మిస్సన్న గారూ, మీ ‘స్వకాంతా విమోహం’ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * సత్యనారాయణ మూర్తి గారూ, ‘దివిజ వారాకాంతా వ్యామోహమా?’ మీ పూరణలోని చమత్కారం అలరించింది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, గోపికాలోలుని కథలను మెచ్చని దెవరు? ప్రశస్తమైన పూరణ. అభినందనలు. సవరించిన తర్వాత కూడా మొదటిపాదంలో గణదోషం. ‘పతి పఠించు పురాణమున్ సతియె వినెను’ అందామా? * సుబ్బారావు గారూ, చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు. ‘నిగ్రహంబ యచలమని’ అంటే ఎలా ఉంటుందంటారు?
రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణలో కవితా దీప్తి జాలువారుతున్నది. చక్కని పూరణ. అభినందనలు. * మిస్సన్న గారూ, ‘దాసుని తప్పులు దండముతో సరి’ అన్న మీ పూరణ తనివార జేస్తున్నది. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, విరుపును సంబోధనగా మార్చిన మీ నైపుణ్యం కొనియాడదగింది. చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు. * వసంత కిశోర్ గారూ, ఈ సమస్య నిస్తున్నప్పుడే అనుకున్నాను ఎవరో ఒకరు ‘సుమతి’ ప్రస్తావన తెస్తారని! ఆ పని మీరు చేసారు. ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
నాదు భాగ్యంపు రాశివై నావు చెలియ
రిప్లయితొలగించండియనుచు రేయెల్ల వలపుల మునిచి తేల్చి
యలసి నిద్రించు పతిచేష్ట దలచి తెల్ల-
వార కాంతా విమోహమున్ భార్య మెచ్చె.
భగవదారాధనంబును, పగలు రాత్రి
రిప్లయితొలగించండిదానధర్మాలు చేయుచు ధన్యుడగుచు
స్వర్గసుఖములు గోరెడు భర్తృదివిజ
వారకాంతావిమోహమున్ భార్య మెచ్చె.
పతి చెప్పు పురాణమును సతియె వినెను
రిప్లయితొలగించండిభాగవతమున కృష్ణ భగ వాను లీల
లందున రస రమ్యముగాను యాదవ పరి
వారకాంతా విమోహమున్ భార్య మెచ్చె.
మిస్సన్నగారూ!
రిప్లయితొలగించండిమీ పూరణ చాలాబాగుంది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపతి చెప్పు పురాణమును సతియె వినెను
రిప్లయితొలగించండిభాగవతమున నల్లరి వాసు దేవు
కోరి కొనియాడి విహరించు గొల్లల పరి
వారకాంతా విమోహమున్ భార్య మెచ్చె.
తులువ పని యని భావించి త్రోసి పుచ్చె
రిప్లయితొలగించండివార కాంతా విమోహమున్ , భార్య మెచ్చె
మగని ఇంద్రియ నిగ్రహం బ పటిమమును
వార కాంతల నెయ్యము వలదు వలదు
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ ‘స్వకాంతా విమోహం’ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
సత్యనారాయణ మూర్తి గారూ,
‘దివిజ వారాకాంతా వ్యామోహమా?’ మీ పూరణలోని చమత్కారం అలరించింది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
గోపికాలోలుని కథలను మెచ్చని దెవరు? ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
సవరించిన తర్వాత కూడా మొదటిపాదంలో గణదోషం. ‘పతి పఠించు పురాణమున్ సతియె వినెను’ అందామా?
*
సుబ్బారావు గారూ,
చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
‘నిగ్రహంబ యచలమని’ అంటే ఎలా ఉంటుందంటారు?
ఏమి తపములు జేసిన నేమి ఫలము
రిప్లయితొలగించండిచెలియ ప్రేమను మించిన చెలువ మేది ?
దివిజ లోకాల తేలించు దీప్తి జాలు
వార కాంతా విమోహమున్ భార్య మెచ్చె !
పారిజాతమ్ము నీకిత్తు భామ మాను
రిప్లయితొలగించండిమలుక, దాసుని నేరము చెలియ చెల్లు
దండమున ననె కృష్ణుడు తనకు తని-
వార, కాంతా విమోహమున్ భార్య మెచ్చె.
శంకరార్యా! గణదోషమునకు చక్కని సవరణ చేసినందులకు ధన్యవాదములు.సవరణతో...
రిప్లయితొలగించండిపతి పఠించు పురాణమున్ సతియె వినెను
భాగవతమున నల్లరి వాసు దేవు
కోరి కొనియాడి విహరించు గొల్లల పరి
వారకాంతా విమోహమున్ భార్య మెచ్చె.
భార్యయొక్క అమూల్యమైన ప్రేమను పొందినానని ఒక పురుషుడు వారకాంతతో చెప్తున్నట్లుగా ........
రిప్లయితొలగించండినిర్మలంబైన నీప్రేమ నిరతముగను
కోరివచ్చితినన్ను చేకొనుమటంచు
వేడగా చేరి నాకుసంప్రీతినొసగె ( తన భార్య )
వారకాంతా! విమోహమున్ భార్య మెచ్చె.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
సతీసుమతి :
01)
___________________________________
వారకాంతా విమోహమున్ - భార్య మెచ్చె
గాన కౌశికు తలపైన - గంప లోన
నిలిపి వారకాంతను జేర్చ - నిశ్చయించి
కారు చీకటి వర్షమ్ము - క్రమ్ము కొనిన
కాళరాత్రిని సుమతియె - కదలె గనుడు !
___________________________________
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పూరణలో కవితా దీప్తి జాలువారుతున్నది. చక్కని పూరణ. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
‘దాసుని తప్పులు దండముతో సరి’ అన్న మీ పూరణ తనివార జేస్తున్నది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
విరుపును సంబోధనగా మార్చిన మీ నైపుణ్యం కొనియాడదగింది. చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
ఈ సమస్య నిస్తున్నప్పుడే అనుకున్నాను ఎవరో ఒకరు ‘సుమతి’ ప్రస్తావన తెస్తారని! ఆ పని మీరు చేసారు. ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
గురువుగారూ ధన్యవాదాలు
రిప్లయితొలగించండిమూర్తి గారూ ధన్యవాదాలు..
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండి