ఉత్సాహ వృత్తము -
గణములు: 7 సూర్య గణములు 1 గురువు
యతి స్థానము: 5వ గణము మొదటి యక్షరము. (ప్రాస నియమమున్న కారణమున ప్రాసయతి నిషేధము)
ప్రాస నియమము కలదు.
(ఉత్సాహ వృత్తమునకు ఆటవెలదిని చేర్చిన ‘విషమ సీసము’ అగును. సూర్య గణములైన హగణ, నగణములలో ఏ ఒక్క గణముతోను పద్యమంతయు రచింపరాదు. అన్ని హగణములతో వ్రాసిన అది ‘సుగంధి వృత్తము’, అన్ని నగణములతో వ్రాసిన అది ‘విచికిలిత వృత్తము’ అగును. కనుక యథేచ్ఛముగా హగణ, నగణములను ప్రయోగించవలెను)
ఉదా:
వారిజాత లోచనుండు భద్రమూర్తి ప్రీతుడై
భూరి కరుణ మెరయ వినెను మొరల నెల్ల శీఘ్రమే
ధారుణిన్ నరత్వమొంది దశముఖున్ వధించుచున్
భారమెల్ల దీర్చుననుచు వసుధ పొంగె నెంతయున్
ఇంతకు ముందే ఈ పద్యము గురించి చెప్పుకొన్నాము. కొందరు ఈ పద్యమును ఇప్పటికే అలవర్చుకొన్నారు - అయినా మరొక్క మారు ఈరోజు చెప్పుకొనుచున్నాము. స్వస్తి!
గణములు: 7 సూర్య గణములు 1 గురువు
యతి స్థానము: 5వ గణము మొదటి యక్షరము. (ప్రాస నియమమున్న కారణమున ప్రాసయతి నిషేధము)
ప్రాస నియమము కలదు.
(ఉత్సాహ వృత్తమునకు ఆటవెలదిని చేర్చిన ‘విషమ సీసము’ అగును. సూర్య గణములైన హగణ, నగణములలో ఏ ఒక్క గణముతోను పద్యమంతయు రచింపరాదు. అన్ని హగణములతో వ్రాసిన అది ‘సుగంధి వృత్తము’, అన్ని నగణములతో వ్రాసిన అది ‘విచికిలిత వృత్తము’ అగును. కనుక యథేచ్ఛముగా హగణ, నగణములను ప్రయోగించవలెను)
ఉదా:
వారిజాత లోచనుండు భద్రమూర్తి ప్రీతుడై
భూరి కరుణ మెరయ వినెను మొరల నెల్ల శీఘ్రమే
ధారుణిన్ నరత్వమొంది దశముఖున్ వధించుచున్
భారమెల్ల దీర్చుననుచు వసుధ పొంగె నెంతయున్
ఇంతకు ముందే ఈ పద్యము గురించి చెప్పుకొన్నాము. కొందరు ఈ పద్యమును ఇప్పటికే అలవర్చుకొన్నారు - అయినా మరొక్క మారు ఈరోజు చెప్పుకొనుచున్నాము. స్వస్తి!
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
నీలకంఠుడయిన వాఁడు నిన్నునన్నుజూచినన్,
రిప్లయితొలగించండిమేలుకలుగు నెల్ల వేళ మిక్కుటమ్ముగానురా!
మ్రోల నిలిచి వేడినంత మొక్కు దీర్చు వేల్పుగా
ఫాలలోచనుండు మనకు ఫలమునిచ్చునమ్మినన్.
శంకరయ్యగారు రమ్య సాహితీ విలాసమౌ
రిప్లయితొలగించండిశంకరాభరణము నెమ్మి స్థాపనమ్మొనర్చి యా
పంకజాసను సతికి వరివస్యలన్ బొనర్చి యై
ణాంకికాఛ్ఛ కీర్తి గాంచు టమిత హర్షణీయమౌ
భక్తజనులఁ జేరదీసి భాగ్యమందజేయుచున్
రిప్లయితొలగించండిశక్తియుక్తు లొసగుచుండి సద్యశంబు లిచ్చుచున్
భక్తి నింపి హృదులలోన, బంధనాలు ద్రుంచుచున్
ముక్తి నొసగుదాన వీవు మోదమంద వైష్ణవీ!
గురువు గారిని నమస్సులు.
రిప్లయితొలగించండివ్యస్తత కారణంగా కొన్ని రోజుల తరువాత మరలా నా ప్రయత్నం కొనసాగిస్తున్నాను.
