18, మే 2012, శుక్రవారం

రవీంద్రుని గీతాంజలి - 16

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత


శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

16

I HAVE had my invitation to this world's
festival, and thus my life has been
blessed. My eyes have seen and my
ears have heard.

It was my part at this feast to play
upon my instrument, and I have done
all I could.

New, I ask, has the time come at
last when I may go in and see thy face
and offer thee my silent salutation ?


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము...

అందినది జగదానందయజ్ఞమందు
పాలుగొను పిల్పు, మనుజజీవనము నాకు
ధన్య మయ్యెఁ గడుంగడు ధన్య మయ్యె ||

నా కనుంగవ రూప సౌందర్యలహరి
యందుఁ బారాడి దప్పి చల్లార్చుకొనియె,
శ్రవణముల్ మున్క లిడె గభీరస్వరాల ||

మురళిపై గాన మొనరించు బరువు నాకు
నొప్పగించితి విట్టి మహోత్సవమున,
బ్రతుకులో నవ్వు లేడ్పులు పాటపాట
నింపి నే నింక దాని వాయింపఁగలను ||

ఇదియె విన్నప మిపు డొనరింతు నేను,
సమయమంతయు కడచను చరమ వేళ
నీదు సభలోని కేతెంచి, నీ ముఖమ్ము
దర్శన మొనర్చి, నీదు పదంబులందు
మౌనవందన మనియెడి కానుక యిడి,
వినియెదం గాక నీ జయ నినదములను ||     

2 కామెంట్‌లు:

 1. ఇదె గీతాంజలి నిన్ను జూచుటకునై యేతెంచు నాడేను నా
  యెదనే వేణువు జేసి పాడుదును నీ కింపైన రాగంబులో
  ముదమారన్ జయహే నినాదములతో పొంగార నా డెందమో
  సదయా నీ పిలుపంది నంతనె మహోత్సాహంబు వెల్గొందదే?

  రిప్లయితొలగించండి
 2. పండిత నేమాని వారూ,
  మొత్తం కవితలోని భావాన్ని ఒకే పద్యంలో ఇమిడ్చిన మీ రచనా నైపుణ్యానికి జోహార్లు!

  రిప్లయితొలగించండి