13, మే 2012, ఆదివారం

ప్రత్యేక పద్యాలు (చందస్సులు) - 1

          కొన్ని ప్రత్యేక పద్యములను మన మిత్రులకు పరిచయము చేద్దామని ఈ శీర్షికను ప్రారంబించేను.  పరిశీలించండి:

మాలిని వృత్తము -  
ఇది 15 వ ఛందమైన ‘అతిశక్వరి’లో 4671వ వృత్తం.
గణములు  :  న న మ య య
యతి      :  9వ అక్షరము
ప్రాస    :  నియమము కలదు

ఉదా:
జయము జయము రామా! సర్వలోకాభిరామా!
జయము జయము శ్యామా! శాశ్వతానందధామా!
జయము జయము శౌరీ! సాధు చేతో విహారీ!
జయము జయము నేతా! సర్వ సౌఖ్యప్రదాతా!
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

7 కామెంట్‌లు:

 1. మన మిత్రులు ఈ చందస్సును ఉపయోగించి పద్యములను వ్రాస్తారని ఆశిస్తున్నాను. అది యొక క్రొత్త అభ్యాసము అవుతుంది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 2. thank you very much sir, we will try to write in this vrutham.
  with regards
  varaprasad

  రిప్లయితొలగించండి
 3. నమస్కారములు
  గురువుల దయ వలన పద్య రచన నేర్చు కోగల అదృష్టం కలిగి నందులకు ఛాలా ఆనందము గా ఉన్నది . గురువులు శ్రీ పండిత నేమాని వారికి , శ్రీ శంకరయ్య గారికీ , కృతజ్ఞతాభి వందనములు

  రిప్లయితొలగించండి
 4. శ్రీ నేమాని వారికి నమస్సులు. క్రొత్త వృత్తమును నేర్పుచున్నందులకు ధన్యవాదములు.
  నా చిన్ని ప్రయత్నము మీ బాటలోనే...

  జయ జయ రఘు నాధా ! జానకీ లోల రామా!
  జయ జయ శుభ నామా!సార్వభౌమా!సుధామా!
  జయ జయ మహ నీయా ! శంభుహృద్వందనీయా!
  జయ జయ వినుమా ! మా సన్నుతిన్, బ్రోవ రావా!

  రిప్లయితొలగించండి
 5. భయద దనుజ హారీ ,భావగంభీర మూర్తీ
  ,
  దయనుదలచి వేగన్ ధారుణీపుత్రి తోడన్ ,
  నయముగ నను గావన్ ,నా మొరాలింప రావా
  జయము జయము రామా ,సర్వ లోకాభిరామా .

  రిప్లయితొలగించండి
 6. రాజేశ్వరి అక్కయ్యా,
  నేమాని వారి మార్గదర్శనం మనకు లభించడం మన అదృష్టం. వారికి సర్వదా కృతజ్ఞుణ్ణి!
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  సలక్షణమైన పద్యాన్ని వ్రాసి అలరించారు. అభినందనలు.
  *
  కమనీయం గారూ,
  చాలా బాగుంది మీ పద్యం. సంతోషం! అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. మాలిని

  మహిని నడచి శ్రీరామాఖ్యుగా నిల్చి యెంతో
  సహన గుణము సీతా సాహచర్యంబు తోనే
  విహితముగను రామా, వేడి నేర్చేవు దేవా!
  మహిమ పొగడ రాదే ,మాదు తప్పెంచనేలా?

  రిప్లయితొలగించండి