వందనాలు అందజేతు పండిత ప్రఖండ-ఓ
కంది శంకరయ్య! మీదు కలమునుండి కావ్యముల్
వందమంది కవులు నేడు పలుకు తెలుగు పద్యముల్
అందరికిని అందముగను అందునట్లు చేస్తిరా!
రామజోగి మందు నిచట రమ్యముగా లభ్యమే!
రామకృష్ణ శర్మగారి రచన కూడ లభ్యమే!
వామనుండు వదలకుండ పద్యమనుట తథ్యమే!
రమ్యమైన బ్లాగు శంకరాభరణము సత్యమే!
(రామ జోగి మందు కొనరే ,పామరులారా -అనేది ఒక రామదాసు కీర్తనలో పల్లవి)
పైన కొన్ని టైపాటులు. కనుక మరలా వ్రాస్తున్నాను.
రిప్లయితొలగించండివందనాలు అందజేతు పండిత ప్రఖండ-ఓ
కంది శంకరయ్య! మీదు కలమునుండి కావ్యముల్,
వందమంది కవులు నేడు పలుకు తెలుగు పద్యముల్,
అందరికిని అందముగను అందునట్లు చేస్తిరా!
రామజోగి మందు నిచట రమ్యముగా లభ్యమే!
రామకృష్ణ శర్మగారి రచన కూడ లభ్యమే!
వామనుండు వదలకుండ పద్యమనుట తథ్యమే!
రమ్యమైన బ్లాగు శంకరాభరణము సత్యమే!
(రామ జోగి మందు కొనరే ,పామరులారా -అనేది ఒక రామదాసు కీర్తనలో పల్లవి)
సుగంధి
రిప్లయితొలగించండివంద నాలు వంద నాలు వంద వంద వంద నమ్
అంద మైన నంద నమ్మునందు నేర్చి పద్య ముల్
వంద నాలు వంద నాలు వాచ స్పతీ వంద నమ్
వంద నాలు వంద నాలు వాణి వంద వంద నమ్ !
ముదము గాను నేర్పు నట్టి పూజ్య గురువు లుండ గా
రిప్లయితొలగించండిపద్య రచన చేయ గలుగు భాగ్య మబ్బె నాకి కన్
మెదడు పదును బెట్టి యికను మిక్కుట మగు పద్య ముల్
పదము పదము గూర్చి నేను పద్య రచన జేసే దన్ !
రాత్రి 10.20 నిముషాలకు
రిప్లయితొలగించండిబంటు రీతి కొలువునడిగి,భక్తి నాలపింపగా
తుంటవైన కామ,మోహ దుష్టశక్తులణచి,నా
ఇంట వెలసి కరుణ జూపి,ఇహ పరముల సౌఖ్యమి
మ్మంటిమయ్య నన్ను గావవే!,దయా కృపా నిధీ!
రాత్రి 10.30 నిముషాలకు
దాశరధిగ పుట్టి నీవు ధర్మముద్ధరింపగా,
దేశమంత తిరిగినావు ధరణి పాదచారివై,
ఈశ యనుచు పూజ చేయు దాస జనుల ప్రేమతో,
క్లేశములను బాపుమయ్య! కరుణతో కృపానిధీ!
రాత్రి 10.45 నిముషాలకు
రామ రామ రామ యనుచు, రమ్యముగా పాడగా,
రామ నామ భజన నాకు రాచబాట వేయగా,
రామ భక్తి రసము లోన లయము చెందిపోయెదన్,
రామ రాజ్యమందు మరల రజముగా జనించెదన్.
రాత్రి 11.00 నిముషాలకు
ఇనకులాప్తకుండవనుచు ఇలను జనులు పొగడగా,
మనవి యాలకింతువనుచు మనమునందు తలుపగా,
జనని జానకమ్మ మాకు శరణమే యొసంగగా,
మనసు దీర మరి నుతింతుమనుచు మిమ్ము వేడగా(వేడెదన్).
శ్రీ సరస్వత్యై నమః:
రిప్లయితొలగించండిమిత్రులారా! అందరికీ శుభాశీస్సులు - అభినందనలు.
శ్రీమతి లక్ష్మీ దేవి గారు మంచి పద్యము నీలకంఠ తత్త్వము గూర్చి చెప్పేరు - బాగున్నది.
శ్రీ హరి....మూర్తి గారు వైష్ణవీదేవి దర్శనము ఐన తరువాత చెప్పిన పద్యము ఆ వైష్ణవీదేవి మీద చెప్పేరు - బాగున్నది.
శ్రీమతి రాజేశ్వరి గారు మంచి ప్రయత్నము చేసేరు - కొన్ని సవరణలు అవసరము. పద్యము బగున్నది.
శ్రీ వామనకుమార్ గారిలో ఉత్సాహము పొంగి పొరలినది. ఎక్కువగా పద్యాలు వ్రాసేరు. బాగున్నవి. అక్కడక్కడ సవరణలు అవసరము.
స్వస్తి.
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
ధన్యవాదాలు.
*
సత్యనారాయణ మూర్తి గారూ,
వైష్ణవీ దేవిని ప్రస్తావించిన మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
*
వామన కుమార్ గారూ,
మీ ప్రయత్నం ప్రశంసనీయం. చక్కని పద్యాలు వ్రాసారు. అభినందనలు.
మొదటి పద్యం చివర ‘చేస్తిరా’ అన్నారు. దానిని ‘చేతురే’ అందాం.
రెండవ పద్యం మొదటి పాదంలో ‘ముగా’ అని వగణం వేసారు. అక్కడ హగణ, నగణాలలో ఏదైనా ఉండాలి. నా సవరణ...‘రామజోగి మందు లిచట రమ్యముగ లభించులే’
10.20 పద్యంలో ‘తుంటవైన’ అన్నచోట ‘తుంటరులగు’ అందాం.
10.30 పద్యంలో మూడవ పాదంలో యతి తప్పింది. నా సవరణ...‘ఈశ యనుచు పూజ చేయు నెల్ల జనుల ప్రేమతో’
10.45 పద్యంలో మొదటి పాదంలో ‘ముగా’ అని వగణం వేసారు. అక్కడ ‘రమ్యముగను’ అందాం.
11.00 పద్యంలో ‘ఇనకులాప్తకుండవనుచు’ అన్నచో ‘ఆప్తకుడు’?... అక్కడ ‘ఇనకులోద్భవుండ వనుచు’ అందాం.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ రెండు పద్యాలు బాగున్నాయి. ముఖ్యంగా రెండవ పద్యం ‘సూపర్’! అభినందనలు.
1,3 పాదాల చివర ‘వంద వందనమ్’ అనకుండా ‘వంద వందనాల్’ అందాం.
‘వాచస్పతి’ అన్నచోట గణభంగం. మీరు బ్రహ్మ అనే అర్థంలో ప్రయోగించారా? ‘వాణి మగడ’ అంటే సరి!
పండిత శ్రీ నేమాని వారికి,శ్రీ శంకరయ్యగారికి,నమస్సులు.
రిప్లయితొలగించండిమీ ఆశీర్వాద బలంతో ఒక్క సవరణ కూడా అవసరం రాని విధంగా పద్యాలను రచించ ప్రయత్నిస్తాను.
ధన్యవాదములు.
గతియు నీవె,మతియు నీవెగా! యటంచు పాడగా
రిప్లయితొలగించండియతులు,నరులు పూజ చేసి యాశ తోడ వేడగా
గతి విధాన కారణమున,కలిమిలేములందునన్
గతులు తప్పిపోవకుండ గావుమయ్య ఈశ్వరా!
9.20 A.M.
రిప్లయితొలగించండిరామ! జన్మమందితివి భళా! నరునిగ ధరణిపై
రామ! నీవె శరణుయంటి,రక్ష నీవె గాద! శ్రీ
రామ! నీదు పాదములకు రాజ పూజ చేసెదన్
రామ! నన్ను కరుణ జూడ రావె! జీవ పోషకా
(మొదటి పాదం ముందు
"రామ! నన్ను కావుమయ్య! రాక్షసాంతకాయ! ఓ"
అని వ్రాసాను.తరువాత మార్చాను.)
9.40 A.M.
రామనామ మహిమ వల్ల రాగమే స్ఫురించగా
సామగాన రీతిలోన సాగెనింక పద్యముల్
ఈ మహీధరమ్మునందు నికను మోక్షమందగా
రామనామ జపము చేయ,రాముడిచ్చు సంపదల్.
వేంకటేశ నిన్ను వేడ వెడలిపోవు పాపముల్ !
రిప్లయితొలగించండిపంకజాక్ష పావనాత్మ పాహిపాహి మాధవా!
సంకటాలు పారిపోవ సంస్తుతింతు దేవ, నా!
వంక నొక్కసారి జూడ వా, జనార్దనా హరే!!