13, మే 2012, ఆదివారం

పద్య రచన - 21

  కవిమిత్రులారా,


పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

15 కామెంట్‌లు:

 1. బాల్య మిత్రమ! దర్శన భాగ్య మౌర
  యిన్ని నాళ్ళకు కలిగించి తీ వ సామి !
  చరణ జలములు నాపైన జల్లు కొందు
  పాద ములుగడి గి, సుదామ ! పదము లిమ్ము .

  రిప్లయితొలగించండి
 2. శ్రీకృష్ణలీల బేర్కొను
  శ్రీకరమగు రచనములను జేయుటతో న
  స్తోక శ్రీఫలము లొదవు
  నేకాగ్రత మెరయ నటుల నే విరచింతున్

  ధర సుదాముండన బరగు విప్రుడొకండు
  నిరుపేద వాడయ్యు నిర్మలమతి
  దారతో పెక్కు సంతానమ్ముతో జీవి
  తమ్ము గడపుచుండె దైన్యముగను
  అయ్యెడ నొక్క నాడాతని యిల్లాలు
  హిత వాక్యముల దెల్పె నివ్విధమున
  స్వామి! శ్రీకృష్ణుండు బాల్యమిత్రుడు మీకు
  నాదరించును కదా యతని జేరి
  మన పరిస్థితి దెలుపుచో మాధవుండు
  సత్వరము కోర్కె మన్నించు సంపదలను
  మన కొసంగగలడు గాన జనుడటంచు
  ద్వారకాపురికి పతిని పంపె నచట

  తన మందిరమునకు జనుదెంచు చుండిన
  స్నేహితునిన్ గాంచి చిత్తమలర
  శ్రీకృష్ణు డెదురేగి ప్రేమతో సుమధుర
  వచనాలతో వాని బల్కరించి
  ఆతిథ్యము నొసంగి యలనాటి కథలను
  మోదమ్ముతో చాల ముచ్చటించి
  ఆతని కడనున్న యటుకుల ప్రేమతో
  గైకొని సంతృప్తిగా భుజించి
  వీడుకోలిచ్చి చాల సంప్రీతితోడ
  వాని దైన్యమ్ము నంతను బరిహరించి
  సకల సంపదలను విశేషముగ గూర్చె
  చెలిమియే కుచేలునికిచ్చె కలిమి బళిర!

  రిప్లయితొలగించండి
 3. హితవు పలికె నాథా యిప్పుడే పోయి రండ-
  చ్యుతుని గలియ తీరున్ చూడరే లేమి యెల్లన్
  అతివినయము మీరన్నా సుదాముండు జేరెన్
  బితుకు బితుకు మంచున్ వేదవేద్యుండు చోటున్.

  నడచి నడచి రాగా నన్ను జూడంగ ప్రేమన్
  విడువ గలనె కాళ్ళన్ వేడెదన్ పట్టనీవే
  కడిగి జలము తోడన్ కందిపోయెo గదయ్యా
  అడలెద వది యేల న్నంచు వెన్నుండు పల్కెన్.

  స్తిమిత పరచి మిత్రున్ శ్రీ ధరుం డయ్యెడన్ స-
  ద్విమల యశము మీరన్ ప్రేమ నైశ్వర్య మిచ్చెన్
  నమిలి యటుకు లంతన్నవ్వుచు న్నాలు బిడ్డల్
  క్రమముగను సుఖింపన్ కాంచరే వాని లీలల్.

  రిప్లయితొలగించండి
 4. బాల్యమునందు స్నేహితుడవై పలువిద్యలనభ్యసించి, యౌ
  జ్జ్వల్యము జెంది వేదవిధి బ్రాహ్మణభాద్యతలాచరించుచున్,
  శల్యమువోలెనిల్చితివి చప్పుననిచ్చెద నీకునేడు సా
  కల్యశుభంబులన్ సకల కామితముల్ గ్రహియించు మిత్రమా.

  రిప్లయితొలగించండి
 5. శ్రీ మిస్సన్న గారికి అభినందనలు. మాలినీ వృత్త రచనలో మంచి ప్రారంభము చేసేరు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 6. శ్రీపతిశాస్త్రిఆదివారం, మే 13, 2012 5:42:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  శ్రీకృష్ణపరమాత్మ రుక్మిణీదేవితో యివ్విధంబుగా పలికె.

  ధన్యతనొందితిన్ ప్ర్రియసుధాముని గాంచగ రుక్మిణీసతీ
  మాన్యుడు మంచిమిత్రుడును మా గురుదేవుల శిష్యరత్నమున్
  అన్యుడు కాడునాకతడు యర్ఘ్యము పాద్యము సంపదల్ యశో
  ధాన్యములిచ్చి కొల్చెదను ధాత్రిని నిల్వగ శాస్వతంబుగాన్

  రిప్లయితొలగించండి
 7. బాల్య మిత్రుని గాంచిన పరవ శించి
  అర్ఘ్య పాద్యాదు లర్పించి యతిధి యనుచు
  పిడికె డటుకులు సేవించి ప్రీతి చెంది
  పొంగి సిరులను కురిపించె పొంత మనుచు !

