8, మే 2012, మంగళవారం

గర్భ కవిత్వములో మెలకువలు - 3

          2వ భాగములో చంపకమాల పద్యములో మధ్యాక్కర, తేటగీతి, ద్రుతవిలంబితము మరియు కంద పద్యములను వ్రాయవచ్చునని చెప్పుకొనినాము.  అదే విధముగా ఉత్పలమాలలో కూడా ఈ 4విధములైన పద్యములను వ్రాయవచ్చును.

          తేటగీతి, ఆటవెలది మరియు కందములను ఒక దానిలో నొకటి వ్రాయవచ్చును.  దీనికి ప్రత్యేకముగా ఏ మెలకువయూ నక్కరలేదు.  భావమును అనుకొనిన తరువాత ఏ పద్యములో ఏ పద్యమును వ్రాద్దా మనుకొనినా ఆ 2 పద్యములను వేరు వేరుగా అక్షరము అక్షరము చూచుకొనుచూ 2 పద్యములను ఒకే మారు వ్రాస్తే చాలును.  2 పద్యములకు సరిపోయేటట్లుగా సమానమైన పదముల కూర్పు ఉండాలి.  

మత్తేభ గర్భిత సీసము:

ముందుగా ఒక మత్తేభ పాదమును వ్రాయండి.  

ఉదా: మ: నుత చారిత్రు పవిత్ర భావయుతు నిన్నున్ గొల్తు నారాయణున్

ఆ పాదమునకు ముందుగా ఒక లఘువును చేర్చాలి;  అలాగే చివరలో కొన్ని అక్షరములు చేర్చాలి.  చూడండి:
 
సీ. వినుత చారిత్రు పవిత్ర భావ యుతుని
          న్నున్ గొల్తు నారాయణున్ సతతము 

మరి కొన్ని విశేషములను 4వ భాగములో తెలుసుకొందాము.

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

5 కామెంట్‌లు:

  1. గురుతుల్యులు శ్రీ నేమాని వారికి,
    ఆర్యా!
    నమస్కారములు.
    గర్భకవిత్వంలో మెలకువల గురించి చక్కగా తెలియజేస్తున్నారు.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  2. మారెళ్ళ వామన కుమార్మంగళవారం, మే 08, 2012 4:40:00 PM

    గురువు గారికి నమస్సుమాంజలులు.
    గర్భ కవిత్వం గురించి మీరు వ్రాస్తున్న విషయాలు చాలా వివరణాత్మకంగా ఉన్నాయి. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  3. నమస్కారములు.
    గర్భ కవిత్వమును గురించి ఆశక్తి దాయకముగా తెలుపు తున్నందులకు గురువులకు ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి
  4. శ్రీపతిశాస్త్రిబుధవారం, మే 09, 2012 12:45:00 AM

    గురువుగారికి నమస్సులు

    గర్భ కవిత్వం గురించి మీరు వ్రాస్తున్న విషయాలు చక్కగా ఉన్నాయి. ధన్యవాదములు
    మత్తేభ గర్భిత సీసము నకు ఉదాహరణగా వ్రాసిన పాదములో చిన్న సందేహము.
    సీస పద్యపాదమున మత్తేభ వృత్త పాదము (అంతర్గతముగా) ఇమిడి ఉన్నది.
    నా సందేహము ఏమనగా ఇది మత్తేభ గర్భిత సీసమా,లేక సీస గర్భిత మత్తేభమా? దయచేసి తెలుప ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  5. సత్యనారాయణ మూర్తి గారూ,
    వామన కుమార్ గారూ,
    రాజేశ్వరి అక్కయ్యా,
    శ్రీపతి శాస్త్రి గారూ,
    ......... ధన్యవాదాలు.
    అది మత్తేభగర్భిత సీసమే.

    రిప్లయితొలగించండి