ఉత్సాహ- అడవిలోని మృగములన్ని యచట సభను చేయగా మిడిసిపాటు తోడ వచ్చి మీద దూకె మధ్యలో దుడుకుతొండ, ఘీంకరించెఁ దొండమెత్తి దన్తి యా గడుసుదాని చర్య కపుడు కార్యదర్శి కావునన్.
శ్రీనేమాని రామజోగి సన్యాసి రావుగారు దయతో పంపిన షష్ఠిపూర్తి శుభాశీస్సులకు వారికి మిక్కిలి కృతజ్ఞుడను. ఈ ఆశీస్సులను తమ శంకరాభరణం బ్లాగులో ఆదరంతో ప్రచురించినందుకు శ్రీశంకరయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాయందు ప్రేమాభిమానాలతో స్పందించిన కవిమిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.
వీటిని పాక్షికంగా మా మేనమామగారు శ్రీ ఆత్రేయపురపు పాండురంగవిఠల్ ప్రసాదుగారు షష్ఠిపూర్తి ఆశీర్వచన సభావేదికపైన చదవటం జరిగింది. వారు తమ ఆశీర్వచన పద్యంకూడా చదివారు.
కారణాంతరాల వలన కొద్ది రోజులుగా నెట్‌కు దూరంగా ఉండవలసి వచ్చింది. అందుచేత అందరికీ నా నమోవాకాలు తెలుపుకుందుకు యింతవరకూ ఆలస్యం అయినది. దానికి నన్ను మన్నించవలసినది.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు. * సత్యనారాయణ మూర్తి గారూ, ఉత్సాహంగా పూరించిన మీ పద్యంలోని చమత్కారం అలరించింది. కలియుగ వైపరీత్యాలను వివరించిన మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, సమస్యను మూడవపాదంలోకి నెట్టి చక్కని పూరణ చేసారు. అభినందనలు. * సహదేవుడు గారూ, అన్ని కార్టూన్ చానెళ్ళలో అలాంటి వింత జంతువులేగదా! బాగుంది మీ పూరణ. అభినందనలు. * శ్యామలీయం గారూ, మీ ప్రతిస్పందన లేదేమిటా అనుకుంటున్నాను. తెలిసింది. సంతోషం!
కవి పండిత జనసందో హ వచన మహిమన్ శుభంబులందుట చేతన్ భవదీయ జీవనోద్యా న వనము వికసించు నింక నవకాంతులతో
తొండను బెదిరించిన ఏనుగు ఘీంకారం పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, బాగుంది మీ పూరణ. అభినందనలు. మొదటి పాదంలో గణదోషం... ‘ప్రభువుకు’ అంటే సరి!
దొండ పాదు మీద తొండయే జేరగ
రిప్లయితొలగించండిపాదు పీకు చుండ పాడు గజము
కరము లోన దూర గజగజ వణకుచు
తొండ, ఘీంకరించెఁ దొండ మెత్తి.
ఉత్సాహ-
రిప్లయితొలగించండిఅడవిలోని మృగములన్ని యచట సభను చేయగా
మిడిసిపాటు తోడ వచ్చి మీద దూకె మధ్యలో
దుడుకుతొండ, ఘీంకరించెఁ దొండమెత్తి దన్తి యా
గడుసుదాని చర్య కపుడు కార్యదర్శి కావునన్.
May 2012
రిప్లయితొలగించండిమూగ జీ వి నోరు మూగ బోవంగను
బావి పైన నుండి పలుక రించె
తొండ , ఘీంక రించె దొండ మెత్తి గజము
బావి లోన నుండు మనుజు జూచి .
0 comments
సెలవుదినములందుచిత్రాల పిల్లలు
రిప్లయితొలగించండిజంతుజాలసృష్టివింతగద్ద
చీమతోకఁజుట్టి సింహాన్నిబంధించె!
తొండఘీంకరించెఁదొండమెత్తి!
కలియుగాన నేడు కనుడెన్నివింతలో
రిప్లయితొలగించండిధరణి మీద చేప పరుగు లిడెను,
మేక లెగురు చుండె నాకాశవీధిలో
తొండ ఘీంకరించెఁ దొండమెత్తి.
శ్రీనేమాని రామజోగి సన్యాసి రావుగారు దయతో పంపిన షష్ఠిపూర్తి శుభాశీస్సులకు వారికి మిక్కిలి కృతజ్ఞుడను. ఈ ఆశీస్సులను తమ శంకరాభరణం బ్లాగులో ఆదరంతో ప్రచురించినందుకు శ్రీశంకరయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాయందు ప్రేమాభిమానాలతో స్పందించిన కవిమిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.
రిప్లయితొలగించండివీటిని పాక్షికంగా మా మేనమామగారు శ్రీ ఆత్రేయపురపు పాండురంగవిఠల్ ప్రసాదుగారు షష్ఠిపూర్తి ఆశీర్వచన సభావేదికపైన చదవటం జరిగింది. వారు తమ ఆశీర్వచన పద్యంకూడా చదివారు.
కారణాంతరాల వలన కొద్ది రోజులుగా నెట్‌కు దూరంగా ఉండవలసి వచ్చింది. అందుచేత అందరికీ నా నమోవాకాలు తెలుపుకుందుకు యింతవరకూ ఆలస్యం అయినది. దానికి నన్ను మన్నించవలసినది.
పసిడి దళము లిచ్చె ప్రభువు తొండమాన్
రిప్లయితొలగించండివేంక టేశు కనగ విరివి గాను
మట్టి దళము లిచ్చు మాన్యుని భక్తికి
తొండ ఘీంక రించె దొండ మెత్తి !
విశ్రమించు నేన్గు వీపున బెదరక
రిప్లయితొలగించండినెక్కి యాడుచుండె నొక్క తొండ
విసివి గజము తుదకు బెదరి పారంగ నా
తొండ ఘీంకరించెఁ దొండమెత్తి.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిచక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
*
సత్యనారాయణ మూర్తి గారూ,
ఉత్సాహంగా పూరించిన మీ పద్యంలోని చమత్కారం అలరించింది.
కలియుగ వైపరీత్యాలను వివరించిన మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
సమస్యను మూడవపాదంలోకి నెట్టి చక్కని పూరణ చేసారు. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
అన్ని కార్టూన్ చానెళ్ళలో అలాంటి వింత జంతువులేగదా! బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
శ్యామలీయం గారూ,
మీ ప్రతిస్పందన లేదేమిటా అనుకుంటున్నాను. తెలిసింది. సంతోషం!
కవి పండిత జనసందో
హ వచన మహిమన్ శుభంబులందుట చేతన్
భవదీయ జీవనోద్యా
న వనము వికసించు నింక నవకాంతులతో
తొండను బెదిరించిన ఏనుగు ఘీంకారం పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం... ‘ప్రభువుకు’ అంటే సరి!
తొండ యొకటి తిండి మెండుగా మేసెనో -
రిప్లయితొలగించండితోక బలిసి ఇంక తొండ మయ్యె!
దాని తోడు నింక దాని గర్వము హెచ్చె!
తొండ ఘీంకరించె తొండ మెత్తి!!