పండిత నేమాని వారూ, ఉత్తమమైన పూరణ చెప్పారు. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, చక్కని పూరణ మీది. అభినందనలు. * మంద పీతాంబర్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * సత్యనారాయణ మూర్తి గారూ, మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు. * కమనీయం గారూ, నిజమైన నిధులేవో వివరిస్తున్న మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, చాలా మంచి పూరణ చెప్పారు. అభినందనలు. * సహదేవుడు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘అలుపు యాకలి’ని ‘అలుపు నాకలి’ అందాం.
విద్య వినయమ్ము విజ్ఞాన విభవ దీప్తి
రిప్లయితొలగించండివిమల సంస్కారమను లక్షణములతోడి
పెన్నిధులు గల్గి సుఖియించు బేదవాడె
యనెడు రీతి మెలగుచు నహమ్ము వీడి
తనదు కోర్కెల దీర్చెడు తండ్రి వోలె
రిప్లయితొలగించండిదైవమే తోడయి నిలిచి దారిజూప
పరమ భాగవతుడయిన భక్తుడన్ని
పెన్నిధులు గల్గి సుఖియించు పేదవాడె
వంద గదులున్నమేడలు వాహనములు
రిప్లయితొలగించండిలక్ష కోట్లైన నిధులున్న లాభమేమి?
నీతి దప్పిన దుఃఖంబు నిజము; సుగుణ
పెన్నిధులు గల్గి సుఖియించు బేదవాడె!!!
సర్వలోకైకమాతయై జనుల కెపుడు
రిప్లయితొలగించండిసిరులు పంచెడు జగదంబ చిత్స్వరూప
సన్నిధిని జేరి భక్తితో సన్నుతించ
పెన్నిధులు గల్గి సుఖియించు పేదవాడె.
సాధ్వి,యనుకూలవతి యైన సతియు,చక్క
రిప్లయితొలగించండినైన సంతానమును,విద్య, సజ్జనాప్త
మిత్ర సాంగత్యమును,దృప్తి ,మితము గల్గు
పెన్నిధులు గల్గి సుఖియించు బేదవాడె.
కలిమి లేములు మనిషికి కొలత కావు
రిప్లయితొలగించండిమంచి మనసున్న సతిసుతుల్ మమత చాలు
దైవ చింతన కలిగిన తనివి వంటి
పెన్నిధులు గల్గి సుఖియించు బేద వా డె !
నేడు యాకలి దప్పిక నిద్ర లుడిగి
రిప్లయితొలగించండిపరుగు లెత్తించు వ్యాజ్యాల బ్రతుకు లీడ్చ
అలుపు యాకలి నిద్రాదు లలర, నట్టి
పెన్నిధులు గల్గి సుఖియించు( బేద వా(డె
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిఉత్తమమైన పూరణ చెప్పారు. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
చక్కని పూరణ మీది. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సత్యనారాయణ మూర్తి గారూ,
మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
*
కమనీయం గారూ,
నిజమైన నిధులేవో వివరిస్తున్న మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
చాలా మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘అలుపు యాకలి’ని ‘అలుపు నాకలి’ అందాం.
ఉన్న దానితో సంతృప్తి నొందు చుండు
రిప్లయితొలగించండిరేపటిని గూర్చి చింతన తోపనీడు
రెక్కలను నమ్ముకొను యోగి రీతి తృప్తి
పెన్నిధులు గల్గి సుఖియించుఁ బేదవాఁడె.
శాంతి గలిగిన నొనగూరు సౌఖ్య మెపుడు
రిప్లయితొలగించండిసుఖము శాంతిని బొందడు చూడ నొకడు
పెన్నిధులు గల్గి, సుఖియించు బేద వాడె
పెన్నిధులు లేక మనసున శాంతి యున్న.