శివాని శబ్ద చర్చ చాలా అమోఘంగాను, జ్ఞాన ప్రదాతగాను అలరారినది. ఇటువంటి చర్చలు నా వంటి పామరులకు పూర్తిగా అర్ధంగాకపోయినా, copy paste చేసుకొని,దాచుకొని తరువాత మెల్లగా చదివి అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించటానికి అనువుగా ఈ చర్చ ఈ బ్లాగునందు జరగటం మాకు మహద్భాగ్యం. అలాగే, మరొక విషయం కూడా వీలైనప్పుడు తెలియజేయ ప్రార్ధన. పద్యం, శ్లోకం - ఈ రెండింటికీ గల తేడా ఏమిటి ? పద్యంలో తెలుగు పదాలు, సంస్కృత పదాలు రెడింటినీ వాడుతున్నాము. శ్లోకంలో సంస్కృత పదాలు మాత్రమే వాడాలా ? ఇంకా ఏమన్నా వివరాలు తెలియజేయ ప్రార్ధన.
మిత్రులందరూ వైవిధ్యంగా, మనోహరంగా పూరణలు చెప్పి ఆనందాన్ని కలిగించారు. ఎవరి పూరణలోను సవరించ వలసిన దోషాలు లేవు. సంతోషం.. పూరణలు పంపిన.... సహదేవుడు గారికి, సత్యనారాయణ మూర్తి గారికి, లక్ష్మీదేవి గారికి, కమనీయం గారికి, పండిత నేమాని వారికీ, మిస్సన్న గారికి, సుబ్బారావు గారికి, రాజేశ్వరి అక్కయ్యకు, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, ......... అభినందనలు, ధన్యవాదాలు. * జిలేబీ గారూ, సురేశ్ గారూ, సంతోషం...మీ భావాలకు ఎవరైనా పద్యరూపం ఇస్తారేమో అని చూసాను. ఎవరూ ఆ ప్రయత్నం చేయలేదు.
చదువు శూన్యం, ప్రేమ అనంతం
రిప్లయితొలగించుభక్తుడతడు, భగవద్ పూజితుండు
చదువు శూన్యం, సేవ అనంతం
మూర్ఖుడతడు రాజపూజితుండు
చీర్స్
జిలేబి
అస్వస్థత కారణంగా ఈరోజు సమస్య ఇవ్వడం ఆలస్యం అయింది. మన్నించండి.
రిప్లయితొలగించువేటగాడుకఱకుమోటుబోయ,కసాయి
రిప్లయితొలగించుపక్షిజంట జెదరబడసికరుణ
రామచరితమలచిరాణించె వాల్మీకి
మూర్ఖుడతడు,రాజపూజితుండు
జానపదులు పల్కు సంగతులనుబట్టి
రిప్లయితొలగించుమూర్ఖుడతడు, రాజపూజితుండుఁ
గాళి కృపను బొంది కవికులగురుడయ్యె
కాళిదాససుకవి క్రమముగాను.
తోలుమందము బుర్రమందము
రిప్లయితొలగించుఅమ్మనాన్నల వారసత్వమిదిర
మననాయకుడ ఘనచరిత్రిదిర
మూర్ఖుడతడు రాజపూజితుండు
బద్ధకమ్ముతోడ బ్రతుకుచున్న పరమ
రిప్లయితొలగించుమూర్ఖుడతఁడు, రాజపూజితుండు
గాడు, పరుల మేలు గట్టిగా తలచిన
గౌరవమ్ము కలుగు, కల్లకాదు.
1.ధనబలమ్ము చేత దక్కెను పదవులు
రిప్లయితొలగించునేటి రాజకీయ నేత కకట
కరము వెగటు దోచె ,కలుషాత్ము డైనను
మూర్ఖు డతడు రాజ పూజితుండు.
2.మందబుద్ధి రాకుమారికి మగడాయె
గురువు ద్రోహ బుద్ధి గుణము చేత
కాళి వరము చేత కవికుల గురువాయె
మూర్ఖు డతడు రాజ పూజితుండు.
వృష్ణివంశజుండు వృద్ధుడేనియు కాడు
రిప్లయితొలగించునల్లవాడు కొంటె గొల్లవాడు
మూర్ఖుడతడు రాజపూజితుం డగునెట్టు
లనుచును శిశుపాలు డపహసించె
ధర్మజుని రాజసూయ యాగ సందర్భలో
రిప్లయితొలగించుఆదిజునకు తండ్రి వేదవినుతుడగు
యఙ్ఞ కర్త యితడు యఙ్ఞ భోక్త
చేది రాజు జూడ శ్రీపతి నిందించు
మూర్ఖుఁ డతఁడు రాజపూజితుండు.
