కవిమిత్రులారా...
ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...
పుత్రుఁడ నేఁ గానటంచు పుత్రుఁడు పలికెన్.
ఈ సమస్యను సూచించిన
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి
ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...
పుత్రుఁడ నేఁ గానటంచు పుత్రుఁడు పలికెన్.
ఈ సమస్యను సూచించిన
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి
ధన్యవాదాలు.
పుత్రు నభిమన్యు గనుగొని
రిప్లయితొలగించండియాత్రముతో బల్కరింప నర్జునుడు దివిన్
జిత్రముగ రోయుచున్ నీ
పుత్రుడ నే గానటంచు పుత్రుడు పలికెన్
మిత్రుడు పిలచెను నన్నే
రిప్లయితొలగించండిచిత్రములో నాయకునిగ చేయగ, నాన్నా!
చిత్రము 'హిట్' కానిచొ మీ
పుత్రుఁడ నేఁ గానటంచు పుత్రుఁడు పలికెన్.
"ఛత్రపతి" చిన్నతనమున
రిప్లయితొలగించండిచిత్రముగా వచ్చి నిలిచి జిజియాంబికతో
శత్రుతురుష్కుల నణచక
పుత్రుడ నేఁ గానటంచు పుత్రుడు పలికెన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రునితో పోటీ పడి
రిప్లయితొలగించండిఆత్రము సాధింతు నేను ' ఐ ఐ టీ' నా
మాత్రము చేయని చో మీ
పుత్రుడ నే గానటంచు పుత్రుడు పలికెన్.
పుత్రా! ప్రహ్లాదా! నను
రిప్లయితొలగించండిచిత్రించుము నీమది,హరి సేవ వలదనన్
పిత్రా! శ్రీహరిఁ మఱచెడు
పుత్రుఁడ నేఁ గానటంచుపుత్రుఁడుపలికెన్!
చిత్రముగ నాభిగల శత
రిప్లయితొలగించండిపత్రంబున బుట్టి హరికి బ్రహ్మ యెరుకయే
మాత్రమును లేని స్థితిలో
పుత్రుడు నే గానటంచు పుత్రుడు పలికెన్
గురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిక్షత్రియ పుత్రుడనైతిని
క్షాత్రము నే చూపింతునిక,రణమునందున్
శత్రువునెన్నదరక,నీ (శత్రువునెన్నదరనిచో)
పుత్రుడ నే గానటంచు పుత్రుడు పలికెన్
శత్రుని దునుమాడి, వీర
ఛత్రపు ఛాయల యందును శయనించనిచో
క్షత్రియ ధర్మము నిలిపిన
పుత్రుడ నే గానటంచు పుత్రుడు పలికెన్.
నిన్నటి సమస్యలో జిలేబి గారు, సురేశ్ గారి భావలను పద్యంగా మార్చటానికి ప్రయత్నించాను. చిత్తగించగలరు.
రిప్లయితొలగించండికైకేయితో భరతుడు.
రిప్లయితొలగించండిశత్రువయితివే తల్లీ,
చిత్రము! నీ వర్తనమ్ము; ఛీత్కారమ్ముల్
క్షత్రియ వనితకు దెచ్చితి!
పుత్రుడనేఁ గానటంచు పుత్రుడు పలికెన్.
చిత్రము, దోషునిగా నను
రిప్లయితొలగించండిచిత్రించిరి మీదుయెదుట స్నేహితులే! నే
మాత్రము సచ్చీలుడను, కు
పుత్రుడు నేగానటంచు పుత్రుడు పలికెన్.
శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు:
రిప్లయితొలగించండిమీ పద్యము 2వ పాదములో "మీదు యెదుట" యడాగమము చేసేరు. ఇక్కడ యడాగమము రాదు. "మీ యెదుటనె" అని మార్చండి - బాగుంటుంది. స్వస్తి.
