దండకము -
ఇది ‘ఉపరివృత్తము’లలో చేరినది. 26 అక్షరములకంటె అధికమగు అక్షరములు గల లయగ్రాహి, లయవిభాతి మొదలగునవి ఉపరివృత్తములు.
దండకములు అనేక విధములుగా నుండును. సులక్షణ సారములో ఇచ్చిన విధము, ప్రస్తుతము వాడుకలో నున్నదియు నగు దండకమును గూర్చి చెప్పుచున్నాను.
దండకమునకు ఇన్ని గణములని గాని, ఇన్ని పాదములని గాని నియమములు లేవు. స న హ గణములతో ప్రారంభించ వచ్చును, లేకుంటే త గణముతో ప్రారంభించ వచ్చును. ఆ పిదప అన్నియునూ త గణములే వేయవలెను. గురువుతో సమాప్తి చేయవలెను. ఎన్ని ఎక్కువ శబ్దాలంకారములు ముఖ్యముగా అనుప్రాసలు వేసినచో దండకము అంత అందముగా వచ్చును.
ఉదా -
శ్రీమన్మహేశార్ధ గాత్రీ! హిమాద్రీశపుత్రీ! త్రిలోకాధినేత్రీ! సదా భక్త సంప్రార్ధితార్థ ప్రదాత్రీ! చిదానందరూపా! జగజ్జాల దీపా! తమోఘ్న ప్రదీపా! సువర్ణస్వరూపా! సదాదేవ బృందంబు సేవించు నీ దివ్య పాదాంబుజాతంబులన్ నేను ధ్యానింతు నేకాగ్ర చిత్తాన నో వేద మాతా! భవాంబోధిపోతా! త్రిలోకైక మాతా! సదా లోక కళ్యాణమున్ గూర్చు నీ మందహాసంబు నీ చిద్విలాసంబు నీ ప్రేమతత్త్వంబు పీయూష సారంబు నానంద సంవర్ధకంబై విరాజిల్లు నో తల్లి! దీవ్యత్ కృపా కల్పవల్లీ! ......... ........ నమస్తే నమస్తే నమః
మీరూ ప్రయత్నించండి. స్వస్తి.

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
సాహిత్యరంగాన నిత్యంబు తారాడు నో మిత్రులారా! కవిశ్రేష్ఠులారా! వచ స్సాంద్రులారా! మహాకీర్తి సంపన్నులారా! మదిన్ భారతీ మాతృ పాదాంబు జాతంబులన్ నిల్పి ధ్యానించి యేకాగ్రచిత్తంబుతో వ్రాయగా బూనుచో పద్య రత్నాలతో హృద్యకావ్యంబు లెన్నేనియున్ రావె, మీ దీక్ష యేనిన్ సుసంపన్నమై యొప్పదే గొప్పలన్ జెప్పుటల్ కాదు, మున్ దెల్పె శ్రీ శంకరాచార్య వర్యుండు ప్రజ్ఞాన తేజోనిధానుండు మీరెల్ల రాసక్తితో బూనుడీ యత్నముల్ పొందుడీ యోగరాజిన్ సముత్సాహ సంపన్నులై మీకు నుత్తేజమున్ గూర్చు జేజే లివే
రిప్లయితొలగించండిశ్రీమత్కృపాసింధు! హే దీనబంధూ!మహాదేవదేవా! ప్రభూ! రామచంద్రా!సదాలోకరక్షైకకార్యాబ్ధిమగ్నా!శుభాకార! సంఘంబు నందున్న పాపంబు లన్యాయకార్యంబులన్ జూడుమా నేడు దేశంబులో నెల్లెడం దీవ్రవాదంబు విస్తార రూపంబు దాల్చెన్, మతోన్మాద మత్యుగ్రరీతిన్ విజృంభించె, స్వార్థంబె ముఖ్యంబుగా లోకులీనాడు విత్తార్జనంబే ప్రధానంబుగా బూని బంధుత్వభావంబులన్ రోసియున్నారు సంపత్తులే శాశ్వతంబా? యికే శాఖలో చూచినన్ లంచగొండుల్ సదన్యాయమూర్తుల్ విరాజిల్లుచున్నారు, సత్యంబు, ధర్మంబు, శాంతంబు, సౌఖ్యంబు, క్షేమంబు, యోగంబు లేమూలనో దాగె, వేదోక్త శాస్త్రోక్తరీతుల్ భయంబందియుండెన్, పరాధీనమై పోవుచుండెన్ స్వధర్మంబు, చూడంగ దేశాధినేతల్ సదా స్వార్థమే పూనియున్నార లేమూలలో చూచినన్ స్కాములే దర్శనం బిచ్చుచుండంగ యీదేశమున్ రక్ష చేయంగ నింకెవ్వరున్నార లోదేవ! రావా మరోమారు త్రేతాయుగంబిందు కల్పించి రక్షించు శ్రీరామ రాజ్యంబు తెప్పించుమా యంచు ప్రార్థించు చున్నాడ, దండంబు లందించు చున్నాడ కాపాడు మీదేశమున్ రామచంద్రా! నమస్తే నమస్తే నమ:
రిప్లయితొలగించండిశ్రీ శారదాదేవి! నీ నామమున్ బల్కి, నే వందనంబంచు, నివ్వేళ శ్రీసద్గురుశ్రేష్ఠు లన్ దల్చి, నే దండకంబొక్కటిన్ పాడనెంతున్, మహాప్రీతి శ్రద్ధాదులన్ నేర్పి, నామావళిన్ దాను బల్కించు నా తల్లికిన్ వందనంబందునమ్మా!జగద్రీతి బోధించు నా తండ్రికిన్ వందనంబుల్ సదా జేయుచుందున్, సదా పాఠముల్ బోధ జేసేటి పూజ్యుల్ గురుబృందమున్ దల్చియున్, నా మనంబందు ధ్యానించి నెల్లప్పుడున్ నే నమస్కారముల్ భక్తితోనర్పణల్ చేయుచుందున్, నమస్తే! గురోభ్యః నమ:!!