రాజులేని వేళ రాజుగా నొక చాకి
రిప్లయితొలగించువాని నుంచె గద్దెపైని మున్ను
పోలు నతడు చూడ భూమీపతిని బళా!
మూర్ఖు డతడు రాజపూజితుండు
తప్పు పలికి ,చేసి యొప్పు ననెడి వాడు
రిప్లయితొలగించుమూ ర్ఖు డతడు, రాజ పూ జితుండు
సకల శాస్త్ర ములను జదివి న మనుజుండు
రచ్చ సభల లోన రాణి కెక్కు .
శివాని శబ్ద చర్చ చాలా అమోఘంగాను, జ్ఞాన ప్రదాతగాను అలరారినది. ఇటువంటి చర్చలు నా వంటి పామరులకు పూర్తిగా అర్ధంగాకపోయినా, copy paste చేసుకొని,దాచుకొని తరువాత మెల్లగా చదివి అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించటానికి అనువుగా ఈ చర్చ ఈ బ్లాగునందు జరగటం మాకు మహద్భాగ్యం. అలాగే, మరొక విషయం కూడా వీలైనప్పుడు తెలియజేయ ప్రార్ధన.
రిప్లయితొలగించుపద్యం, శ్లోకం - ఈ రెండింటికీ గల తేడా ఏమిటి ?
పద్యంలో తెలుగు పదాలు, సంస్కృత పదాలు రెడింటినీ వాడుతున్నాము. శ్లోకంలో సంస్కృత పదాలు మాత్రమే వాడాలా ?
ఇంకా ఏమన్నా వివరాలు తెలియజేయ ప్రార్ధన.
విపిన మందు దిరిగి వేటాడి జీవించు
రిప్లయితొలగించుమూర్ఖు డతడు రాజ పూజి తుండు
భక్తి గొలుచు శివుని భక్త కన్నప్పకే
భవుడు మెచ్చి యిచ్చె పరమ పధము
--------------------------------------------
పశుల గాచు నట్టి పల్లెవా డాతడు
మోస మంది తుదకు క్లేశ పడగ
కాళి వరము నొంది కవనాలు రచియించి
మూర్ఖు డతడు రాజ పూజి తుండు !
అమ్మా శ్రీమతి రాజేశ్వరి గారూ!
రిప్లయితొలగించుశుభాభినందనలు. మీ 2 పద్యములు బాగుగ నున్నవి. స్వస్తి.
పూజ్య గురువులకు ధన్య వాదములు
రిప్లయితొలగించుశ్రీ సరస్వత్యై నమః :
రిప్లయితొలగించుమిత్రులారా! పద్యము / శ్లోకము
శబ్దరత్నాకరములో ఇచ్చిన అర్థములు:
పద్యము: ఛందోబద్ద్ధమైన కావ్యము.
శ్లోకము: సంస్కృత పద్యము. కీర్తి
స్వస్తి.
ఆయుధమ్ము చేత నమరియున్ననుగాని
రిప్లయితొలగించువాడి మార్చు కొనడు వాడి బ్రతుకు
ఓట్ల నడుగు వాని యుచ్చులో పడు వాడు
మూర్ఖు డతడు 'రాజ పూజితుండు'.
మిత్రులందరూ వైవిధ్యంగా, మనోహరంగా పూరణలు చెప్పి ఆనందాన్ని కలిగించారు. ఎవరి పూరణలోను సవరించ వలసిన దోషాలు లేవు. సంతోషం..
రిప్లయితొలగించుపూరణలు పంపిన....
సహదేవుడు గారికి,
సత్యనారాయణ మూర్తి గారికి,
లక్ష్మీదేవి గారికి,
కమనీయం గారికి,
పండిత నేమాని వారికీ,
మిస్సన్న గారికి,
సుబ్బారావు గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
......... అభినందనలు, ధన్యవాదాలు.
*
జిలేబీ గారూ,
సురేశ్ గారూ,
సంతోషం...మీ భావాలకు ఎవరైనా పద్యరూపం ఇస్తారేమో అని చూసాను. ఎవరూ ఆ ప్రయత్నం చేయలేదు.
గురువు గారూ,
రిప్లయితొలగించుజిలేబి గారి భావానికి ఈ పద్యం సరిపోతుందా ?
చదువు లేదు, మంచి సంస్కృతి ఉన్నది
పరమ భక్తుడతడు,పరమ యోగి
శిష్టులైన వారి సేవ చేయునతడు
మూర్ఖుడతడు,రాజ పూజితుండు.
గురువు గారూ,
రిప్లయితొలగించుసురేశ్ గారి భావానికి నా ప్రయత్నం.
తోలు మందము,బుర్ర తౌడుతో నిండిన
వారసత్వ రాజ్య వారసుండు
నేటి నేతయు బుద్ధి నేపాటి లేనట్టి
మూర్ఖుడతడు, రాజ పూజితుండు.