కవిమిత్రులకు నమస్కృతులు.
క్రమం తప్పకుండా నేను రోజుకొక చిత్రాన్ని (గూగులమ్మ దయతో) ఇవ్వడం, దానిని పరిశీలించి పద్యాన్నో, పద్యాలనో వ్రాయమని కోరడం అందరూ (లబ్ధప్రతిష్ఠులతో సహా) ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతున్నది. ఔత్సాహికులకు ఇది పద్యరచనాభ్యాసానికి తోడ్పడుతున్నది. అందరికీ ధన్యవాదాలు.
శ్రీ నేమాని వారు ‘ప్రత్యేక వృత్తాలు’ శీర్షికను ప్రారంభించిన విషయం మీకు తెలుసు. మన కవులు అప్పుడప్పుడు అవసరం, అవకాశం ఉన్నప్పుడో లేక అశ్వాంసాంత పద్యాలుగానో కొన్ని విశేషచ్ఛందాలలో పద్యాలు వ్రాస్తూ వచ్చారు. అటువంటి పద్యాలను పరిచయం చేస్తున్నారు శ్రీ నేమాని వారు.
కవి మిత్రులు ఆయా ఛందాలలో ఇష్ట దేవతా స్తుతి కాని, నచ్చిన ఏదైన అంశంపై కాని పద్యాలు వ్రాసి తమ రచనా నైపుణ్యాన్ని మెరుగు పరచుకొన వలసిందిగా మనవి.
అందువల్ల ఈ ‘పద్య రచన’ శీర్షికకు కొంతకాలం విశ్రాంతి!

మిత్రులారా!
రిప్లయితొలగించండిఏ పద్యము యొక్క పేరును ఆ పద్యములో చేర్చుటను ముద్రాలంకారము అంటారు. ఈ పద్యములో ముద్రాలంకారమును వేయుచున్నాను - అంతేకాదు ఇందులో వర్ణింపబడినది కూడా పాదపమే (చెట్టు).
పాదపమే మన పాలి వరంబౌ
నాదృతితో నిడు నౌషధ రాజిన్
మోదము నింపెడు పూవులు బండ్లున్
మేదిని సన్మతి మేలొన గూర్చున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్షమించాలి నా ప్రయత్నం . తమ్మునికి శ్రమ
రిప్లయితొలగించండి-----------------------------------------------
పాదప నీడను పాపులు ధూర్తుల్
సేదను దీరగ శోషువు నొందన్
కాదని త్రోయదు కోపము తోడన్
వేదన దీరిచి వీవన లీయున్ !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినేరము లెంచక నీడను చూపే
రిప్లయితొలగించండిభారము నాదను భూరుహ మేలే
కోరదు గాదిలి గోత్రము లేవీ
తీరును సేదయు తీక్షణ మైనన్