6, మే 2012, ఆదివారం

రవీంద్రుని గీతాంజలి - 4

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు


4

LIFE of my life, I shall ever try to
keep my body pure, knowing that thy
living touch is upon all my limbs.

I shall ever try to keep all untruths
out from my thoughts, knowing that
thou art that truth which has kindled
the light of reason in my mind.

I shall ever try to drive all evils away
from my heart and keep my love in
flower, knowing that thou hast thy seat
in the inmost shrine of my heart.

And it shall be my endeavour to
reveal thee in my actions, knowing it
is thy power gives me strength to act. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము...

ప్రాణమునకును బ్రాణమా! పవలు రేయి
నీవు సకలాంగముల్ స్పృశియించు చుందు
విదియె తలపోసి నాయొడ లెప్పుడేని
శుభ్రముగ నుంచుకొనుటకుఁ జూతునోయి! ||

విమల సదసద్వివేకఁపు వెల్గు గ్రమ్ము
నుల్లమున సత్యమయుఁడవై యుందు వీవ,
యిది తలంచుచు మది సదా యితర చింత
లెల్ల దూర మొనర్ప యత్నింతు నోయి! ||

అంతరంగములో నంతరాంతమున
నీవు గూర్చుండు పీఠము నిల్చియుండు,
నిది సదా తలపోయుచు నెల్ల దుర్గు
ణాళి యెదనుండి పోద్రోలి యచటఁ బ్రేమ
సుమము విరబూయు నట్టులు జూతువోయి! ||

సర్వ విధముల పనులను జరుపుకొనెడి
బలము నీదగు శక్తియే కలుగఁ జేయు,
నిది సదా మది నిల్పుచు నెల్ల పనుల
నిన్నె ప్రకటీకరింప యత్నింతు నోయి! ||

2 కామెంట్‌లు:

  1. శ్రీ సరస్వత్యై నమః:
    శ్రీమాన్ చిలుకమర్రి వారి పద్య అనువాదము (శ్రీ రవీంద్రుని గీతాంజలికి) సరళమైన సహజ సుందర భాషలో అలరారుతూ చదువరులకు ఆహ్లాదమును కలిగించుచున్నది. ఈ రచనను అందించుచున్న శ్రీ శంకరయ్య గారికి ప్రత్యేక శుభాభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి