14, మే 2012, సోమవారం

పద్య రచన - 22

 కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

12 కామెంట్‌లు:

 1. గోమాతా! క్షమియింపుము
  మా మానవ జాతి దోషమౌ నిది, యెన్నె
  న్నో మేళులు చేసెడు మీ
  కై మేలును చేయదగము, కరుణను గనుమా!

  రిప్లయితొలగించండి
 2. అమృతమ్ము కొరకు క్షీరాబ్ధి ద్రచ్చెడు వేళ
  నావిర్భవించిన యమలమూర్తి
  తన శరీరఛ్ఛాయ థాళథాళ్యంబును
  దిశలెల్ల నింపెడు దివ్య మూర్తి
  తనను సేవించెడు మునిబృందములకెల్ల
  భోజనమ్ము నొసంగు పుణ్యమూర్తి
  చేరి ప్రార్థించెడు వారి చింతల దీర్చి
  కామితార్థములిచ్చు ప్రేమమూర్తి
  ఆమె తలపులు లోక శ్రేయస్కరములు
  ఆమె చూడ్కులు సతత దయాన్వితములు
  ఆమె కామధేనువు సద్గుణాభిరామ
  ఆమె నాదృతి ధ్యానించి యంజలింతు

  రిప్లయితొలగించండి
 3. శిశువు యాకలి దీర్చగ సిద్ధముగను
  కలిగి యుండు పాల కడలి కడుపులోన
  నమిత సాధుగుణముతోడ నలరుచుండు
  గోవు నెల్లవేళలయందు గొలుచుచుందు.

  పరమ భాగవతుడు చేయు పలురకముల
  పూజలను మించి గోసేవ పుణ్యమగును,
  పిలిచి చెప్పుచుంటి వినుడు ప్రీతితోడ
  గోవు నందు కలరు యెల్ల గొప్పవారు.

  ఆవు లోన కొలువయిన యఖిల దేవ
  గణము కోరి వరములిచ్చి కాచగలదు
  జగమునెల్ల, గడ్డి తినెడు జంతువనుచు
  యెంచి పొరబాటు పడబోకు మెప్పుడైన

  గోవు పంచకమ్మును మించు గొప్ప మందు
  గలదె లోకమందు నెపుడు, కల్ల కాదు
  సకల రోగహరము , పాప శమము జరుగు
  నాదరింపుమికనయిన నందు ఫలము.

  రిప్లయితొలగించండి
 4. అమ్మా! లక్ష్మీ దేవి గారూ!
  శుభాశీస్సులు.
  మీ పద్యములలో ఈ క్రింది సంధి ప్రయోగములు సవరించ వలెను. పరిశీలించండి:

  (1) శిశువు + ఆకలి
  (2) కలరు + ఎల్ల గొప్ప వారు
  (3) జంతువనుచు + ఎంచి పొరపాటు
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 5. అయ్యా,
  నమస్కారములు.
  నాకున్న వ్యాకరణజ్ఞానము లేశమాత్రము.
  దయచేసి మార్పులు సూచించగలరు.
  లేదా నేను పదాలు ఇలా మార్చవచ్చా, చెప్పగలరు.

  శిశువు క్షుద్బాధ దీర్చగ...
  గోవు నందున గలరెల్ల ...

  గడ్డిదినెడు జంతువనుచు
  నెంచి

  ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 6. పండిత నేమాని వారూ,
  కామధేనువును గురించిన మీ పదం మనోజ్ఞంగా ఉంది. ధన్యవాదాలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ నాలుగు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
  పండిత నేమాని వారి సూచనలను గమనించారు కదా! నా సవరణలు....
  (1) శిశువు ఆకలి - శిశువు క్షుద్బాధ
  (2) గోవు నందు కలరు యెల్ల - గో్వు నందున కలరెల్ల
  (3) జంతువనుచు యెంచి - జంతు వనుచు నెంచి.

  రిప్లయితొలగించండి
 7. అన్నయ్య గారి కామధేనువు వర్ణన అద్భుతము. లక్ష్మీ దేవి గారి పద్యాలు చాలా బాగున్నాయి.

  తల్లి రూప మందు పిల్లవారిని బ్రోచు
  కామధేను వనుచుఁ , గరుణ లేక
  తాడనమ్ము జేయు దౌర్భాగ్యులము మేము
  తల్లిఁ దిందు రయ్య దైత్యు లైన ?

  రిప్లయితొలగించండి
 8. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  ‘తల్లిఁ దిందు రయ్య దైత్యులైన?’ అనడం బాగుంది. మంచి పద్యం. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. క్షీరమ్మునొసగు మనలకు;
  కారుణ్యమునకును మూర్తిగా కనవోయీ!
  మారని గుణముల పెన్నిధి;
  భారముగానిక తలపున భావింపకుమా!

  శారద, బ్రహ్మయు, మునులును
  నారద, పశుపతి, గిరిజయు, నాగేంద్రులునున్,
  కోరి వరమ్ముల నిత్తురు,
  చేరి గొలుచుమెపుడు గోవు శ్రీ లక్ష్మి సుమా!

  రిప్లయితొలగించండి
 10. దేవ గణముల నిలయమ్ము ధేను వనగ
  క్షీర సాగర మందుండి క్షీర ధాత్రి
  గడ్డి పెట్టిన పాలిచ్చు దొడ్డ మనసు
  అవత రించెను జగతిని యార్తి దీర్చ !

  క్షీర ధాత్రి = పాలిచ్చు దాది

  రిప్లయితొలగించండి
 11. లక్ష్మీదేవి గారూ,
  ‘గోవు మాలచ్చికి కోటిదండాలు’ పాటను గుర్తుకు తెచ్చారు మీ చక్కని పద్యాలతో. ధన్యవాదాలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మంచి పద్యం చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి