26, మే 2012, శనివారం

సమస్యాపూరణం - 716 (కైక విభుడు రాఘవుండు)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

కైక విభుడు రాఘవుండు కాపాడు మిమున్.


ఈ సమస్యను పంపిన
కవిమిత్రునకు
ధన్యవాదాలు.

20 కామెంట్‌లు:

  1. శ్రీకరుడున్, సద్గుణముల
    కాకరుడౌ రామచంద్రు డఖిలాఘములన్
    పోకార్చెడి ఘను డా లో
    కైకవిభుడు రాఘవుండు కాపాడు మిమున్.

    రిప్లయితొలగించండి
  2. భరతుడు ప్రజలతో....

    శోకపు కారణము జనని
    కైక; విభుడు రాఘవుండు కాపాడు మిమున్
    శోకము మానుమనె నతడు
    లోకుల నూరడిల జేయు లోలత్వమునన్.

    రిప్లయితొలగించండి
  3. కైక విభుడు రాఘవుండు కాపాడు మిమున్. ఇందులో సమస్య యేమియును లేదు. రాఘవుడు అనుట శ్రీరామునికే రూఢినామము అయినా రఘువంశములో ఎవరినైన రాఘవుడు అనవచ్చును. ఆ విధముగా దశరథునికే రాఘవ శబ్దమును అన్వయించుకొని నేను చేసిన పూరణ ఇది. సమస్యా పూరణము కాబట్టి అన్వయములో ఆపాటి వెసులుబాటు ఏలాగూ ఉన్నదే.

    కాకుత్స్థ వంశ తిలకుడు
    రాకేందు యశోన్వితుండు రాజేంద్రుండున్
    లోకహితుడు పంక్తిరథుడు
    కైకవిభుడు రాఘవుండు కాపాడు మిమున్

    రిప్లయితొలగించండి
  4. మరియొక విధమైన పూరణ:

    నాకాధిప వంద్యుడు సీ
    తాకాంతా వల్లభుండు ధర్మరతుడు సు
    శ్లోకుడు జిత రాక్షస లో
    కైకవిభుడు రాఘువుండు కాపాడు మిమున్

    రిప్లయితొలగించండి
  5. భీ కర హృదయుడు నయ్యెను
    కైక విభుడు , రాఘవుండు కాపాడు మిమున్
    శ్రీ కరుడు లోక హితుడును
    వాగమృత ధార యుతుడు బహుముఖ ప్రజ్ఞౌ .

    రిప్లయితొలగించండి
  6. అయ్యా శ్రీ సుబ్బారావు గారూ! శుభాశీస్సులు.

    మీ పద్యము 4వ పాదములో గణములు సరిపోవుట లేదు. వాగమృత అనునపుడు గ గురువు అగునని మీరు భావించినట్లున్నారు. అమృతలో వట్రువసుడి అచ్చునకే సంకేతము - హల్లునకు కాదు. అందుచేత దాని ముందున్న అక్షరము గురువు కాలేదు. సరిజేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. సత్యనారాయణ మూర్తి గారూ,
    మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    చక్కని విరుపుతో వైవిధ్యంగా అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ అభిప్రాయం యుక్తి యుక్తంగా ఉంది. రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాకుంటే అన్వయం ఇబ్బంది పెట్టింది. మీ పద్యం చివరి పాదాన్ని ఇలా సవరించవచ్చని నా సూచన...
    ‘వాగమృత సుధార యుతుడు బహుముఖ విదుడున్’

    రిప్లయితొలగించండి
  8. ఈ కీకారణ్యములో
    భీకర రక్కసుల జంపు విను యజ్ఞముకై
    చీకాకులు రావిక లో
    కైక విభుడు రాఘవుండు కాపాడు మిమున్.

    రిప్లయితొలగించండి
  9. అయ్యా! శ్రీ గోలి వారూ!
    మీ పద్యములో భీకర రక్కసులు అనే దుష్ట సమాసము వేసేరు. భీకర రాక్షసులు అని మార్చండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. శ్రీకరుడు భవహరుండా
    శ్రీకార సాకార మూర్తి సీతాపతియే
    ప్రాకట దైవము, ఘనుడే
    కైక విభుఁడు, రాఘవుండు కాపాడు మిమున్

    రిప్లయితొలగించండి
  11. అయ్యా! (the other)

    మీ పద్యము 2వ పాదములో ఒక లఘువు ఎక్కువ ఉన్నది. పాదమును పరిశీలించి సరిజేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. దోషమును తెలిపి తగిన సవరణను చూపిన శ్రీ నేమాని వారికి ధన్యవాదములు.

    ఈ కీకారణ్యములో
    భీకర రాక్షసుల జంపు విను యజ్ఞముకై
    చీకాకులు రావిక లో
    కైక విభుడు రాఘవుండు కాపాడు మిమున్.

    రిప్లయితొలగించండి
  13. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘యజ్ఞముకై’ అనరాదు - ‘యజ్ఞమునకై’ అనాలి. అక్కడ ‘యజ్ఞమునన్’ అని సవరిస్తే సరి!
    *
    `The Other' గారూ,
    స్వాగతం!
    మీ ప్రయత్నం ప్రశంసార్హం. కొన్ని లోపాలు... ఇలా సవరిద్దాం...
    ‘లోకైక పావనుండా
    శ్రీకర సాకార మూర్తి సీతాపతియే
    ప్రాకట దైవము, ఘనుడే
    కైక విభుడు? రాఘవుండు కాపాడు మిమున్.

    రిప్లయితొలగించండి
  14. ఏక సతీ వ్రత పరుడున్,
    ప్రాకటముగ సర్వభోగ భాగ్యమ్ములచే
    శ్రీకరుడు ,దయాత్ముడు,లో
    కైకవిభుడు ,రాఘవుండు కాపాడు మిమున్.

    రిప్లయితొలగించండి
  15. ఈ సమస్యా పూరణతో సంబంధం లేకపోయినా ,నేను రచించిన ఒక విశేష వృత్తాన్ని ఇక్కడ వ్రాస్తున్నాను.
    మత్తకోకిల-
    -------------
    నీలమేఘ,తటిల్లతా రజనీ ప్రభా సుమనోజ్ఞముల్,
    వాలుచూపుల విభ్రవమ్ము యువాళి మోహన మంత్రముల్,
    హాలికాళి ప్రమోదకార సుధాంబు నీరద మాలికల్,
    బాలకాముఖ చంద్రహాస విభాసముల్ జడికారులున్ .

    రిప్లయితొలగించండి
  16. రాముని అరణ్యవాసమునకు పంపేసమయంలో అయోధ్య ప్రజలనూరడించుచూ రాజగురువుల పలుకులు: (క్రమాలంకారము)
    సాకేతరాము నీవసు
    ధైకప్రభువటంచుదెలియఁదరులన్బంపెన్,
    శోకంబదేలశీఘ్రమె
    కైకవిభుడు,రాఘవుండుకాపాడుమిమున్!

    రిప్లయితొలగించండి
  17. లోకమ్ముల లోకేశుల
    లోకస్థుల కధిపతి యగు లోకజ్ఞుండా
    శ్రీకరుడీ జగతికి నే
    కైక విభుడు రాఘవుండు కాపాడు మిమున్

    రిప్లయితొలగించండి
  18. శోకము దీర్చెడి జానకి,
    ప్రాకటముగ లక్ష్మణుండు, భరతుడు, మరియున్
    తోకను పెంచెడి పావని,
    కైక విభుడు, రాఘవుండు, కాపాడు మిమున్ :)

    రిప్లయితొలగించండి