కవిమిత్రులారా...
ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...
తినుచో తియ్యని వేపగింజ మదిలో దీపించు సద్యోగముల్.
ఈ సమస్యను పంపిన
కవిమిత్రునకు
ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...
తినుచో తియ్యని వేపగింజ మదిలో దీపించు సద్యోగముల్.
ఈ సమస్యను పంపిన
కవిమిత్రునకు
ధన్యవాదాలు.
విను కష్టంబని తోచు తొల్దొలుత శ్రీవిద్యన్ సదా శ్రద్ధతో
రిప్లయితొలగించండినొనరింపన్ సదుపాసనమ్ము నదె సద్యోగప్రదంబౌను మా
తను సేవించిన వాసనల్ తొలగి స్వాంతం బెంతయున్ శుద్ధమౌ
తినుచో తియ్యని వేపగింజ మదిలో దీపించు సద్యోగముల్
అనుచో రాగము మాధురీభరితమై హాయిన్ ప్రసాదించెడున్,
రిప్లయితొలగించండివినుచో నిర్మలభావముంచి కథలన్ విందెందు నందించెడున్,
కనుచో సత్యము సంతసంబులు సదా కల్గించెడున్, నిత్యమున్
దినుచో తియ్యని వేపగింజ మదిలో దీపించు సద్యోగముల్.
మును నాకిచ్చెను వైద్యుడొక్క డొక కేప్స్యూలంచు నాకారమున్
రిప్లయితొలగించండిగనుచో నున్నది వేపగింజవలె రోగధ్వంసియే మ్రింగుమా
యన విశ్వాసముమీర మ్రింగితిని సౌఖ్యంబొందితిన్ కావునన్
తినుచో తియ్యని వేపగింజ మదిలో దీపించు సద్యోగముల్
కనుడీ వృక్షము లోకరక్షణమహాకార్యంబు చేబూనుచున్
రిప్లయితొలగించండిఘనతం బొందెను వేపనామకముతో గాఢంపు సత్సౌఖ్యముల్
మనకుం గూర్చుచు, రోగనాశనమగున్ మన్నించి యీపత్రముల్
తినుచో తియ్యని వేపగింజ మదిలో దీపించు సద్యోగముల్.
వినుమా సద్గురు బోధనల్ వినిన సద్వృత్తుల్ సదా గల్గు ద
రిప్లయితొలగించండిక్కునికన్ సద్గతి, ప్రాప్తమౌ సతము సద్గోష్ఠుల్, మహా పూరుషుల్,
ఘనులౌ పెద్దల సంగభాగ్యములహో! కష్టమ్ముగా నెంచుటే ?
తినుచో తియ్యని వేపగింజ మదిలో దీపించు సద్యోగముల్.
ఈనాటి సమస్యకు స్పందన చాలా తక్కువగా నున్నది. శ్రీ హరి వారు మరియు శ్రీమతి లక్ష్మీ దేవి గారే చక్కగా స్పందించేరు. వారి ఇద్దరికి శుభాభినందనలు. అయితే మిగిలిన వారు కూడా కొద్ది సేపటిలో వ్రాస్తారనుకొందాము. స్వస్తి.
రిప్లయితొలగించండిపెనురూపంబున మూత్రపిండమునఁ బర్వెన్ రాళ్ళు, బాధింప సా
రిప్లయితొలగించండిగెనుగా నిన్నటినుండి, దుర్భరము, యొక్కింతైన శాంతింపదే
లనొ సూదుల్ పొడిపించుకున్న, నిక కల్లల్ బల్కగా లేను, నేఁ
దినుచో తియ్యని వేపగింజ మదిలో దీపించు సద్యోగముల్.
