కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...
జారులు చోరులున్ కుటిలచారులు దుష్టులు దుర్మదాంధులున్.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...
జారులు చోరులున్ కుటిలచారులు దుష్టులు దుర్మదాంధులున్.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.
తారకమంత్ర మెయ్యదియొ, ధర్మము నిల్చునొ నిల్వదో గదా!
రిప్లయితొలగించండిధీరత గల్గి దేశమున దివ్యసుఖంబులు గల్గునా యికన్
భారతమందు నేడు పరిపాలకవర్గముఁ జూడ పెక్కురున్
జారులు, చోరులున్, కుటిలచారులు, దుష్టులు, దుర్మదాంధులున్.
ఘోరములైన పాపములకోట్లు హరించును, కీర్తి బెంచు మా
రిప్లయితొలగించండికోరికలన్ని దీర్చునని కోరి భజింపగ వేంకటేశునిన్
చేరెడు వారు కేవలసుశీలురు, భక్తులె గాదు చూడగా
జారులు, చోరులున్, కుటిలచారులు, దుష్టులు, దుర్మదాంధులున్.
మూర్తి గారూ! రెండు పూరణలూ దేనికదే 'కేక ' ..అభినందనలు.
రిప్లయితొలగించండిచేరిరి యొక్కచోట పడి సేవలు చేతుము మీకటంచు నూ
రిప్లయితొలగించండిరూరును చుట్టుచున్ ప్రజల లో బల హీనతలన్ని సొమ్ముతో
బారులు దీరగాగొని నుపాయము నెన్నిక గెల్వ జూతురే
జారులు, చోరులున్, కుటిలచారులు, దుష్టులు, దుర్మదాంధులున్.
చిన్న సవరణ తో...
రిప్లయితొలగించండిచేరుచు నొక్కచోట పడి సేవలు చేతుము మీకటంచు నూ
రూరును చుట్టుచున్ ప్రజల లో బల హీనతలన్ని సొమ్ముతో
బారులు దీరగాగొని నుపాయము నెన్నిక గెల్వ జూతురే
జారులు, చోరులున్, కుటిలచారులు, దుష్టులు, దుర్మదాంధులున్.
మనదేశములోకి వ్యాపరమంటూ జొరబడి, మన సంపదను దోచుకొనిపోయిన ఆంగ్లేయులను ఉటంకిస్తూ........
రిప్లయితొలగించండిబేరములాడజొచ్చి తమ పేర ప్రభుత్వము సృష్టిజేసి, యా
ధారములైనవజ్రఖచితమ్మగు సంపదలింటజేర్చి , ని
స్సారముజేసి వీడిరి విశాలసమున్నత భారతావనిన్
జారులు చోరులున్ కుటిలచారులు దుష్టులు దుర్మదాంధులున్.
ఆర్యా!
రిప్లయితొలగించండిహనుమచ్ఛాస్త్రిగారూ!
ధన్యవాదములు.
గుండా సహదేవుడు గారి పూరణ......
రిప్లయితొలగించండినేరక యెన్నుకొంటిమయ నేతల మాతలరాతమార్చగన్?
మారెను వారి రాతల సమానపు రీతిగ వేంకటేశ్వరా!
కూరిన సంపదల్ నడతఁ గూల్చగ వారల పెక్కువారలున్
జారులుచోరులున్ కుటిలచారులు దుష్టులు దుర్మధాంధులున్!
దారుణ మైన దుస్థితికి దోషము లెంచక నెందరెందరో
రిప్లయితొలగించండిమారణ హోమముల్ జరిపి మానని గాయము మాన్ప కుండ గా
భారము గల్గదే భువికి పాపుల సంతతి పెంపు జేయగా
జారులు చోరులున్ కుటిల చారులు దుష్టులు దుర్మదాం దులున్ !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆకాశములో పెద్ద చందమామను చూచి,
రిప్లయితొలగించండిచారుతరంబుగాఁ జదలఁ జల్లని వెన్నెల చౌకళింప దా
మారుని మించు సోయగము మైమరపించెనె చందమామయున్
భూరిగ మెచ్చ భూప్రజలు, పూర్ణుఁడు గిట్టడు వీరి కేలనో
జారులు చోరులున్ కుటిలచారులు దుష్టులు దుర్మదాంధులున్
సత్యనారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు వైవిధ్యంగా చక్కగా ఉన్నాయి. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
వారు మన సంపదలను దోచుకొనడమే కాదు, మన మతాన్ని, భాషను, సంస్కృతిని నాశనం చేశారు. ఎంత దూషించినా తక్కువే! చక్కని పూరణ. అభినందనలు.
*
గుండా సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ నిర్దోషంగా చక్కగా ఉంది. అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
చంద్రుడంటే గిట్టని వాళ్ళూ ఉన్నారా? బాగుంది మీ పూరణ. అభినందనలు.
భారతగడ్డనేలిరట భవ్యముగామునుదొడ్డలెందరో
రిప్లయితొలగించండిసారపువిద్యయున్ వినయసంపదగల్గిన సత్యవర్తనుల్
మారెను కాలమున్నడత మారెను, పాలకులైరి యిప్పుడున్
జారులు చోరులున్ కుటిలదారులు దుష్టులు దుర్మదాంధులున్ !!!
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండినేరములెన్ని జేసినను నేతలమే నని చాటి జెప్పుచూ
కూరిమినెల్లదోచుకొని కోటికికోటిగ కూడబెట్టిరా
జారులు చోరులున్ కుటిలచారులు దుష్టులు దుర్మదాంధులున్
భారతదేశమా గనుము భావి తరంబుల బాధలన్నిటిన్
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిచాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘భారతగడ్డ నేలిరట’ను ‘భారతభూమి నేలిరట’ అంటే బాగుంటుందేమో!
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
‘నేతలమే నని చాటి జెప్పుచూ’ అన్న దాన్ని ‘నేతలమే యని చాటి చెప్పుచున్’ అందాం.
వీరులు కొందరున్ గలరు బీహరు బెంగలు నాగలాండునన్
రిప్లయితొలగించండిశూరులు కొందరున్ గలరు చూడగ యూపిని కేరళందునన్
కారుర! పార్లమెంటునను గందర గోళము చేయునందరున్
జారులు చోరులున్ కుటిలచారులు దుష్టులు దుర్మదాంధులున్
రిప్లయితొలగించండిఓరిమి లేదు మీదు మన మొక్కర మే సరి యంచు మాటలున్
పోరుల సేసి లోక సభ పోకడ నిల్పి హితమ్ము చేర్చకన్
పేరుకు నేత లయ్యిరి ! గుభిల్లను మోసము తోడు చేరగా
జారులు చోరులున్ కుటిలచారులు దుష్టులు దుర్మదాంధులున్!
జిలేబి