలగించండి
  12. సిరులిడుశ్రీదేవినెపుడు
    వరలక్ష్మి వ్రతము జేయు వనితల కెల్లన్
    త్వరపడి నాషాడంబున
    వరలక్ష్మీవ్రతముఁ జేయవలదంద్రు బుధుల్!!!

    రిప్లయితొలగించండి
  13. హనుమచ్ఛాస్త్రి గారూ,
    నిజమే. నేనె పొరబడ్డాను. మన్నించండి.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. గురువుగారికి నమస్సులు, నా పూరణ మీద మీ వాఖ్య మరచారు. అదే నాకు టానిక్కు

    రిప్లయితొలగించండి
  15. సహదేవుడు గారూ,
    నిజమే... మౌజ్ చక్రాన్ని పైకి కిందికీ తిప్పినప్పుడు తప్పిపోయింది.
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ధరణిన్ లేదా ధరణిని అంటే బాగుండేది.

    రిప్లయితొలగించండి
  16. చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    మా మిత్రుని తల్లి ఉండేది. మార్కెట్‌కు వెళ్ళాలంటే వేంకటేశ్వరాలయం ముందునుంచి వెళ్ళాలి. ఆవిడ దూరమైనా సరే చుట్టూ తిరిగి వెళ్ళి వచ్చేది. తప్పని పరిస్థితుల్లో ఆగుడిముందు నుంచి వెళ్ళవలసి వస్తే కొంగుచాటు చేసుకొని ముఖం తిప్పుకొని వెళ్ళేది. మేం ఆమెను చూసి నవ్వుకునేవాళ్ళం.

    రిప్లయితొలగించండి
  17. గురువుగారూ. నేను మీకు అజ్ఞాత శిష్యుడ్ని. తెలుగు పద్యాలంటే చాలా ఇష్టం. మీ బ్లాగు ప్రతీరోజూ ఒక గంటైనా చూస్తాను. పండితులు కొందరు రాసే సమస్యాపూరణం పద్యాలు వాటిపై మీ వ్యాఖ్యలు సవరణలు చదువుతుంటాను. చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. బ్లాగులో వ్యాఖ్య రాయటం మొదటి ప్రయత్నం. తప్పులుంటే మన్నించండి. నమస్కారం.... మీ శిష్యుడు... కట్టా సత్యనారాయణ రాజు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కట్టా సత్యనారాయణ రాజు గారూ,
      మీ లేఖ నాకు ఆనందాన్ని కలిగించింది. మీరు కూడా పద్యాలు వ్రాయడానికి ప్రయత్నించండి. మీకు అన్ని విధాలా సహకరించడానికి నేనూ బ్లాగు మిత్రులు ఉన్నాం. అంతేకాకుండా మీకు నచ్చిన పూరణలను గురించి వ్యాఖ్యానించండి. కవులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

      తొలగించండి
  18. దొరసాని వోలె గట్టిగ
    నరచుచు మగడిని కసిరెడి నారీమణి నీ
    విరసము దుర్భరమవగా
    వరలక్ష్మీవ్రతముఁ జేయవలదంద్రు బుధుల్

    రిప్లయితొలగించండి
  19. తిరుగుచు క్లబ్బుల వెంటను
    పరువులు బెట్టించి మగని పచ్చల కొరకై
    కరచుచు నత్తయ్య నెపుడు
    వరలక్ష్మీవ్రతముఁ జేయవలదంద్రు బుధుల్

    రిప్లయితొలగించండి