14, మే 2012, సోమవారం

ప్రత్యేక వృత్తాలు - 2

ద్రుతవిలంబితము  
ఇది 12వ ఛందమైన ‘జగతి’లో 1464వ వృత్తము.
గణములు:  న భ భ ర
యతి  :  7వ అక్షరము
ప్రాస నియమము కలదు

ఉదా:
జయము రాఘవ! సద్గుణ వైభవా!
జయము విశ్రుత సత్య పరాక్రమా!
జయము రాక్షస సంఘ వినాశకా!
జయము సద్ఘన! సాధు జనావనా!

గమనిక -
ఈ పద్యములోని ప్రతిపాదము చివర ఒక లఘువును చేర్చితే తేటగీతి అవుతుంది.  యతి మాత్రము తేటగీతికి సరిపోయేటట్లు వేసుకొనవలెను.  (అంటే 2 చోట్ల యతి ఉండాలి) అప్పుడు ద్రుతవిలంబిత గర్భిత తేటగీతి అవుతుంది.  స్వస్తి!
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

9 కామెంట్‌లు:

 1. మాలిని

  మహిని నడచి శ్రీరామాఖ్యుగా నిల్చి యెంతో
  సహన గుణము సీతా సాహచర్యంబు తోనే
  విహితముగను రామా, వేడి నేర్చేవు దేవా!
  మహిమ పొగడ రాదే ,మాదు తప్పెంచనేలా?

  ద్రుతవిలంబితము

  దయను జూపవె దక్షిణ నాయకా!
  భయము మాపవె పాపవినాశకా!
  నయము జేయవె నమ్మితి నిన్ను నే
  జయము నీయవె శక్తి ప్రదాయకా!

  రిప్లయితొలగించండి
 2. అమ్మా లక్ష్మీ దేవి గారూ!
  శుభాశీస్సులు. మీ ప్రయత్నము చాల బాగున్నది. అభినందనలు. ఇలా అభ్యాసము చేస్తూ ఉండండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 3. రవికులోత్తమ! రామ! దయానిధీ!
  భవభయాపహ! భాగ్యవిధాయకా!
  భువనమోహన! మోహవినాశకా!
  శివసఖా! హరి! చేసెద నీ నుతుల్.

  రిప్లయితొలగించండి
 4. లక్ష్మీదేవి గారూ,
  మీ ప్రయత్నం ప్రశంసనీయం. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. అయ్యా! అభినందనలు. చాలా కాలము తరువాత మీ బాణీ విన్నాము. ఇప్పుడు కాస్త స్వాస్థ్యము లభించి, సమయము దొరుకుచున్నది కాబోలు. మంచి పద్యము వ్రాసేరు. సంతోషము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 6. కరుణ జూపుము కావుము వైష్ణవీ!
  ధరను ద్రుంచుము దైన్యము శాంకరీ!
  పరమ సౌఖ్యము భాగ్యము లిచ్చటన్
  నిరత మిమ్మిక నీసుతు లందరున్.

  రిప్లయితొలగించండి
 7. తిరుమలేశుడు దీన జనాప్తుడీ
  ధరణి నేలుచు తానిడు సర్వమా
  మురహరున్ గని మ్రొక్కుచు గొల్తుమా
  తరతరంబులు ధన్యత నొందగన్

  రిప్లయితొలగించండి
 8. శివుని నమ్మిన చింతలు దీరునే
  భవుని గొల్చిన బాధలు పోవునే
  యవసరార్థము నాపద మ్రొక్కులన్
  చెవుల వేయకు శీఘ్రము మానవా !!

  రిప్లయితొలగించండి