బ్లాగుమిత్రులందరికీ శుభాభివందనములు. శ్రీ యజ్ఞేశ్వర కృపాకటాక్షము వలన పెద్దల ఆశీస్సులతో ఘనస్వస్తి వచనముల మధ్య మాకుమారుడి ఉపనయనము వేదవిధిగా జరిగినది. తిరిగి బ్లాగు మిత్రులతో సత్కాలక్షేపము పద్యరచన చేసేందుకు అవకాశం దొరికినందులకు ఆనందంగా ఉన్నది. ప్రస్తుతానికి మెదడుకు తుప్పు పట్టినది. త్వరలోనే యతి గణ ప్రాస భంగములు లేకుండా సమస్యాపూరణం చేయటానికి ప్రయత్నిస్తాను. మిత్రుల అభిమానానికి కృతజ్ఞతలు.
సత్యనారాయణ మూర్తి గారూ, మంచి విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. * పండిత నేమాని వారూ, ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. * మిస్సన్న గారూ, మీ ‘చపల బుద్ధిహీనుల’ పూరణ బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, ‘యద్య దాచరతి శ్రేష్ఠః....’ సూక్తిని పూరణలో చక్కగా ఇమిడ్చారు. చక్కని పూరణ. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, వైవిధ్యమైన విరుపుతో ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు. * ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ, మీ కుమారుడి ఉపనయనం జరిగిన సందర్భంగా మీకు, మీ కుమారుడికి శుభాకాంక్షలు. మీ లోటు బ్లాగులో కనిపిస్తున్నది. పునస్స్వాగతం! * వసంత కిశోర్ గారూ, మురహరుడు సర్వ శరణ్యుడన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. ‘ఏమాయె నొద్దికయును’ అందాం. * వరప్రసాద్ గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు.
గురువుగారు, ధన్యవాదములు. ఒక విన్నపము. మీవ్యాఖ్యలలో మీరు అలవోకగా ఎన్నో విషయాలు చెపుతూ ఉంటారు. వీలు కుదిరినపుడు మీరు ఏమైనా వ్రాస్తే చదవాలని ఆసక్తి కలుగుతున్నది. మీరు పలు కార్యక్రమములో వ్యస్తులై ఉన్నారని విన్నప్పటికీ, మీ మాటలు వినాలనే ఉత్సుకతతో అడుగుతున్నాను. మీ తర్వాతి తరము వాళ్ళు తెలుసుకోదగిన మంచిమాటలను మీరు అప్పుడప్పుడూ వ్యాసరూపంలో అందించగలిగితే మేము ధన్యులమౌతాము. నమస్కారములతో లక్ష్మీదేవి.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ, వినయం భక్తుల ప్రధాన లక్షణం. ఆ వినయాన్ని ప్రదర్శించారు మీ పూరణలో. చక్కని పూరణ. అభినందనలు. * శ్రీపతి శాస్త్రి గారూ, సిరిసంపదలకోసం మ్రొక్కేవారు బుద్ధిహీనులన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
చోరు డీతడు వస్త్రాపహారి యనుచు
రిప్లయితొలగించండిబహువిధంబుల కృష్ణుని బలుకు చుంద్రు
బుద్ధిహీనులు, మ్రొక్కిరి మురహరునకు
తన్మయత్వాన విజ్ఞులు ధన్యులగుచు.
నమ్మి సేవింపగావలె నెమ్మనమున
రిప్లయితొలగించండినొక్క దేవునినేయంచు మిక్కుటమగు
భక్తిగలవారు సుజనులు బళిర విషమ
బుద్ధిహీనులు మ్రొక్కిరి మురహరునకు
లేని దానిని తానిచ్చు లెస్సగాను
రిప్లయితొలగించండిభక్తి గొలువగ తప్పక పరమ పురుషు
డనుచు నైశ్వర్య హీనులు నచట మరియు
బుద్ధిహీనులు మ్రొక్కిరి మురహరునకు.
స్వామి యనుచును దివ్యుడౌ సాధు వనుచు
రిప్లయితొలగించండిమంత్ర మనుచును భవ్యమౌ తంత్ర మనుచు
నాది పురుషుని మరచుచు నరగు చపల
బుద్ధిహీనులు మ్రొక్కిరి మురహరునకు.
వెన్న దొంగ గ ముద్రను వేయు చుండ్రు
రిప్లయితొలగించండిబుద్ది హీ నులు , మ్రొక్కిరి మురహరునకు
భక్తి శ్రద్ధలు నెరపుచు పాండు రంగ !
యనుచు కైదండ లిడుచును నార్తి తోడ .
ధనికులును పేదవారలు దండమిడిరి,
రిప్లయితొలగించండిస్త్రీలు, పురుషులు, వృద్ధులు, చిన్నవారు,
బుద్ధిమంతుల గాంచిన పుణ్యఫలమొ
బుద్ధిహీనులు మ్రొక్కిరి మురహరునకు.