రిప్లయితొలగించండిఇది నా తొలి ప్రయత్నం. గురుశ్రేష్ఠులు , గురుబృందము అన్నపుడు రు గురువౌతుందనుకుని , చేశాను. సరి/ తప్పు అనేది పెద్దలు చెప్పాలి.
అమ్మా శ్రీమతి లక్ష్మీదేవి గారూ! మీ ప్రయత్నము చాల బాగున్నది. శుభాభినందనలు. ఈ క్రింది సవరణలు చేయండి:
రిప్లయితొలగించండి(1) బోధ చేసేటి కి బదులుగా : బోధనల్ చేయు
(2) గురుబృందముల్: కి బదులుగా : మదాచార్యులన్
(3) గురోభ్య నమః : కి బదులుగా :గురుభ్యో నమః :
స్వస్తి.
శ్రీ శారదాదేవి! నీ నామమున్ బల్కి, నే వందనంబంచు, నివ్వేళ శ్రీసద్గురుశ్రేష్ఠు లన్ దల్చి, నే దండకంబొక్కటిన్ పాడనెంతున్, మహాప్రీతి శ్రద్ధాదులన్ నేర్పి, నామావళిన్ దాను బల్కించు నా తల్లికిన్ వందనంబందునమ్మా!జగద్రీతి బోధించు నా తండ్రికిన్ వందనంబుల్ సదా జేయుచుందున్, సదా పాఠముల్ బోధనల్ చేయు పూజ్యుల్ మదాచార్యులన్ దల్చియున్, నా మనంబందు ధ్యానించి నెల్లప్పుడున్ నే నమస్కారముల్ భక్తితోనర్పణల్ చేయుచుందున్, నమస్తే! గురుభ్యో నమః!!
రిప్లయితొలగించండిఅయ్యా,
మీకు అనేక ధన్యవాదములు. గురువందనం తో దండక అభ్యాసం ఆరంభించాలని అభిప్రాయపడ్డాను. అందుకని శారదాదేవిని, తల్లిదండ్రులను, చిన్నతనమునుంచి ఈనాటి వరకూ అన్నిదశలలో ఎన్నో రకాలు గా నాకు జ్ఞానాన్ని పంచిన అందరు గురువర్యులకు వందన సమర్పణ చేయాలని ప్రయత్నించాను. మీ ఆశీర్వాదం వలన సఫలము కలిగినది.
అమ్మా శ్రీమతి లక్ష్మీదేవి గారూ! శుభాశీస్సులు. మీ దండకము బాగున్నది. శుభం భూయాత్.
రిప్లయితొలగించండిశ్రీచక్రసంచారిణీ! దైత్యసంహారిణీ! లోకమాతా! జగద్వ్యాప్త ఘోరాఘసంఘంబులం ద్రుంచగా మోహనాకారివై జమ్ముకాశ్మీర మందున్న కాట్రాఖ్యమై యొప్పు గ్రామంపు గోత్రాగ్రభాగంబు నందుండి, శ్రీవైష్ణవీనామధేయంబుతో భక్తులన్ బ్రోచుచున్, సర్వసౌభాగ్యసంపత్తు లందించుచున్, పుత్రమిత్రాది సౌఖ్యంబులం గూర్చుచున్, తల్లివై గాచుచున్నావు, నీనామ సంకీర్తనల్ చేసినన్, నిన్ను పూజించి వర్ణించినన్, నీకథాలాపముల్ భక్తితో చేసినన్, నిన్ను దర్శించి నీయందు విశ్వాసముం జూపి ప్రార్థించు వారెల్లరున్ శాశ్వతానందముం బొంది మోక్షంబు సాధింపరే తల్లి! నీపాదపద్మంబులే మాకు దిక్కమ్మ, పాదాంబువుల్ తీర్థమమ్మా! హృషీకేశశక్రాది సర్వామరుల్ నీకృపాపాత్రులై లోకరక్షాఢ్యతన్ బొంది యున్నారు, ముల్లోకముల్ నీయధీనంబులమ్మా! జగన్మాత! సద్బుద్ధి యందించి కాపాడవమ్మా! యికన్ వైష్ణవీ! మాతృమూర్తీ! నమస్తే నమస్తే నమస్తే నమ:
రిప్లయితొలగించండిశ్రీ సరస్వత్యై నమః :
రిప్లయితొలగించండిఅయ్యా శ్రీ హరి.... ....మూర్తి గారూ! శుభాశీస్సులు.
మీ పద్యముల గురించి ప్రత్యేకముగా ప్రస్తావించ నక్కర లేదు. అన్నీ అమృతపు గుళికలే. మంచి భక్తి భావము పొంగి పొరలుతూ వచ్చేయి దండకములు రాముని మీద మరియు వైష్ణవీ దేవి మీద. శుభాశీస్సులు. విశేష ఛందస్సులను పట్టు విడువకుండా అభ్యసించు చున్నవారు మీరు మరియు శ్రీమతి లక్ష్మీ దేవి గారే. మిగిలిన వారు అప్పుడప్పుడు చేస్తున్నారు. మీ ఇద్దరి ప్రయత్నములు ప్రశంసనీయములు. స్వస్తి.
ఆర్యా!
రిప్లయితొలగించండినమస్కారములు.
అంతా మీఆశీస్సులు, శుభకామనలతో నిండిన మార్గదర్శనల ప్రభావమే. మీ వాత్సల్యానికి సర్వదా, సర్వథా కృతజ్ఞతలు.