అయ్యా! శ్రీ మారెళ్ళ వామనకుమార్ గారు! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ 2 విధముల పూరణలు భావములో బాగున్నవి. అభినందనలు. మొదటి పద్యమును ఇలాగ మార్చి వ్రాస్తున్నాను:
క్షత్రియ పుత్రుడ గావున
క్షాత్రమ్మును నేను జూప గలను రణమునన్
శత్రువు నణచనిచో నీ
పుత్రుడ నే గానటంచు పుత్రుడు పలికెన్
మీ 2వ పద్యమును చూడండి:
మొదటి పాదములో: "శత్రుని దునుమాడి"కి బదులుగా "శత్రుని దునుముచు" అని మార్చండి.
దాని తరువాత "వీర ఛత్రపు" నకు బద్దులుగా "వీరఛ్ఛత్రపు" అని మార్చండి.
ఛ అనే హల్లు సంస్కృత సమాసాల మధ్యను వచ్చినచో దానిని ఛ్ఛ (ద్విత్వము) గానే వాడాలి. స్వస్తి.
పండిత శ్రీ నేమాని గురువు గారికి,
రిప్లయితొలగించండినమస్సులు. మరియు ధన్యవాదములు.
ఛత్ర భంగమైన తల్లిని
రిప్లయితొలగించండిపుత్రుని గానాదరించి పూజించు టిలన్ !
చిత్రము గాదట్లు చేయని
పుత్రుడనే గాన టంచు పుత్రుడు పలికెన్ !
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
మిత్రుల పూరణల సవరణలు సూచించి, (అనారోగ్యంతో బాధపడుతున్న) నాకు శ్రమ తగ్గించినందుకు ధన్యవాదాలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగున్నాయి మీ రెండు పూరణలు. అభినందనలు.
మొదటి పూర్ణలో... కాని‘చొ’ అనడం దోషం. అక్కడ ‘కాదో’ అందాం.
రెండవ పూరణ రెండవ పాదంలో దోషం లేదు, కాని ఇలా చెప్తే ఇంకా బాగుంటుందని నా సూచన...
‘ఆత్రముగా నే గడింతు ‘ఐ ఐ టీ’ నా...’
*
సత్యనారాయణ మూర్తి గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
*
వామన కుమార్ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
నేమాని వారి సవరణలను గమనించారు కదా!
జిలేబీ, సురేశ్ గారల భావాలకు మీ పద్యరూపాలను చూసాను. కాని అస్వస్థత కారణంగానూ, ఉదయ 9 గం.కు పోయిన కరెంటు ఇంతకుముందే వచ్చిన కారణంగానూ వ్యాఖ్యనించలేదు. కొన్ని దోషాలున్నాయి. తీరిగ్గా విశ్లేషిస్తాను.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ వైవిధ్యంగా చాలా బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మంచి ప్రయత్నం చేసారు. కాని భావం అవగాహన కావడం లేదు. 1,3 పాదాల్లో గణదోషం. సవరణకు లొంగేట్టు కనిపించడం లేదు.
శంకరార్యా! చక్కని సవరణకు. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిక్షత్రియుడనైజనించితి
రిప్లయితొలగించండిమిత్రద్రోహులు,కపటులు,మిము బాధింపన్
శత్రుల శిక్షింపనిచో
పుత్రుడ నేగానటంచు పుత్రుడు పలికెన్.
కమనీయం గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
మిత్రుడు నా తండ్రియనుచు
రిప్లయితొలగించండిచిత్రముగా దెలిసి నేడు చింతితుడైతిన్
శత్రుడ నీపుత్రుల; నీ
పుత్రుఁడ నేఁ గానటంచు పుత్రుఁడు పలికెన్
రాత్రియు పగలును చెబితిని
రిప్లయితొలగించండిపుత్రుడ బ్రాహ్మణ కులమున పూజ్యుడ ననుచున్
మిత్రమ! రోమను క్రైస్తవ
పుత్రుఁడ నేఁ గానటంచు పుత్రుఁడు పలికెన్