23, మే 2012, బుధవారం

ప్రత్యేక వృత్తము - 11

రథోద్ధతము -

ఇది 11వ ఛందమైన ‘త్రిష్టుప్పు’లో 698వ వృత్తము.
‘యత్ర యత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్’ అనే శ్లోకము ఉన్నది కదా - అది రథోద్ధత వృత్తమే.  


లక్షణము -
గణములు - ర న ర వ.
యతిస్థానము - 7వ అక్షరము 
ప్రాస నియమము కలదు 

ఉదా:
శ్రీ రఘూద్వహ! విశేష వైభవా!
ధారుణీ ప్రియసుతా హృదీశ్వరా!
వీరవర్య! ఘన విక్రమోన్నతా!
సారసాక్ష! త్రిదశ ప్రపూజితా!


పట్టుబడినదంటే చాల చక్కగా నడుస్తుంది.  స్వస్తి!

పండిత రామజోగి సన్యాసి రావు

12 కామెంట్‌లు:

  1. దేవకీతనయ! ధీరపూరుషా!
    సేవఁ జేతునిక చిత్తగింపుమా!
    దేవదేవ! హరి! దీవనమ్ముతో
    పావనంబగును పాపిజీవితమ్.

    రిప్లయితొలగించండి
  2. రా మ వర్ణములతో ఈ కొత్త ప్రయోగమును చూడండి:

    రా మదాత్మహిత! రాజశేఖరా!
    రా మనోహర! ధరాసుతావరా!
    రా మహేంద్రనుత! రాక్షసాంతకా!
    రా మహాత్మ! రఘురామ! రక్షకా!

    రిప్లయితొలగించండి
  3. ప్రేమతోడనిను పిల్చుచుంటినో
    రామచంద్ర!యిటు రమ్ము కావగా
    మామకాఘములు మాడ్చివేయుచున్
    నీమహాత్మతను నిల్పుమాయికన్.

    రిప్లయితొలగించండి
  4. సత్యచారులయి సాధుశీలురై
    నిత్యశాంతులయి నిర్మలాత్ములై
    జాత్యతీతులగు శత్రుహీనులా
    దిత్యతుల్యులయి తేజరిల్లరా.

    రిప్లయితొలగించండి
  5. కోరలేదెపుడు కోట్లసంపదల్
    దూరలేదు నిను దుర్మదాంధతన్
    నేరమేమిటిక? నీదుభక్తునిన్
    చేరరావుమరి శ్రీరమాధవా!

    రిప్లయితొలగించండి
  6. జీవదాతయును చిత్స్వరూపియున్
    పావనుండనెడు భావనంబుతో
    నీవెదిక్కనుట నేరమా హరీ!
    కావవేమి మరి కైటభాంతకా!

    రిప్లయితొలగించండి
  7. జ్ఞానశూన్యుడను కాముకుండనై
    దీనబంధుడగు దేవదేవ! నిన్
    కానరావనుచు కాఱులాడితిన్
    నేను మూర్ఖుడను నిత్యసౌఖ్యదా!

    రిప్లయితొలగించండి
  8. శ్రీమతి లక్ష్మీ దేవి గారు మరియు శ్రీ హరి వారు మంచి స్ఫూర్తితో ధారాశుద్ధితో రథోద్ధితములను వెలువరిస్తున్నారు. చాలా సంతోషము. శుభాభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. ఆర్యా!
    నమస్కారములు.
    నా నాలుగవ పద్యం (జీవదాతయును అనేది)నాలుగవ పాదంలో దొరలిన టైపు పొరపాటును "కావవేమి మధుకైటభాంతకా!" అను విధముగా సరిచేసి చదువవలసినదిగా ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  10. లక్ష్మీదేవి గారూ,
    చక్కని పద్యం రాసారు. అభినందనలు.
    కాని ‘జీవితమ్’ అని హలంతపదాన్ని ప్రయోగించడం దోషమే.
    *
    పండిత నేమాని వారూ,
    శబ్దాలతోను, ఛందస్సుతోను లీలాకేళి మీ సొంతం. ధన్యవాదాలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ ఐదుపద్యాలూ పంచరత్నాల్లా శోభిస్తున్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. మా బండి చాలా లేటు.

    శ్రీ రమారమణ! చింతితార్థదా!
    మారకోటిసుకుమార సుందరా!
    చారుఫుల్లరవి చంద్ర లోచనా!
    చేరి గొల్తు నను చేర దీయరా.

    రిప్లయితొలగించండి
  12. మారెళ్ళ వామన కుమార్గురువారం, మే 24, 2012 6:40:00 PM

    వేరు కోర్కెలిక వేడుకొననులే
    మారు మాటలిక బల్కబోనులే
    చేరి ఈశ్వరుని పాదపద్మముల్
    గోరి గొల్చెదను కూర్మి మీరగన్.

    రిప్లయితొలగించండి