5, మే 2012, శనివారం

రవీంద్రుని గీతాంజలి - 3

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు


3

I KNOW not how thou singest, my master !
I ever listen in silent amazement.

The light of thy music illumines the world.
The life breath of thy music
runs from sky to sky. The holy stream
of thy music breaks through all stony
obstacles and rushes on.

My heart longs to join in thy song,
but vainly struggles for a voice. I
would speak, but speech breaks not into
song, and I cry out baffled. Ah, thou
hast made my heart captive in the end-
less meshes of thy music, my master ! 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము...

ఈ వెటుల్ పాడెదో? ప్రభూ! యెఱుక పడదు,
మౌనముగ నచ్చెరువుమెయి నేను దాని
నాలకించుచునుంటి నిరంతరమ్ము ||

నీదు గానకళాద్యుతి నిఖిలజగతి
యణువణువు క్రమ్మి తళతళలాడఁ జేసె
స్వరసమీరప్రసార మంబరము నిండె
బండలన్ జీల్చి ముందుకుఁ బర్వు లిడుచు
పొంగి స్వరగంగ ప్రవహిలి పోవుచుండె ||

కోరు నెద నీదు పాటకు గొంతు గల్ప
వట్టి శ్రమ మిది, కాని తత్త్స్వరము నాదు
గళములోనుండి విప్పారి వెలికి రాదు ||

పలుకఁ దలఁచెదఁ గాని యప్పలుకు నుండి
పాట పెకలక పలవింతు నోటు పడుచు ||

నలువలంకుల గానఁపు వలలు పన్ని
ప్రభువ! నా డెందముం బంది బట్టి తహహ! ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి