సత్య నారాయణ మూర్తి గారూ, చక్కని విరుపుతో సమర్థంగా పూరించారు. బాగుంది. అభినందనలు. ఇక మీ క్రమాలంకార శోభితమైన సీసం అద్భుతంగా ఉంది. ఇంత చక్కని పూరణ నిచ్చిన మీకు ధన్యవాదాలు. * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మీ రెండు పూరణలూ మనోజ్ఞంగా ఉన్నాయి. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, ప్రశస్తమైన పూరణ మీది. అభినందనలు. రెండవపాదాన్ని ఇలా మార్చితే ఇంకా బాగుంటుందేమో? ‘షేక్స్పియరు, కీట్సు, టెనిసను, సిడ్ని షెల్డ.....’ * ఊకదంపుడు గారూ, నిజమే దేవీ కటాక్షం లేకుంటే ఎవరూ కవులు కారు. మొదటి పూరణ బాగుంది. ఇక రెండవ పూరణ చమత్కారంగ ఉత్తమంగా ఉంది. అభినందనలు. * శ్రీపతి శాస్త్రి గారూ, ప్రశస్తమైన పూరణ. అభినందనలు. * సుబ్బారావు గారూ, చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. చివరి పాదాన్ని ‘కవి యనంగ నర్థము నీటికాకి యౌను’ అంటే ఎలా ఉంటుందంటారు? * లక్ష్మీదేవి గారూ, మీ రెండు పూరణలూ వైవిధ్యంగా చాలా బాగున్నవి. అభినందనలు.
చంద్రశేఖర్ గారూ, అక్కడ ద్రి,ద్రే వంటి ఉన్నప్పుడే కృ తో యతి దెల్లుతుంది. మూడవ పాదంలో ప్రావయతి తప్పింది. ప్రాస పూర్వాక్షరం గురు లఘువుల్లో ఏది ఉంటె మిగిలిన చోట్లా అదే ఉందాలి. ఐదవ పాదంలో గణదోషం * రాజేశ్వరి అక్కయ్యా, మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు. * లక్కరాజు వారూ, ధన్యవాదాలు.
కావ్యనిర్మాణ దక్షులు ఘనులువారు
రిప్లయితొలగించండికాళిదాసాదు, లెవ్వరు కవులు గారు
పద్యరచనకు పలుపాట్లు పడెడువార
లవని నాబోంట్లు మరి కవిబ్రువులు నిజము.
భావజుఁడు మెచ్చ సురుచిర వనము లందు
రిప్లయితొలగించండిచిత్ర కాంతులు విరజిమ్మి శీకరముల
సుమధుర మరంద మొలికెడు సూన లేమొ
కాళిదాసాదు లెవ్వరు కవులు గారు !
తెలుగు సంస్కృత భాషలు తెలియ లేక
రిప్లయితొలగించండిషేక్స్ఫి యరు బుక్సు మరియును షిడ్ని షెల్ట
ననుచు తిరిగెడు వారికి నన్నయ మరి
కాళిదాసాదు లెవ్వరు కవులు గారు.
రామ లింగడొకడును, విరామ మనక
రిప్లయితొలగించండినార్తి మూకాంబికను గొల్చినతడు నట్లె,
పలుకు తేనెల తల్లి కృప కలుగకను
కాళిదాసాదు లెవ్వరు కవులు గారు !
అన్వయం కుదిర్చాననే అనుకుంటున్నానండీ.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండి3వ పాదము గణదోషమును సవరించి
శారదామూర్తులై వెల్గు జ్ఞానులనగ
కాళిదాసాదు, లెవ్వరు కవులు గారు?
పండిత శ్రేష్ఠులు మనకు పరిమళించు
పద్య సుమముల గంధము పంచినారు.
పెక్కు కావ్యముల్ రచియించి పేరు గాంచె
రిప్లయితొలగించండికాళి దాసాదులె ,వ్వరు కవులు గాదు
అల్లి బిల్లిగ పద్యాల నల్ల గానె
కవియ నంగను నర్ధమ్ము కాకి యూ ను
Posted by subbarao at 9:14 PM 0 comments:
ఆమనియె రాగ నల కుసుమాస్త్ర ధరుడు
రిప్లయితొలగించండిపనుపు గానము సల్పిన పరభృతములు
కాళిదాసాదు లెవ్వరు ? కవులు గారు,
శారదాంబకు వీణియ సారె లనరె ?
దాసులెందరొ గలరమ్మ తల్లి - నీకు,
రిప్లయితొలగించండికాళి! దాసాదులెవ్వరు కవులు కారు,
కాళిదాసుండనెడు వాఁడు ఖ్యాతి పొందె,
భక్తి యనగ నదియె కద, భాగ్యమదియె.
గీర్వాణ భాషలో కీర్తినందినయట్టి
రిప్లయితొలగించండికవివరేణ్యులు కొంద రెవరటన్న?,
తలుపు చప్పుడు విన్న పలికెదరేరీతి
ఇంట నున్నట్టివా రెప్పుడైన?
కావ్యాలు రచియించి ఘనతకెక్కినవారి
నిలలోన నేమందు రింపుగాను?
గౌరవార్థం బంచు పేర్లకు చివరలో
చేర్చుమాటదియేది చెప్పుడనిన?
వరుస నీప్రశ్నలన్నింటి కరయనింక
సుందరంబైన ఉత్తరం బిందె గలదు,
కాంచు డదియెట్లొ మిత్రులు క్రమముగాను
కాళిదాసాదు, లెవ్వరు, కవులు, గారు.
