15, మే 2012, మంగళవారం

సమస్యాపూరణం - 705 (మాధవునకు శత్రువు గద)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...


మాధవునకు శత్రువు గద మకరధ్వజుఁడే!

ఈ సమస్యను సూచించిన  
పోచిరాజు సుబ్బారావు గారికి
ధన్యవాదాలు.

11 కామెంట్‌లు:

 1. శ్రీ సరస్వత్యై నమః:

  పరమేశ్వరుడు సాధు హృదయుడు. ఆ మహాత్మునికి ఎవ్వరి యందు విరోధము ఉండదు. దేవతల ప్రయోజనము కొరకు పార్వతీ పరమేశ్వరుల పరిణయము జరుప వలెను. అంతటి మంచి ప్రయోజనము లక్ష్యముగా గల మన్మథుడు పరమేశ్వరుని కంటి మంటలచేత భస్మమగుటలో ఏదో ఒక అజ్ఞాతమైన పరమ రహస్యము ఉండి యుండును. నా పూరణలో ఆంతర్యము ఇదే. మాధవునకు అనే పదములో ముందు పదములోని ఉత్త్వమును కలిపితే ఉమాధవుడు అగుచున్నది కదా. స్వస్తి.

  సాధు హృదయు డీశానుడు
  మాధవునకు శత్రువు కద మకరధ్వజుడే
  వేధించి మడిసె నననే
  దో ధర్మ ప్రయోజనమ్ము నుండా లీలన్

  రిప్లయితొలగించండి
 2. శోధన జేయగ మన్మధుఁ
  సాధనముగజేసికొనుచు సర్వము చెప్పెన్
  బోధాత్మకముగ యట్టి ఉ
  మాధవునకు శత్రువు గద మకరధ్వజుఁడే!

  రిప్లయితొలగించండి
 3. శోధన జేయగ పుత్రుడు
  మాధవునకు శత్రువు గద మకరధ్వజుఁడే
  యీధరలో తలప విరహ
  బాధను కృశి యించు వారి పాలిట నెపుడున్.

  రిప్లయితొలగించండి
 4. శ్రీధరుడు తలచి నంతనె
  రాదా మాధవ ప్రణయము రాస క్రీడల్ !
  ఈ ధరను నిజము కాదన
  మాధవునకు శత్రువు గద మకర ద్వజుడే !

  రిప్లయితొలగించండి
 5. నాదశరీరుండైన ను
  మాధవునకు శత్రువు గద మకరద్వజుడే
  మోదము నింపగ రాగపు
  బూదోటను దింపబోయి పుణ్యుoడయ్యెన్

  రిప్లయితొలగించండి
 6. గుండా సహదేవుడు గారి పూరణ.....

  పేదరికమున జనాభా
  బాధల మూలము మనోజు బాణము గాదే?
  యీ ధర స్థితి కారకుడౌ
  మాధవు నకు శత్రువు గద మకర ధ్వజుడే!

  రిప్లయితొలగించండి
 7. కవిమిత్రులారా,
  ఈ నాటి పూరణలలో కొందరు మిత్రులు ‘ద-ధ’లకు ప్రాస వేసారు. అది ‘స్వవర్గజ ప్రాస’ గా కవి పండిత సమ్మతమే!

  రిప్లయితొలగించండి
 8. ఈ ధీరుడు పుత్రుడగును
  మాధవునకు;శత్రువు గద మకరధ్వజుఁడే
  తా ధాటిగ పూబాణము
  నే ధైర్యముగా విడెనట నీశుని పైనే!

  రాధను వలచిన వాడగు
  మాధవునకు శత్రువు గద మకరధ్వజుఁడే
  బాధల,విరహపు వేళల
  నీ ధరణిని మదన బాధ నింతింతౌనా?

  రిప్లయితొలగించండి
 9. కవిమిత్రులకు నమస్కృతులు.
  సమయాభావం వల్ల అందరి పూరణలను విడివిడిగా ప్రస్తావించలేక పోతున్నాను. మన్నించండి.
  వైవిధ్యంగా పూరణలు పంపిన
  పండిత నేమాని వారికి,
  ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారికి,
  మిస్సన్న గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  మంద పీతాంబర్ గారికి,
  గుండా సహదేవుడు గారికి,
  లక్ష్మీదేవి గారికి
  ..... అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 10. మాధవుని వీడె లక్ష్మియె
  మాధవునే కాలదన్న మదమున ఋషియే
  బాధలను పెంచె విరహము
  మాధవునకు శత్రువు కద మకరధ్వజుడే.

  రిప్లయితొలగించండి
 11. అరేబియా:

  సాధించుచు రాత్రి పవలు
  వేధించుచు నల్గురమ్ము వెంబడి పడగా
  బాధల నిచ్చెడి వాడై
  మా ధవునకు శత్రువు గద మకరధ్వజుఁడే!

  రిప్లయితొలగించండి