25, మే 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 715 (రంకు నేర్చిన చిన్నది)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

రంకు నేర్చిన చిన్నది బొంకలేదు.

ఈ సమస్యను సూచించిన
పోచిరాజు సుబ్బారావు గారికి
ధన్యవాదాలు.

9 కామెంట్‌లు:

 1. మాయలేడి కిలాడిని మాయ జేసి
  రాసలీలల చిత్రించి రట్టు జేసి
  తెల్గు 'చానళ్ళ ' చూపించి తెలియ జేయ
  రంకు నేర్చిన చిన్నది బొంకలేదు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కవిమిత్ర శుభోదయం,
   నిన్న,నేడు మీ పూరణలు సమకాలిక సంఘటనల ప్రతిబింబిస్తూ చక్కగావున్నవి.

   తొలగించండి
 2. వావి వరుసలు విడనాడి బరితె గించు
  రంకు నేర్చిన చిన్నది , బొంక లేదు
  పాప కర్మల యందున పట్టు కలిగి
  భీతి గలిగెడు మనసున్న బేల ,యనఘ !

  రిప్లయితొలగించండి
 3. కలిన కామప్రకోపాన కట్టుదప్పి
  రంకునేర్చినచిన్నదిబొంకునేర్చు
  కాలమహిమన తనవారికడుపునింప
  రంకునేర్చినచిన్నదిబొంకలేదు

  రిప్లయితొలగించండి
 4. రంకు నేర్చిన చిన్నది బొంక - లేదు
  దాని కేరీతి సౌఖ్యంబు ధరణిలోన
  భావి సద్గతులుండవు, భాగ్యరేఖ
  తొలగి పోవును కాదని దూరముగను.

  రిప్లయితొలగించండి
 5. అయ్యో సమస్యలే కర
  వయ్యెనె? ఈనాటి పాద మాదరణీయం
  బయ్యెనె? యిచ్చినవానికి
  చెయ్యెత్తి నమస్కరింతు చిత్తంబలరన్

  రిప్లయితొలగించండి
 6. వంక లెన్నియొ జెప్పుచు జంకు లేక
  ఇహము నందున నీరీతి అహము వీడి
  సుగుణ వతియైన వనితగ త్రిగుణ మందు
  రంకు నేర్చిన చిన్నది బొంక లేదు !

  రిప్లయితొలగించండి
 7. ఈ చిత్రమైన సమస్యను సరస సదర్థప్రసాదినిగానూ చూడవచ్చును.

  నా పూరణను పాల్కురికి సోమనాథుని బసవ పురాణంలో గురు భక్తాండారి కథలో చివఱికి వేశ్యయొక్క భక్తిపారమ్యాన్ని గ్రహించి, దుర్విటు డనుకొన్నమాటగా మలిచాను:

  ఉవిద దృగ్రోచిలో నుంకెక్కి చిక్కెను మినుసిగదేవర మిత్తిగొంగ
  మెలఁత కన్మెఱుఁగులో మెలయుచు నున్నాఁడు ముమ్మొనవాల్దాల్పు మొదలివేల్పు
  ముదిత వీక్షణములో మునుపడఁ గనుపడు నెద్దుతత్తడిజోదు యెఱుకపాదు
  మదిరాక్షి చూపులో మెదలుచుఁ బొడచూపు మదనుని తూపుల నదుము ఱేఁడు
  జాళువావింటివానిఁ, గృశానురేతు,
  వామదేవు, సద్యోజాతు, హేమకేశు,
  రంకుచర్మాంబరధరు, గోరంకు నెదఁ గ
  ఱంకు నేర్చిన చిన్నది, బొంకలేదు!

  (గోరంకుఁడు = దిగంబరుఁ డైన శివుఁడు; ఎదఁ గఱంకు = హృదయసన్నిధి)

  విధేయుఁడు,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 8. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  సత్యనారాయణ మూర్తి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,

  దినమున కొక క్రొత్త సమ
  స్యను పుట్టించుటె సమస్య యయ్యెను బియ్య
  మ్మున మెఱికల రీతిని వ
  చ్చిన వానిని గని యుపేక్ష సేయుఁడు కరుణన్.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘త్రిగుణ మందు’ను ‘త్రిగుణములను’ అందాం.
  *
  ఏల్చూరి మురళీధరరావు గారూ,
  అత్యభుతమూ, అత్యుత్తమమైన మీ పూరణ ఆనందాన్ని కలిగించింది. అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి