3, మే 2012, గురువారం

శ్రీ శ్యామల రావు గారికి షష్ఠిపూర్తి శుభాశీస్సులు


శ్రీ శ్యామల రావు గారికి
నేడు షష్ఠిపూర్తి మహోత్సవము జరుగుతున్న సందర్భమున 
శుభాశీస్సులు

శ్రీరస్తు విశుద్ధ యశ
శ్శ్రీరస్తు చిరాయురస్తు శ్రీకంఠకృపా
సారశ్రీకలిత విశే
షారోగ్య ప్రాప్తిరస్తు శ్యామలరాయా!


ఆదిత్యాది గ్రహమ్ములన్నియును శ్రీరస్తంచు యోగోన్నతుల్
మోదంబొప్పగ గూర్చుగాక! కరుణాంభోరాశు లార్యాశివుల్
వేదస్తుత్యులు సర్వమంగళములన్ వేడ్కన్ ప్రసాదింప నా
హ్లాదంబొప్ప చిరాయురున్నతులతో రాజిల్లుమా మిత్రమా!


అతుల పుణ్యదంపతులయి యలరినట్టి
రంగమణికిని సత్యనారాయణునకు
పుత్రరత్నమవును  కులాంభోధి పూర్ణ
చంద్రుడవగు నీకు శుభాశిషములు గూర్తు


శారద చారుశీల విలసద్గుణ లక్షణరాశి రమ్య సం
సారమునందు పత్నిగ సమస్త సుఖమ్ములు గూర్చుచుండ వి
ద్యారతులైన బిడ్డలు నిరంతరమున్ ప్రమదమ్ము నింపగా
సూరి వరేణ్య!  పృథ్వి బహుశోభలు గాంచుము శ్యామలాహ్వయా!


అరువది వత్సరమ్ములు సమస్త శుభప్రద జీవితాన సం
బరమున సాగె నేర్చితివి బాగుగ విద్యలు యోగరాశులున్
కరము ముదాన పొందితివి ఖ్యాతి గడించితి వీశుసత్కృపన్
బరగుము దీర్ఘకాలమిల వంశవిభూషణమై శుభాశయా!


నేమాని రామజోగి సన్యాసి రావు
విశాఖపట్టణము

19 కామెంట్‌లు:

 1. శ్రీ శ్యామల రావు గారికి షష్టి పూర్తి శుభాకాంక్షలు. మీకు భగవంతుడు ఆయురారోగ్యములు సకల శుభములు సమకూర్చ వలెనని మా ప్రార్ధనలు.
  అన్నయ్యగారు శ్రీ పండిత నేమాని రామజోగిసన్యాసి రావు గారి ఆశీష పద్యా లద్భుతము.

  రిప్లయితొలగించండి
 2. శ్రీ శ్యామల రావు గారికి షష్టి పూర్తి శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 3. శ్రీ శ్యామలరావుగారికి
  షష్ఠిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలు.

  శ్రీమత్పరమేశ్వరుడీ
  శ్యామలరాయార్యవర్యుఁ జక్కగ బ్రోచున్
  కామిత సుఖముల నిచ్చుచు
  భూమిన్ సద్యశములొసగి పూర్ణాయువుతోన్.

  రిప్లయితొలగించండి
 4. శ్రీ శ్యామలరావుగారికి
  షష్ఠిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలు.

  శ్రీ శ్యామలరావ్ గారిని
  ఆ శ్యామల వర్ణ తేజ హరి శ్రీ లక్ష్మీ
  వశ్యుడు తోడుగ నిలచి య
  వశ్యము సుఖ శాంతులిచ్చి భావిని గాచున్.

  రిప్లయితొలగించండి
 5. శ్యామలరాయా శుభమును
  క్షేమంబగు గాత మీకు చిర కాలమ్మున్

  రిప్లయితొలగించండి
 6. శ్యామల రావు గారికి ష ష్టి పూ ర్తి శుభాకాం క్షలు

  రిప్లయితొలగించండి
 7. వారికి నా శుభాకాంక్షలు కూడా తెలుపండి

  రిప్లయితొలగించండి
 8. మిస్సన్న గారూ,
  ధన్యవాదాలు. మీరు వ్రాసిన ఉత్తరార్ధానికి పూర్వార్ధాన్ని జోడిస్తున్నాను.....

  శ్రీమద్వేంకటపతి కరు
  ణామృత సంసిద్ధి గలుగ నాకాంక్షింతున్
  శ్యామలరాయా! శుభమును
  క్షేమం బగుఁ గాత మీకు చిరకాలమ్మున్.
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  లక్ష్మీదేవి గారూ,
  ఊకదంపుడు గారూ,
  సత్యనారాయణ మూర్తి గారూ,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  సుబ్బారావు గారూ,
  ‘దుర్గేశ్వర’ గారూ,
  ........................... ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 9. శ్రీ శ్యామల రావు గారికి షష్టి పూర్తి శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 10. మారెళ్ళ వామన కుమార్గురువారం, మే 03, 2012 4:49:00 PM

  శ్రీ శ్యామలరావుగారికి షష్టి పూర్తి శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 11. మిత్రులు తాడిగడప శ్యామలరావు గారిని
  "దీర్ఘాయుష్మాన్భవ" అని ఆశీర్వదిస్తున్నా.

  రిప్లయితొలగించండి
 12. గురువుగారూ ధన్యవాదాలండీ. బ్యాంకుకు వెళ్ళే హడావుడిలో అంతే వ్రాసి
  పోస్టు చేశాను. అద్భుతమైన జోడింపు.

  రిప్లయితొలగించండి
 13. శ్రీ శ్యామలరావుగారికి
  షష్ఠిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలు !

  రిప్లయితొలగించండి
 14. నమస్కారములు
  శ్రీ శ్యామల రావు గారి దంపతులకు సష్టి పూర్తి శభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 15. anrd గారికి,
  మారెళ్ళ వామన కుమార్ గారికి,
  కష్టేఫలి గారికి,
  వసంత కిశోర్ గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు
  ........ ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 16. శ్రీ శ్యామల రావు గారికి షష్టి పూర్తి శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 17. శ్రీ తాడిగడప శ్యామలరావు గారికి షష్టిపూర్తి శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 18. శ్రీనేమాని రామజోగి సన్యాసి రావుగారు దయతో పంపిన షష్ఠిపూర్తి శుభాశీస్సులకు వారికి మిక్క్లిలి కృతజ్ఞుడను. ఈ ఆశీస్సులను తమ శంకరాభరణం బ్లాగులో ఆదరంతో ప్రచురించినందుకు శ్రీశంకరయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాయందు ప్రేమాభిమానాలతో స్పందించిన కవిమిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  వీటిని పాక్షికంగా మా మేనమామగారు శ్రీ ఆత్రేయపురపు పాండురంగవిఠల్ ప్రసాదుగారు షష్ఠిపూర్తి ఆశీర్వచన సభావేదికపైన చదవటం జరిగింది. వారు తమ ఆశీర్వచన పద్యంకూడా చదివారు.

  కారణాంతరాల వలన కొద్ది రోజులుగా నెట్‌కు దూరంగా ఉండవలసి వచ్చింది. అందు చేత అందరికీ నా నమోవాకాలు తెలుపుకుందుకు యింతవరకూ ఆలస్యం అయినది. దానికి మన్నించవలసినది.

  రిప్లయితొలగించండి