మిత్రులారా,
నిన్న సాయంత్రం నుండి కిడ్నీలో రాళ్ళ వల్ల నొప్పి ప్రారంభమయింది. సాధారంగా నొప్పి వచ్చినప్పుడు ‘కేటరాల్’ ఇంజక్షన్ తీసుకుంటే తగ్గిపోయేది. అలాగే నిన్ని ఇంజక్షన్ తీసుకున్నాను. తగ్గలేదు. ఈరోజు తెల్లవారు జామున 3 గం.కు నొప్పి విపరీతమై పోయింది. అంతరాత్రి ఎక్కడికని వెళ్ళను? భరిస్తూ రాత్రి గడిపాను. తీరా ఉదయం ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే ఈ రోజు ఆదివారం. ఎవ్వరూ అందుబాటులో లేరు. ఉదయం మళ్ళీ ఇంజక్షన్ తీసుకున్నాను. తగ్గలేదు. మళ్ళీ ఈ సాయంత్రం ఓ డాక్టర్‌ని దొరికించుకొని ఆయన ఇచ్చిన ఇంజక్షన్ తీసుకున్నాను. అయినా నొప్పి అంతకంతకు ఎక్కువౌతున్నదే కాని తగ్గడం లేదు. ఏం చేయాలో తోచడం లేదు.
గురువు గారు,
రిప్లయితొలగించండిఆరోగ్యం జాగ్రత్త.
భగవంతుడు సంపూర్ణారోగ్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటున్నాము.
గురుతుల్యులు శ్రీ శంకరయ్య గారికి,
రిప్లయితొలగించండిఆర్యా!
నమస్కారములు,
"శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం".
ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకొనగలరు. మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించవలసినదిగా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను.
వినగన్ జ్ఞానవివేక సంభరితమౌ విద్వద్విచారమ్ములున్
రిప్లయితొలగించండిఘనమౌ ఔషధసేవ లతి తిక్తంబై యసహ్యమ్ములౌ
మును జూడన్ రుచియింపవైనను హితమ్మున్ గూర్చు నా పిమ్మటన్
తినుచో తియ్యని వేపగింజ మదిలో దీపించు సద్యోగముల్.
అయ్యా శంకరయ్యగారూ,ఈ సమస్యాపూరణల కేమి గాని ,ఒక డాక్టర్ గా చెబుతున్నాను.మీరు కిడ్నీ లో రాళ్ళ గురించి ఇంతకు ముందు చేయకపోతే వెంటనే యూరోసర్జన్ ని urogenital surgeon కన్సల్ట్ చేయండి.ఇంతకు ముందు తీసి ఉండక పోతే ultrasound of abdomen పరీక్ష చేయించుకొండి.ఒకవేళ ఆపరేషన్ surgery అవసరం ఉంటే ఉండవచ్చును
శంకరార్యా! ఆరోగ్యము జాగ్రత్తగా చూచుకొనండి.త్వరగా స్వస్థత చేకూరాలని ఆకాంక్ష.
రిప్లయితొలగించండివినుమా చూడగ నోట బెట్టి నమలన్ వేపాకు చేదౌనుగా
తినగా మారును మారు మారు నదియే తీపెక్కు నట్లే భువిన్
మనుజుండెప్పుడు కష్టమైన పనులన్ మార్మారు చేపట్టగా
'తినుచో తియ్యని వేపగింజ' మదిలో దీపించు సద్యోగముల్.
గురువు గారు శ్రీ శంకరయ్య గారికి
రిప్లయితొలగించండినమస్సులు.
మీ ఆరోగ్యం గురించి చదివిన తరువాత చాలా బాధ పడ్డాను. కమనీయం గారు చెప్పినట్లు ఆల్ట్రా సౌండ్ మరియు శస్త్ర చికిత్స జరగవలసిన అవసరం ఉండవచ్చు. హోమియోపతి లో శస్త్ర చికిత్స లేకుండానే మందులు ఉన్నాయని విన్నాను. ఇంతకు ముందు మీరు హోమియో ప్రయత్నించారో లేదో తెలియదు. భగవంతుడు మీకు ఆయురారోగ్యములను ప్రసాదించవలసిందిగా వేడుకుంటున్నాను.
బ్రతుకునందు ఈతి బాధలు లేనట్టి
మనిషి లేడు నేటి జగతినందు
బాధ తట్టుకొనుచు,బాధ్యత పాటించు
ధన్య జీవి! మిమ్ము ధరణి మెచ్చు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితనువున్ మానస హృత్తులందుననుపల్ దండమ్ములన్ బెట్టుచున్
రిప్లయితొలగించండిచనుచున్ మంత్రుల పాద పూజలనువే చందమ్ములన్ జేయుచున్
వినుమా భారత రాజకీయమున కన్ విందైన లంచమ్మునున్
తినుచో తియ్యని వేపగింజ మదిలో దీపించు సద్యోగముల్