మిస్సన్న గారు, మీ బండి లేట్ అన్నారు. కానీ పూరణలు, దండకము బాగున్నాయి. అదే కదా ముఖ్యము. కన్నడ లో ఇలాగే సమస్యాపూరణ బ్లాగ్ నడుపుతున్న చంద్రమౌళి గారి బ్లాగ్ ఇప్పుడే చూశాను. సమస్యలూ, ఛందోరీతులూ భిన్నంగా ఉన్నాయి. తెలుగు, కన్నడ రెండింటిలోనూ రచింపగలుగుతున్నారు. చంద్రమౌళి గారికి అభినందనలు.
లక్ష్మీదేవిగారికి నా ధన్యవాదం. మీరన్నవి నిజమేగాని నేను ఏ బ్లాగునూ నడపడంలేదు.వీలైనప్పుడు ఇలా స్పందించే అల్పజ్ఞాతాప్రదర్శనం అంతే ! శంకరాభరణం బ్లాగును తప్పక చూస్తుంటాను. తెలుగుదేశానికి దూరంగా ఉన్న కన్నడిగులకు తెలుగుభాషాసౌరభం ఇలా లభ్యంకావడం శ్రీశంకరయ్యగారి కృప.
అమ్మా! శ్రీమతి రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు. మీ పద్యము 2వ పాదములో యతి తప్పినది. ఇలా మార్చండి: "హరి యిడె తన రూపు పెండ్లియాడ దలంపన్" 3వ పాదములో అక్షరములు ఎక్కువగా నున్నవి. సరిజేయండి.
అయ్యా శ్రీ ఛంద్రమౌళి గారు! శుభాశీస్సులు. కన్నడములో యతి నియమము లేకున్నా, తెలుగులో తప్పదు కదా మరి. మీరు యతిని ఈ మారుకూడా గమనించ లేదు. 2వ పాదములో రావణునికి బదులుగా దశకంఠు అని మార్చండి. స్వస్తి.
పండిత నేమాని వారూ, చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు. * సుబ్బారావు గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. * గుండు మధుసూదన్ గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * సహదేవుడు గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. మొదటి పాదంలో గణదోషం. బహుశా టైపాటేమో! ‘జనించెన్’ అన్నదానిని ‘జన్మించెన్’ అంటే సరి! * సత్యనారాయణ మూర్తి గారూ, మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు. * చంద్రమౌళి గారూ, ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. సంతోషం! చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. మీ సవరించిన పద్యంలో రెండవ పాదంలో గణం, యతి రెండూ తప్పాయి. మొదటిపద్యమే బాగుంది. * లక్ష్మీదేవి గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. కన్నడంలో ‘సమస్యాపూరణ బ్లాగు’ చూసానన్నారు. దాని వెబ్ చిరునామా దయచేసి తెలియజేయండి. * చంద్రశేఖర్ గారూ, మీ సందేహం సహేతుకమే. ‘లంకానాశనము’ అనే అనాలి. ఇక్కడ లంకను తెలుగుపదంగానే స్వీకరిద్దాం. ‘లంక నాశమగుటకున్’ అంటే బాగుండేది. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు. ‘దైవాంశన’ అన్నదాన్ని ‘దైవాంశన్’ అంటే బాగుంటుందేమో! * రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సురల మునివరుల యంశలె
రిప్లయితొలగించండిధరణి ప్రభవమొందె గొలువ దశరథరామున్
హరిసేవకులగు నా వా
నరులే కారణము లంక నాశనమునకున్
అరయగ వానర సేనలు
రిప్లయితొలగించండిఅరమరికలు లేనివారు నాప్తులు రమకున్
సురలకు పుట్టిన యీ వా
నరులే కారణము లంక నాశనము నకున్.
గుండు మధుసూదన్ గారి పూరణ.....
రిప్లయితొలగించండివరకామి రావణుఁడు వా
నరముఖు నందీశు హేళనముఁ జేయ నతం
డురుశాప మిడెఁ గనుక వా
నరులే కారణము లంక నాశనమునకున్.
హరి నరుడై జనించెన్
రిప్లయితొలగించండిధర లంకేశుని వధించ దశరధ సుతుడై
యరయన్ వానర సేవిత
నరులే కారణము లంక నాశనమునకున్
నిరతము రామస్మరణము
రిప్లయితొలగించండిజరుపుచు తన్మయతనంది సమరమునందున్
స్థిరులై నిలిచిన యా వా
నరులే కారణము లంక నాశనమునకున్. 1.
స్థిరవిక్రములున్ భ్రాతలు
ధరణీపతి పంక్తిరథుని తనయులు వారల్
వరగుణులున్ రాఘవు లా
నరులే కారణము లంక నాశనమునకున్. 2.
సుర యక్ష గరుడ విద్యా
రిప్లయితొలగించండిధర నాగుల వలనఁ జావుఁ దప్పించెడి స
ద్వర మందె రావణుఁడు, వా
నరులే కారణము లంక నాశనమునకున్.
పరిమితిమీరిన కామము
రిప్లయితొలగించండిమరచిన దర్మంబహంకృతులరావణుచే
విరిగినదిగాన నరవా
నరులే? కారణము లంక నాశనమునకున్
మిస్సన్న గారు,
రిప్లయితొలగించండిమీ బండి లేట్ అన్నారు. కానీ పూరణలు, దండకము బాగున్నాయి. అదే కదా ముఖ్యము.
