18, మే 2012, శుక్రవారం

ప్రత్యేక వృత్తములు - 6

పంచ చామరము - 

ఇది 16వ ఛందమైన ‘అష్టి’లో 21846వ వృత్తం. ఇది ఉత్సాహ, సుగంధి వృత్తముల వలెనే యుండును.

గణములు: జ ర జ ర జ గ
యతిస్థానమ: 10వ అక్షరము
ప్రాస నియమము కలదు


ఉదా: 


మో హిరణ్య బాహవే సనాతనాయ తే నమః
మశ్శివాయ సర్వ భూత నాయకాయ తే నమః
మో హరాయ నందివాహనాయ శూలినే నమః
మో భవాయ నాగభూషణాయ శంభవే నమః

I  U    I-U   I   U-I U  I-U   I   U- I U I- U
   జ    -       ర    -    జ  -     ర    -     జ -  గ.


పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

10 కామెంట్‌లు:

  1. మహాశివా! సదా భజింతు, మానసమ్మునందునన్!
    సహాయమంచు కోరి నిన్ను శ్రద్ధతోడ వేడుదు
    న్నహమ్ము నిండె నాదు పూజ లందు, తప్పు కాదొకో!
    ప్రహారమిప్డు సేయరావె, పాలకా!నమోస్తుతే!

    రిప్లయితొలగించండి
  2. నిరంతరమ్ము భక్తితోడ నిర్మలాత్ము లౌచు నా
    పరాత్పరున్ సదాశివున్ కృపాలు చంద్రశేఖరున్
    హరా! యటంచు గొల్చువార లద్భుతంబుగానికన్
    పురాకృతాఘముక్తులౌచు పూజ్యులౌదు రెల్లెడన్.

    రిప్లయితొలగించండి
  3. మరింత జాగు చేయనేల? మాన్యులార! రావలెన్
    పరిశ్రమించ సాధ్యమౌను పంచచామరంబహో
    పరాకు లేక గూర్తుమింక పద్యరత్న మిప్పుడే
    జరా జరా జగంబు లుంచి చక్కనైన రీతిలోన్.
    (జరాజరాజగంబులు=జ,ర,జ,ర,జ,గ)

    రిప్లయితొలగించండి
  4. ఆర్యా!
    నాల్గవ పాదంలో "జరల్, జరల్, జగంబు లుంచి" అని చదువవలసినదిగా ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  5. పదమ్ము పట్టి వీడబోని భక్తి నిచ్చినావు రా!
    కదమ్ము త్రొక్కి యాడ కాంక్ష కల్గె నాకు నిప్పుడే!
    ముదమ్ము మీఱ నేడు, నీలమోహనాంగ ! పాడెదన్.
    పదమ్ము పాడి నాట్యమాడి పంకజాక్షు గొల్చెదన్.

    రిప్లయితొలగించండి
  6. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా!
    శుభాభినందనలు. గమనించారా పంచచామరము మరియు సుగంధి యొక్క లక్షణములను. సుగంధి యొక్క ప్రతి పాదమునకు ముందు ఒక లఘువు చేర్చితే పంచచామరము అవుతోంది. అందుచేత కొంచెము శ్రమించితే సుగంధి గర్భిత పంచచామరమును వ్రాయ వచ్చును. అలాగే ఆటవెలది గర్భిత ఉత్సాహను కూడా వ్రాయ వచ్చును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. పురారి ధర్మ పత్నివై ప్రమోద మందవే సదా !
    సురారి గర్వ హారిణీ! విశోక కారిణీ! శివా!
    మురారి సోదరీ! కృపన్ తమో గుణమ్ము బాపవే!
    పరాత్పరీ! శివంకరీ ! శుభమ్ము లీవె సర్వదా !

    రిప్లయితొలగించండి
  8. లక్ష్మీదేవి గారూ,
    మీ రెండు పద్యాలూ చాలా బాగున్నాయి. అభినందనలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ రెండు పద్యాలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
    ‘జరాజరా’ చూసి నేను ఉలిక్కిపడ్డాను సుమా! ‘భానుసమాన! విన్ భరనభా(భభ)రలగంబుల’ పద్యాన్ని గుర్తుకు తెద్దామనుకున్నాను. కాని క్రిందనే మీ సవరణ చూసి తృప్తి పడ్డాను.
    *
    మిస్సన్న గారూ,
    మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. మిస్సన్నగారూ!
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. సురేశ్వరీ సుహాసినీ విశుద్దమానసోజ్వలా
    పరాత్పరీ భయంకరీప్రవాళమాల ధారిణీ
    నిరామయీనిరంజనీ వినీల కేశపాశినీ
    సరోరుహాననా ప్రసన్న శాంతిసౌఖ్యదాయినీ

    రిప్లయితొలగించండి