19, మే 2012, శనివారం

రవీంద్రుని గీతాంజలి - 17

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

17

I AM only waiting for love to give
myself up at last into his hands. That
is why it is so late and why I have
been guilty of such omissions.

They come with their laws and their
codes to bind me fast; but I evade
them ever, for I am only waiting for
love to give myself up at last into his
hands.

People blame me and call me heed-
less ; I doubt not they are right in their
blame.

The market day is over and work is
all done for the busy. Those who came
to call me in vain have gone back in
anger. I am only waiting for love to
give myself up at last into his hands. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....


వేచి కూర్చుంటి నాకు నే, ప్రేమకరము
లందు సర్వస్వ మర్పిత మాచరింపఁ,
జాల తడ వయిపోయె, దొసంగు లెన్నొ
దొరలె నా నుండి, నే నొక దోషి నైతి ||

తమ విధుల్ తమ చట్టముల్ త్రాళ్ళుజేసి
నన్ను బంధింప వేచియున్నారు వారు,
కాని తప్పించుకొం చెల్లకాల మేను
బయట బడుచుంటి నవ్వారి బారినుండి,
దీనికిన్ శిక్ష వచ్చెన యేని నేను
మది ముదంబందు చనుభవించెదను గాక
వేచి కూర్చుంటి నాకు నే ప్రేమకేళ్ళఁ
గడకు సర్వస్వ మమ్ముడు పడుట కొఱకు ||

సడ్డమాలినవాఁడని జనులు నన్ను
తిట్టి పోసెద, రందు సందియము లేదు,
తలపయిన్ మోపుకొనుచు నిందాభరంబు
నందరికిఁ గ్రింద నిలఁబడి యుందు నేను ||

దినము తుది ముట్టె, నమ్ముచుఁ గొనుచు నుండు
బేరకాండ్రెల్ల చల్లఁగ జారుకొనిరి
నను బిలువ వచ్చినట్టి వారును చిరాకు
పడుచు వచ్చినత్రోవన వెడలి రెపుడొ
కాని యొక నేన యొంటిగా గాచియుంటి
ప్రేమకరముల కిట సమర్పితము గాక ||     

2 కామెంట్‌లు:

  1. ఆవిభు జేరి ప్రేమమెయి నర్పణ జేయుదు నాత్మనంచు నే
    భావన జేయుచుండగనె బాగుగ జాగయె గాన శిక్ష నే
    నేవిధి దప్పుకొందునని యెంతయు జింతిలి చిక్కులన్నియున్
    లేవికయంచు నమ్ముచు నిరీక్షణ జేయుచు నుంటి వేడ్కన్

    రిప్లయితొలగించండి
  2. చివరిలో తప్పు దొరలినది. అందుచేత మరల వ్రాయుచున్నాను.

    ఆవిభు జేరి ప్రేమమెయి నర్పణ జేయుదు నాత్మనంచు నే
    భావన జేయుచుండగనె బాగుగ జాగయె గాన శిక్ష నే
    నేవిధి దప్పుకొందునని యెంతయు జింతిలి చిక్కులన్నియున్
    లేవికయంచు నమ్ముచు నిరీక్షణ జేయుచు నుంటి వేండియున్

    రిప్లయితొలగించండి