  రిప్లయితొలగించండి
 8. పండిత నేమాని వారూ,
  మీరు ‘లేఖిని’ వాడుతున్నారు కదా! క్రింది విధంగా టైప్ చేయండి....
  venka = వెంక
  ven&ka = వెన్క

  రిప్లయితొలగించండి
 9. సుబ్బారావు గారూ,
  చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.
  *
  పండిత నేమని వారూ,
  కుచేలునిపై మీ ఖండిక నిజంగానే ‘శ్రీకర’మైన రచన. ధన్యవాదాలు.
  *
  మిస్సన్న గారూ,
  నేమాని వారు మాలిని లక్షణాన్ని చెప్పడం, వెన్వెంటనే మీరు లక్ష్యాలుగా పద్యాలు వ్రాయడం సంతోశకరం. అభినందనలు.
  ‘వేదవేద్యుండు చోటున్’ ? వేదవేద్యుడు ఉండుచోటా? అక్కడ ‘వేదవేద్యున్ గనంగన్’ అంటే ఎలా ఉంటుంది?
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పద్యం చక్కని ధారతో సుందరంగా ఉంది. అభినందనలు.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  చాలా బాగుంది మీ పద్యం. అభినందనలు.
  ‘అతడు + అర్ఘ్యము’ అన్నప్పుడు సంధి జరగాలి. యడాగమం రాదు. ‘అతడె యర్ఘ్యము’ అంటే సరి!
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  ధన్యోస్మి! నిర్దోషంగా చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. నేమాని పండితార్యా ధన్యవాదములు.
  గురువుగారూ తప్పును సవరించినందుకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 11. ఆర్యా!
  నమస్కారములు.
  ఈ చిత్రానికి నిన్నటి రోజంతా కరెంటు లేని కారణంగా పద్యరచన సకాలంలో పోస్టు చేయలేక పోయాను. ప్రస్తుతం కరెంటు ఉండటంతో వ్రాస్తున్నాను. ఆలస్యానికి మన్నించగలరు.
  సీ.
  అధికసంతతిసాకు విధమెద్దియో కాన
  రాదాయె నింక నో ప్రాణనాథ!
  దారిద్ర్య మింటిలో తాండవించుచునుండె
  క్షుద్బాధ దేహంబుఁ గూల్చుచుండె,
  భోజనహీనులై(దూరులై) పుత్రులల్లాడంగ
  చూడలేకున్నాను సుతుల గతులు
  ఏజన్మ పాపమో ఈరీతి వికటించె
  తెలియకున్నదికేమి పలుకుదాన
  రమ్యగుణశాలి లోకైక రక్షకుండు,
  బాల్యమిత్రుండు సంపూర్ణభాగ్యదాత,
  కృష్ణపరమాత్మ సాక్షాత్తు విష్ణువందు
  రతని దర్శించి సాహాయ్య మడుగ దగును.
  ఆ.వె.
  అనుచు ధర్మపత్ని యారీతి పలుకంగ
  తన్మయత్వమంది ధరణిసురుడు
  పరమభక్తితోడ భగవాను దర్శించ
  ద్వారకాధినాథుఁ జేరినాడు.
  సీ.
  ప్రాణమిత్రునిరాక పరమహర్షముగూర్చ
  ద్వారంబు కడకేగి గారవించి,
  ఆకుచేలునితోడ యాలింగనం బంది
  సింహాసనాసీను జేసి యపుడు
  అతిథి దైవముగాన నర్ఘ్యంబు లర్పించి
  పాదంబు స్పృశియించి పాద్యమిచ్చి
  భూసురుల్ చూడంగ భోజనప్రియులంచు
  పక్వాన్న మందించె బ్రాహ్మణునకు
  సకల లోకైక నాథుడౌ చక్రి యిట్లు
  సత్కరించిన తీరుకు సంతసించి
  ప్రణతులర్పించెనే గాని, పత్ని కాంక్ష
  చెప్ప నోరాడలేదు కుచేలునకును.
  కం.
  సర్వాంతర్యామిగదా!
  సర్వేశ్వరుడైన శార్ఙి సంతోషముతో
  నుర్వీసురునకు నొసగెను
  సర్వైశ్వర్యంబు లింక సద్వైభవముల్.
  మ.కో.
  కోరిచేరగ భక్తబృందము కోర్కెలన్నియు దీర్చుచున్
  వారియుల్లము లుల్లసిల్లగ వైభవంబులు గూర్చుచున్
  ధీరతన్ గలిగించుచుందువు దివ్యతేజమొసంగుచున్
  శౌరి! నీకివె వందనంబులు శార్ఙి! యాగమసన్నుతా!
  కం.
  కరుణాసాగర! ధీరా!
  సరసాత్మక! దీనబంధు! సర్వోద్ధారా!
  వరగుణ! యదుకులవీరా!
  నిరతము మము గావుమయ్య! నిఖిలాధారా!

  ఆర్యా!
  మరి కొద్ది సేపట్లో(ఐదు గంటలకు) బయలుదేరి జమ్మూ శ్రీవైష్ణవీదేవి దర్శనానికి వెళ్తున్నాము. తత్కారణంగా రెండు/మూడు రోజులు పద్యరచనకు, సమస్యాపూరణకు దూరంగా ఉంటాను. సెలవు.
  ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 12. సత్యనారాయణ మూర్తి గారూ,
  మీ ‘కుచేలోపాఖ్యానం’ అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.
  వైష్ణోదేవి దర్శనం కోసం మీ యాత్ర సుఖంగా జరగాలని ఆకాంక్షిస్తున్నాను. తిరిగి వచ్చిన తరువాత వివరంగా యాత్రా విశేషాలు చెప్పవలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 13. @మంద పీతాంబర్ గారూ మీ పూరణ బాగుంది.

  తప్పు పనులను జేసిన తప్పదండ్రు
  నరకలోకము గలదండ్రు; నాకమందు

  రిప్లయితొలగించండి
 14. @సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ చాలా బాగుంది.
  "బాల్యమునందు స్నేహితుడవై పలువిద్యలనభ్యసించి, యౌ
  జ్జ్వల్యము జెంది వేదవిధి బ్రాహ్మణభాద్యతలాచరించుచున్,"

  రిప్లయితొలగించండి