కన్నడ లో ఇలాగే సమస్యాపూరణ బ్లాగ్ నడుపుతున్న చంద్రమౌళి గారి బ్లాగ్ ఇప్పుడే చూశాను.
సమస్యలూ, ఛందోరీతులూ భిన్నంగా ఉన్నాయి.
తెలుగు, కన్నడ రెండింటిలోనూ రచింపగలుగుతున్నారు.
చంద్రమౌళి గారికి అభినందనలు.
నరులను వానర మూకల
సరిరారని పరిగణింప సరికాదికపై,
ధరణీసుతఁ గాచిన మా
నరులే కారణము లంక నాశనమునకున్.
లక్ష్మీదేవిగారికి నా ధన్యవాదం. మీరన్నవి నిజమేగాని నేను ఏ బ్లాగునూ నడపడంలేదు.వీలైనప్పుడు ఇలా స్పందించే అల్పజ్ఞాతాప్రదర్శనం అంతే ! శంకరాభరణం బ్లాగును తప్పక చూస్తుంటాను. తెలుగుదేశానికి దూరంగా ఉన్న కన్నడిగులకు తెలుగుభాషాసౌరభం ఇలా లభ్యంకావడం శ్రీశంకరయ్యగారి కృప.
రిప్లయితొలగించండిఅయ్యా! శ్రీ చంద్రమౌళి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము 2వ పాదములో యతి సరిపోవుట లేదు. సరిజేయండి. మీ ప్రయత్నము, భావము అభినందనీయములు. స్వస్తి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈరోజు సమస్య ఇప్పుడే చూడటం జరిగింది. విద్యాకుతూహలంతో అడిగే ప్రశ్న - "లంకా నాశనమునకున్" క కు దీర్ఘం ఉండాలేమో?
రిప్లయితొలగించండిగురువుగారికి మరియు కవిమిత్రులకు నమస్కారములు.
రిప్లయితొలగించండిహరియే మానుష రూపూము
ధరియించెను, సురగణములు దైవాంశన వా
నరులై జన్మించిరి కద,
నరులే కారణము లంక నాశనమునకున్.
వర మడిగె దేవముని యన
రిప్లయితొలగించండిహరి యిచ్చెను తనదు రూపు పరిణయ మాడన్ !
వెఱగొంది శాప మిడెముని వా
నరులే కారణము లంక నాశన మునకున్ !
పరిమితిమీరిన కామాం
రిప్లయితొలగించండిధ రజం ధర్మాక్షీమూయ రావణునియహం
విరిచునుగా, నరులే? వా
నరులే? కారణము లంక నాశనమునకున్
యతివిలంఘనదిందరిదల్తెకన్నడం అనియున్నా తెలుగులో యతినమస్కారం తప్పదుగా. సూచనలకు ధన్యవాదములు.
అమ్మా! శ్రీమతి రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము 2వ పాదములో యతి తప్పినది. ఇలా మార్చండి:
"హరి యిడె తన రూపు పెండ్లియాడ దలంపన్"
3వ పాదములో అక్షరములు ఎక్కువగా నున్నవి. సరిజేయండి.
అయ్యా శ్రీ ఛంద్రమౌళి గారు! శుభాశీస్సులు.
కన్నడములో యతి నియమము లేకున్నా, తెలుగులో తప్పదు కదా మరి. మీరు యతిని ఈ మారుకూడా గమనించ లేదు. 2వ పాదములో రావణునికి బదులుగా దశకంఠు అని మార్చండి. స్వస్తి.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిచాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. బహుశా టైపాటేమో! ‘జనించెన్’ అన్నదానిని ‘జన్మించెన్’ అంటే సరి!
*
సత్యనారాయణ మూర్తి గారూ,
మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
*
చంద్రమౌళి గారూ,
‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. సంతోషం!
చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
మీ సవరించిన పద్యంలో రెండవ పాదంలో గణం, యతి రెండూ తప్పాయి. మొదటిపద్యమే బాగుంది.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
కన్నడంలో ‘సమస్యాపూరణ బ్లాగు’ చూసానన్నారు. దాని వెబ్ చిరునామా దయచేసి తెలియజేయండి.
*
చంద్రశేఖర్ గారూ,
మీ సందేహం సహేతుకమే. ‘లంకానాశనము’ అనే అనాలి. ఇక్కడ లంకను తెలుగుపదంగానే స్వీకరిద్దాం. ‘లంక నాశమగుటకున్’ అంటే బాగుండేది.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
‘దైవాంశన’ అన్నదాన్ని ‘దైవాంశన్’ అంటే బాగుంటుందేమో!
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నరుడై పుట్టెను హరి వా
రిప్లయితొలగించండినరులుగ పుట్టెన్ సురలును నానా విధమౌ
హరి హర శక్తుల నరవా
నరులే కారణము లంక నాశన మునకున్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
లక్ష్మీ దేవి గారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమీరు మాత్రం పద్య రచనా కౌశలాన్ని ఒడిసి పట్టుకొన్నారు.
అభినందనలు.
"నరు"లను "వానరు"లనుచున్
రిప్లయితొలగించండిగిరులను లంఘించి కవులు గింగురుమనుచున్
విరివిగ పూరణ లొసగిన
నరులే కారణము "లంక నాశనమునకున్"
ముప్పాళమ్మ:
రిప్లయితొలగించండిఇరువురు జానకిని వదిలి
పరుగిడి పోయిరిగ వారి పాపము పండన్...
అరయగ దాశరథుండ్లగు
నరులే కారణము లంక నాశనమునకున్