రవీంద్రుని గీతాంజలి
తెనుఁగు సేత
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు
కీర్తిశేషులు శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు (1924 - 1967) తమ కళ్యాణరాఘవము, మధురవేదన, స్తోత్రాంజలి రచనల ద్వారా రసికలోకానికి సుపరిచితులు. తేనె లూరించే తమ తేటతెలుగు కవిత్వంతో సహృదయులైన పాఠక హృదయాల్ని చూరగొన్న కవి.
ఆచార్యులవారు స్వతస్సిద్ధంగా నిరాడంబరజీవి. ఉపనిషద్విజ్ఞానంతో పండిన వారి మేధస్సునకు వైష్ణవ సంప్రదాయసిద్ధమైన భక్తిమార్గం గురుదేవుని గీతాంజలివంటి తాత్త్వికమైన కావ్యాన్ని తెలుగు చేయడంలో వారికి అన్ని హంగులూ సమకూర్చింది. తత్ఫలితంగానే ఎంత సరళమో అంత మధురంగా ఈ కావ్యానువాదం సాగి ఈనాడు రసాస్వాదకులను రంజింపచేస్తున్నది.
ఈ ఉత్తమరచనను బ్లాగులో ప్రకటించి మీకు కావ్యానందాన్ని కలిగించే కార్యంలో నిమిత్తమాత్రుడినయ్యే సదవకాశం లభించడం నా భాగ్యంగా భావిస్తున్నాను.
మొత్తం 103 గీతాలను రేపటినుండి రోజుకొకగీతం చొప్పున ప్రకటించబోతున్నాను.
కవిమిత్రులారా,
గీతాంజలి ఆంగ్లానువాదాన్ని, దాని క్రింద ఆచార్యుల వారి ఆంధ్రానువాదాన్ని ప్రకటించమంటారా? లేక కేవలం తెలుగు అనువాదాన్ని మాత్రం ప్రకటిస్తే చాలంటారా? మీ సలహాలను ఆహ్వానిసున్నాను.
గురువుగారూ రెండు అనువాదాలనూ ప్రకటిస్తే మూలానికి వీరి అనువాదశైలి, దాని రమణీయత సుబోధకమవుతాయేమో.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ,
రిప్లయితొలగించండినా ఆలోచనకూడా అదే. ధన్యవాదాలు.
ఎలాగూ ఆంగ్ల పాఠం డౌన్‌లోడ్ చేసి ఉంచాను. కాపీ, పేస్ట్ చేయడమే. శ్రమపడనక్కరలేదు.
ఆర్యా!
రిప్లయితొలగించండిసంతోషం.
రెండింటినీ ప్రకటిస్తే మహదానందం.
ధన్యవాదాలు.
చక్కటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. రవీంద్రుని గీతాంజలిని పరిచయం చేస్తున్నందుకు కృతజ్ఞతలండి.
రిప్లయితొలగించండిSreegurubhyo namaha
రిప్లయితొలగించండిGuruvugaaruu caalaa santoshakaramaina vishayamu telinamdulaku dhanyavaadamulu. English & Telugu anuvaadamulu rendintinee prakaTimcavalasinagaa prarthana.
సత్యనారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిanrd (అనిరుద్ధ్?)
శ్రీపతి శాస్త్రి గారూ,
.......... ధన్యవాదాలు.