4, మే 2012, శుక్రవారం

రవీంద్రుని గీతాంజలి - 2

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

2
WHEN thou commandest me to sing
it seems that my heart would break
with pride ; and I look to thy face, and
tears come to my eyes.

All that is harsh and dissonant in
my life melts into one sweet harmony
and my adoration spreads wings like
a glad bird on its flight across the sea.

I know thou takest pleasure in my
singing. I know that only as a singer
I come before thy presence.

I touch by the edge of the far spreading 
wing of my song thy feet which I
could never aspire to reach.

Drunk with the joy of singing I for-
get myself and call thee friend who art
my lord. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము...

నేను పాడుటకొఱకు నీ వాన యిడిన,
గర్వభరమున నాదు వక్షస్థ్సలమ్ము
పికిలిపోయెడునంతగాఁ బెకలి వచ్చె ||

కన్నుఁగవ నిండ బాష్పముల్ గ్రమ్మి నేల
రాలెఁ బటపట, రెప్పలు వ్రాలనీక
నీ ముఖమువైపు సూచుచు నిలిచిపోతి ||

నా బ్రతుకులోని కటుకఠినత్వ మెల్ల
నమృతమయమగు మధురగానముగఁ గరఁగి
కరఁగి పరివర్తనమ్మును గనుచునుండె ||

సర్వ మస్మదారాధనసాధనమ్ము
జలధిమీది యుడ్డీనఁపు టెలమి లేచు
విహగముం బోలె రెక్కలు విప్పుచుండె ||

నిజముగాఁ బ్రీతి యొనగూర్చు, నీకు నాదు
గీతరాగ మవశ్యము ప్రీతి గూర్చు
తెలియు నిది ‘యొక గాయకువలెనె యేను
నీదు సమ్ముఖమునకు రా నేర్తు’ నంచు ||

ఆస్మ దుద్భిన్నగీతపక్షాంచలమ్ము
లెత్తి, నే నెప్పుడేని యాసింప లేని
తావకీన పదంబులు తాకుచుండు ||

గానఁపున్మత్తులో నన్ను నేనె మరచి
"నెచ్చెలీ!" యందు మత్ప్రభూ! నిన్ను గూడ ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి