18, మే 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 708 (పరపురుషునికై తపింప)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

పరపురుషునికై తపింపవలె సతి యెపుడున్.

ఈ సమస్యను సూచించిన
కందుల వరప్రసాద్ గారికి
ధన్యవాదాలు.

20 కామెంట్‌లు:

  1. పరమాత్మునికై తపింప వలె మది యెపుడున్
    పరంధామునికై జపింప వలె హృది యెపుడున్
    పతి తోడి జీవనమున మది హృది ఏకమై,పరా
    త్పర పురుషునికై తపింపవలె సతి ఎపుడున్

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  2. పురుషుడు నొక్కడె జగతిన
    పరమాత్ముడు వాడనుంచు ప్రాజ్ఞత గలుగన్
    మరులుకొను భర్త తోడా
    పరపురుషునికై తపింప వలె సతి యెపుడున్ !

    రిప్లయితొలగించండి
  3. జిలేబి గారూ....
    చీర్స్... మీ భావానికి నా ఛందోరూపం....

    పరమాత్మునిఁ జేరుటకై
    త్వరపడు హృదయమ్ము గల్గి పతి తోడుగ సు
    స్థిరసుఖదుం డయిన పరా
    త్పరపురుషునికై తపింపవలె సతి యెపుడున్.

    రిప్లయితొలగించండి
  4. పరమార్థరతునికై సా
    దరమతి గుణశీల వరనిధానునికై స
    చ్చరితునికై సత్పథత
    త్పర పురుషునికై తపింపవలె సతి యెపుడున్

    రిప్లయితొలగించండి
  5. సరసుండై, సద్గుణుడై
    యరుసంబున దీనజనుల నాదుకొనంగా
    నిరతము శ్రమియించు కృపా
    పరపురుషునికై తపింపవలె సతి యెపుడున్.

    రిప్లయితొలగించండి
  6. సతీ సుమతి స్వగతం

    జరిగిన పొరబాటుకు నా
    పరదైవము భర్త యుసురు భావ్యమె తీయన్
    మొరవిని సూర్యో దయమా
    పర పురుషునికై తపింపవలె సతి యెపుడున్.

    రిప్లయితొలగించండి
  7. త్వరితగతిన్ గోవర్ధన
    గిరినెత్తినవాడు, సకల కేళీలోలుం
    డరవిందాక్షుడు, హరి, ద్వా
    పరపురుషునికైతపింపవలె సతి యెపుడున్.

    ద్వాపర పురుషుడు = శ్రీ కృష్ణుడు అనే అర్థములో వ్రాసినాను.

    రిప్లయితొలగించండి
  8. కరమును చాచుట తప్పది
    పరపురుషునికై; తపింపవలె సతియెపుడున్
    వరఫలముగ లభియించిన,
    మరులను గొన్నట్టి వాని మన్నన బెరుగన్.

    రిప్లయితొలగించండి
  9. ధరణీ ధారుడు,ధర్మో
    ద్ధరణోద్యోగుడును ,దుష్ట దనుజారియు నా
    సిరికిన్ మగండగు పరా
    త్పర పురుషునికై తపింపవలె సతి యెపుడున్

    రిప్లయితొలగించండి
  10. కమనీయం గారు,
    అందమైన పద్యం చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. గురువు గారికి నమస్కారములతో

    -------------

    సరసుడు ,మనోహరుడు సు

    స్థిర స్థానము బొంది, భక్త శేషశయను (ది )Dai

    మర (నామ్త)NAM ta కమున రక్షిం

    చు రమణుడు, మన నవనీత చోరుడు భక్తల్

    మొరవిను సిరిపురవాసుడు

    గురువుల గురువు పరమాత్మ కురు గోవర్థన్

    గిరిధారి పరాత్పర ద్వా

    పర పురుషునికై తపింప వలె సతి (ఏ)yeపుడున్

    రిప్లయితొలగించండి
  12. varuDu suguNaala magaDai
    taruNeemaNi paoShaNambu daalchedu vaDai
    yarayan sadvamsha param
    para, puruShunikai tapimpavale sati yepuDun

    రిప్లయితొలగించండి
  13. ధరలోన వెదకి చూచిన
    పరమేశుం డొక్క డనగ ప్రార్దింప దగున్ !
    మొరవిని రక్షణ చేసెడి
    పర పురుషునికై తపింప వలె సతి యెపుడున్ !
    ----------------------------------------------------
    వర మిడెను దైవ మనుచును
    పొరబడి వంచక ప్రియుడు పోడిమి యంచున్ !
    త్వరబడి నమ్ముట కంటెను
    పర పురుషునికై తపింప వలె సతి యెపుడున్ !

    రిప్లయితొలగించండి
  14. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    అన్నట్టు మీ పూరణ జిలేబీ గారి భావానికి ఛందోరూపం కాదుకదా!
    *
    పండిత నేమాని వారూ,
    సత్పథతత్పరపురుషుని గురించిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ద్వాపర పురుషునిపై మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    చక్కని పూరణ చెప్పారు.ఆభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    కాకుంటే కొన్ని టైపాట్లు, దోషాలు ఉన్నాయి.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    రెండవ పద్యం రెండవ పాదంలో ‘ప్రియుడు’ను ‘ప్రియుండు’ అంటే గణదోషం తొలగిపోతుంది.

    రిప్లయితొలగించండి
  15. గురువు గారూ , నమస్సులు. జిలేబీ వారి వ్యాఖ్యకు నా పద్యానికి పెద్ద పోలికలు లేవే ! వారి భాషా ప్రౌఢత నాకుంటేనా ... మా అన్నయ్య గారి లాగ పద్యాలు వ్రాసేయనూ !

    రిప్లయితొలగించండి
  16. చి. డా. నరసింహమూర్తికి శుభాశీస్సులు,
    అన్నయ్య లా పద్యాలు వ్రాసేయనూ -- కాదు. ఏదో ఒకనాటికి అన్నయ్యను మించి వ్రాస్తావని మా ఆకామ్ష - అలాగే శుభాశీస్సులు. కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం. విజయోస్తు. స్వస్తి

    రిప్లయితొలగించండి
  17. పరగగ 'వా' కును 'పా' కును
    చిరు భేదము తెలియనట్టి చిరుతడు వ్రాసెన్
    'వర పురుషు ' మాట నిట్టుల
    'పరపురుషునికై తపింపవలె సతి యెపుడున్'.

    రిప్లయితొలగించండి
  18. అరచేతిని స్వర్గమ్మును
    పరమేశుని నోటి లోన పార్వతి తోడన్
    సరసముగా చూపెడి "బం
    పర" పురుషునికై తపింపవలె సతి యెపుడున్

    బంపర = bumper

    రిప్లయితొలగించండి
  19. "చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే"

    త్వరపడి సెట్టున చేరగ
    పరుగులు పెట్టుటకు డాన్సు పాటల తోడన్
    కురియగ వర్షమ్ముల తుం
    పర, పురుషునికై తపింపవలె సతి యెపుడున్

    రిప్లయితొలగించండి