పూర్వజన్మకర్మముచేత పుడమియందు
రిప్లయితొలగించండిదుష్టమగు కార్యములజేసి దురితులైరి
కర్మనశియించగా కలిగె ధర్మమైన
బుద్ధి, హీనులు మ్రొక్కిరి మురహరునకు.
బ్లాగుమిత్రులందరికీ శుభాభివందనములు. శ్రీ యజ్ఞేశ్వర కృపాకటాక్షము వలన పెద్దల ఆశీస్సులతో ఘనస్వస్తి వచనముల మధ్య మాకుమారుడి ఉపనయనము వేదవిధిగా జరిగినది. తిరిగి బ్లాగు మిత్రులతో సత్కాలక్షేపము పద్యరచన చేసేందుకు అవకాశం దొరికినందులకు ఆనందంగా ఉన్నది. ప్రస్తుతానికి మెదడుకు తుప్పు పట్టినది. త్వరలోనే యతి గణ ప్రాస భంగములు లేకుండా సమస్యాపూరణం చేయటానికి ప్రయత్నిస్తాను. మిత్రుల అభిమానానికి కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
___________________________________
బుద్ధి గలవారు మ్రొక్కిరి - మురహరునకు
బుద్ధి హీనులు మ్రొక్కిరి - మురహరునకు
బుద్ధి లేకున్న నేమాయె - యొద్దికయును
భక్తి గలవారె మ్రొక్కిరి - ముక్తి కొరకు !
___________________________________
గురువు గారికి, గురువర్యులందరికి నమస్కారములు
రిప్లయితొలగించండికొందరు అధికారమందున తాము జేసిన పాపపు పనులకు శిక్షలు పడకుండునట్లుజూడుమని మ్రొక్కుటనుజూచి,
------------
వెలుగు నీడన జేయగ వెర్రిపనులు
వెతలు జెంది నిలచిరిలే వెలుగులోన,
శంకరగిరి మాన్యముజూడ సంశయమున
బుద్ది హీనులు మ్రొక్కిరి మురహరునకు
సత్యనారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమంచి విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మీ ‘చపల బుద్ధిహీనుల’ పూరణ బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
‘యద్య దాచరతి శ్రేష్ఠః....’ సూక్తిని పూరణలో చక్కగా ఇమిడ్చారు. చక్కని పూరణ. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
వైవిధ్యమైన విరుపుతో ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు.
*
‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
మీ కుమారుడి ఉపనయనం జరిగిన సందర్భంగా మీకు, మీ కుమారుడికి శుభాకాంక్షలు. మీ లోటు బ్లాగులో కనిపిస్తున్నది. పునస్స్వాగతం!
*
వసంత కిశోర్ గారూ,
మురహరుడు సర్వ శరణ్యుడన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
‘ఏమాయె నొద్దికయును’ అందాం.
*
వరప్రసాద్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
గురువుగారు,
రిప్లయితొలగించండిధన్యవాదములు.
ఒక విన్నపము. మీవ్యాఖ్యలలో మీరు అలవోకగా ఎన్నో విషయాలు చెపుతూ ఉంటారు. వీలు కుదిరినపుడు మీరు ఏమైనా వ్రాస్తే చదవాలని ఆసక్తి కలుగుతున్నది.
మీరు పలు కార్యక్రమములో వ్యస్తులై ఉన్నారని విన్నప్పటికీ, మీ మాటలు వినాలనే ఉత్సుకతతో అడుగుతున్నాను.
మీ తర్వాతి తరము వాళ్ళు తెలుసుకోదగిన మంచిమాటలను మీరు అప్పుడప్పుడూ వ్యాసరూపంలో అందించగలిగితే మేము ధన్యులమౌతాము.
నమస్కారములతో
లక్ష్మీదేవి.
శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !
రిప్లయితొలగించండినిగమచయ విజ్ఞుల కగునె నెరయ నెఱుగ
రిప్లయితొలగించండివిశ్వరూపుని ,రక్షకు విదితముగను
సన్నుతించుటె మేలని నన్ను బోలు
బుధ్ధిహీనులు మ్రొక్కిరి ముర హరునకు
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిమోక్షదాయక మము బ్రోచి ముక్తినొసగు
మనుచు కోరిరి జ్ఞానులు హరిని గొలచి,
సంపదలు సిరులు కలుగ చాలుననుచు
బుద్ధిహీనులు మ్రొక్కిరి మురహరునకు
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండివినయం భక్తుల ప్రధాన లక్షణం. ఆ వినయాన్ని ప్రదర్శించారు మీ పూరణలో. చక్కని పూరణ. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
సిరిసంపదలకోసం మ్రొక్కేవారు బుద్ధిహీనులన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.