(కాళిదాసాదులు, ఎవ్వరు?,కవులు, గారు.)
ద్వితీయ ప్రయత్నము:
రిప్లయితొలగించండిసత్కవీశుడు ఘనవిమర్శకుడు కరము
గౌరవముతోడ సంతుకు కవులపేర్ల
నిడి, తుదకుననె కలరు నాయింటినందు
కాళిదాసాదు, లెవ్వరు కవులు గారు.
నేడు భోజరాజులెవరు? నిక్కమిపుడు
రిప్లయితొలగించండికాళిదాసాదు లెవ్వరు? కవులు గారు
కారు, కావ్యరచన లేదు, కళల నాద
రించు ప్రభువులు లేరెవరిందు గనగ.
సత్య నారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిచక్కని విరుపుతో సమర్థంగా పూరించారు. బాగుంది. అభినందనలు.
ఇక మీ క్రమాలంకార శోభితమైన సీసం అద్భుతంగా ఉంది. ఇంత చక్కని పూరణ నిచ్చిన మీకు ధన్యవాదాలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ రెండు పూరణలూ మనోజ్ఞంగా ఉన్నాయి. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ప్రశస్తమైన పూరణ మీది. అభినందనలు.
రెండవపాదాన్ని ఇలా మార్చితే ఇంకా బాగుంటుందేమో?
‘షేక్స్పియరు, కీట్సు, టెనిసను, సిడ్ని షెల్డ.....’
*
ఊకదంపుడు గారూ,
నిజమే దేవీ కటాక్షం లేకుంటే ఎవరూ కవులు కారు. మొదటి పూరణ బాగుంది.
ఇక రెండవ పూరణ చమత్కారంగ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
చివరి పాదాన్ని ‘కవి యనంగ నర్థము నీటికాకి యౌను’ అంటే ఎలా ఉంటుందంటారు?
*
లక్ష్మీదేవి గారూ,
మీ రెండు పూరణలూ వైవిధ్యంగా చాలా బాగున్నవి. అభినందనలు.
అతులితకవితా వైభవంబమరి ,సహజ
రిప్లయితొలగించండికల్పనా శక్తి ,పాండితీ గరిమ కల్గు
కాళిదాసాదు;లెవ్వరు కవులు గారు
రసవిహీనమౌ కవితల వ్రాసినంత.
-----------------
రామ మూర్తినిఁదలచిన
రిప్లయితొలగించండిరామదాసు
వెన్నదొంగనువేడిన అన్నమయ్య
కీర్తనలువ్రాయ,దైవము కర్త గాక
కాళిదాసాదులెవ్వరు కవులుగారు
మాస్టారూ, మొదటి పాదంలో యతి క్రావడికి, వట్రుసుడికి వేశాను. సరియేనా?
రిప్లయితొలగించండిద్రౌపదీ సీతలన్ పాప కృత్తులనని
కాళిదాసాదు లెవ్వరు కవులు గారు
కవులన౦గ లక్ష్మీ ప్రసాదావుకులు
కవులనంగ రంగానాయకాదు లైరి
కవి శబ్దమున్ కరచెను కాలనాగు
కంది శంకర! కాపాడు కరుణతోడ!
వ్యాస వాల్మీకి యన్నను ద్యాస ఏల ?
రిప్లయితొలగించండికవులు పండితు లనగను కూడు కఱువు
చిత్ర రంగాన సాహితీ స్రష్ట లుండ
కాళి దాసాదు లెవ్వరు కవులు గారు !
గురువుగారు,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
మళ్ళీ వారం రోజులు సెలవు.
పోత నార్యుల గన్నట్టి పుణ్య భూమి
రిప్లయితొలగించండిపండి తోత్తమ నిలయమ్ము భారతమ్ము
కరుణ గాంచని యాదేవి వరము లేక
కాళి దాసాదు లెవ్వరు కవులు గారు !
రాజేశ్వరి నేదునూరి గారూ మీ పూరణ
రిప్లయితొలగించండి"పోత నార్యుల గన్నట్టి పుణ్య భూమి
పండి తోత్తమ నిలయమ్ము భారతమ్ము
బాగుంది.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ మీ పూరణ శంకరయ్యగారి సవరణ‘షేక్స్పియరు, కీట్సు, టెనిసను, సిడ్ని షెల్డ.....’
రిప్లయితొలగించండి"తెలుగు సంస్కృత భాషలు తెలియ లేక
షేక్స్ఫి యరు బుక్సు మరియును షిడ్ని షెల్ట"
బాగున్నాయి
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిఅక్కడ ద్రి,ద్రే వంటి ఉన్నప్పుడే కృ తో యతి దెల్లుతుంది.
మూడవ పాదంలో ప్రావయతి తప్పింది. ప్రాస పూర్వాక్షరం గురు లఘువుల్లో ఏది ఉంటె మిగిలిన చోట్లా అదే ఉందాలి.
ఐదవ పాదంలో గణదోషం
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
*
లక్కరాజు వారూ,
ధన్యవాదాలు.
శంకరార్యా ! సొగసైన సవరణ..ధన్యవాదములు.
రిప్లయితొలగించండిలక్కరాజు గారూ! బహుకాలదర్శనము...మీ పునరాగమనం మాకు ఆనందదాయకము..ధన్యవాదములు.ధన్యవాదములు.