పండిత నేమాని వారూ, మీ రెండు పూరణలూ వైవిధ్యంగా మధురంగా ఉన్నాయి. అభినందనలు. * సత్యనారాయణ మూర్తి గారూ, చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు. * నరసింహ మూర్తి గారూ, విరహార్తులైన వారి మాటగా అద్భుతమైన పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, ‘వెధవ’ అంటే ‘వెయ్యేళ్ళు ధనముతో వర్ధిల్లు’ అన్నట్టు ‘పాపి’కి చక్కని వివరణ ఇచ్చారే. చమత్కారం అదిరింది. అభినందనలు. ‘పార్వతి + అనగ = పార్వతి యనగ’ అని యడాగమం వస్తుంది. అక్కడ ‘పార్వతి యన’ అందాం. * ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. ‘కుసుమాకరు’డంటే వసంతుడౌతాడేమో? మన్మథుడు ‘కుసుమాయుధుడు’ కదా! అక్కడ ‘కుసుమాయుధు నణచ’ అందామా? * కమనీయం గారూ, మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు. నా ఆరోగ్యం గురించి ప్రశ్నించినందుకు ధన్యవాదాలు. వరంగల్ కిడ్నీ సెంటర్‌లో డా. విద్యాధర్, M.S., M.Ch. (Uro.) ని కలిసాను. Ultra Sonography, X-Ray (KUB), Urin Test చేయించారు. రిపోర్టులు నేను చదవలేక పోతున్నాను. గతంలో కంటె రాయి సైజు పెరిగింది. మూత్రనాళంలో అతుక్కుపోయి అడ్డుపడుతున్నదట! మందులతో పోదన్నారు. I.V.P చేయాలన్నారు. సర్జరీ తప్పదంటున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రస్తుతానికైతే నొప్పి పూర్తిగా తగ్గకున్నా, సన్నగిల్లి నేనున్నానని గుర్తు చేస్తున్నది. * లక్ష్మీదేవి గారూ, మీ పూరణ చక్కని విరుపుతో బాగుంది. అభినందనలు. * సహదేవుడు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
గురువు గారూ, నమస్సులు, ధన్యవాదములు. మఱి మూత్రనాళములో చిక్కుకొని పరిమాణము పెద్దదిగా ఉంటే యూరాలజిస్టు వారి సలహా పాటించాలను కొంటాను. శబ్ద తరంగాలతో శిలా విచ్ఛేదనము చేయ గలరేమో ( అక్కడ అందుబాటులో ఉంటే ) కనుక్కొండి. చిక్కం లోనుంచి కూడా రాళ్ళు తొలగించే పధ్ధతు లుంటాయి. అలా కూడా ప్రయత్నిస్తారేమో చూడండి . మీ అరోగ్యము కుదుట పడాలని మా ప్రార్ధనలు.
కిడ్నీలో రాయి పెద్దదైతే సర్జరీతప్పదు.మందులు,ఇంజెక్షన్ల్లు, తాత్కాలిక ఉపశాంతికే.వరంగల్ లోగాని,హైద్రాబాద్ లో గాని నిపుణుల చేత సర్జరీ చేయించుకోక తప్పదు.(సాధ్యమైనంత త్వరలో).మీరు A.p,Govt.service నుంచి రిటైరు అయివుంటే మీకు ఖర్చులు reimbursement ఉంటుంది.
బ్రహ్మ శిరము త్రెళ్ళె పశుపతి గోటికి
రిప్లయితొలగించండికంజభవుని మది వికారములకు
హరుని కొదవె పాప మారీతిగా చూడ
ఫాలలోచనుండు పాపి సుమ్ము
ఫాలలోచనుండు పాపి సుమ్మనునట్టి
యీ సమస్య వినుచు నీశ! శర్వ!
హాస్యమే యటంచు నాశీర్వదింపుమా
భక్త వత్సలా! శివా! కృపాబ్ధి!
వైభవంబు లొసగి భక్తశేఖరుఁ జేసె
రిప్లయితొలగించండిఫాలలోచనుండు, పాపి సుమ్ము
రావణాసురుండు రాముని పత్నిని
సీతనపహరించి చేటునందె.
కుసుమ శరుని గాల్చు కుటిల వర్తనముచే
రిప్లయితొలగించండిఫాలలోచనుండు పాపి సుమ్ము
కంఠబిలము నందు గరళ మిచ్ఛను నిల్పు
లోకహితున కిట్టి పోక యేలొ ?
పార్వతనగ పిచ్చి పరగ మేన్సగమిచ్చె
రిప్లయితొలగించండిపాపరేళ్ళ పిచ్చి పైన దాల్చె
పాను పీను గలిపి పరమేశు దలచగ
ఫాలలోచనుండు పాపి సుమ్ము.
కుటిలవర్తనుడగు కుసుమాకరునణచ
రిప్లయితొలగించండిఅగ్నినేత్ర మలర అయ్య నాత
ఫాలలోచనుండు; పాపి సుమ్మతనుడు
పట్టు దప్పె శివుని పలుకరించి!
మనవి: అతనుడు=మన్మధుడు
కంజ భవుని శిరము ఖండించె కొనగోట
రిప్లయితొలగించండినిగ్రహమ్ము లేక నీల కంఠు
డట్లు కలిగె బ్రహ్మ హత్య పాతకమున
ఫాలలోచనుండు పాపి సుమ్ము.
శంకరయ్యగారూ,మీ ఆరోగ్యం ఎట్లా ఉంది ?urosurgeon ఏమన్నారు?
పాపరాశినెల్ల భస్మమొనరజేయు
రిప్లయితొలగించండిఫాలలోచనుండు; పాపి సుమ్ము
వాని మ్రొక్కలేని వాఁడిలను మనుజ
జన్మ నెత్తి, ఫలము చాలదేమొ.
పాల కడలి దేలు ఫణిశయనుని కన్న
రిప్లయితొలగించండిపద్మ నిలయుడైన బ్రహ్మ కన్న
పుర్రెన భుజియించి బూడిద మైపూయు
ఫాల లోచ నుండు పాపి సుమ్ము!
మసన మందు దిరుగ మహదేవు డందురు
రిప్లయితొలగించండిపాప హరమె యనెడి భస్మ ధారి
పునుక మాల గళము పూజింతు రేలనో
పాల లోచ నుండు పాపి సుమ్ము !
---------------------------------------------
కొంచం తీరిక లేక ౨,౩, రోజులుగా నెట్ చూడ లేదు . తమ్ముడూ ! ఆరోగ్యం జాగ్రత్త . మీ ఆరోగ్యం తొందరలో కోలు కోవాలని భగ వంతుని వేడు కుంటూ !
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలూ వైవిధ్యంగా మధురంగా ఉన్నాయి. అభినందనలు.
*
సత్యనారాయణ మూర్తి గారూ,
చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
*
నరసింహ మూర్తి గారూ,
విరహార్తులైన వారి మాటగా అద్భుతమైన పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
‘వెధవ’ అంటే ‘వెయ్యేళ్ళు ధనముతో వర్ధిల్లు’ అన్నట్టు ‘పాపి’కి చక్కని వివరణ ఇచ్చారే. చమత్కారం అదిరింది. అభినందనలు.
‘పార్వతి + అనగ = పార్వతి యనగ’ అని యడాగమం వస్తుంది. అక్కడ ‘పార్వతి యన’ అందాం.
*
‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘కుసుమాకరు’డంటే వసంతుడౌతాడేమో? మన్మథుడు ‘కుసుమాయుధుడు’ కదా! అక్కడ ‘కుసుమాయుధు నణచ’ అందామా?
*
కమనీయం గారూ,
మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
నా ఆరోగ్యం గురించి ప్రశ్నించినందుకు ధన్యవాదాలు. వరంగల్ కిడ్నీ సెంటర్‌లో డా. విద్యాధర్, M.S., M.Ch. (Uro.) ని కలిసాను. Ultra Sonography, X-Ray (KUB), Urin Test చేయించారు. రిపోర్టులు నేను చదవలేక పోతున్నాను. గతంలో కంటె రాయి సైజు పెరిగింది. మూత్రనాళంలో అతుక్కుపోయి అడ్డుపడుతున్నదట! మందులతో పోదన్నారు. I.V.P చేయాలన్నారు. సర్జరీ తప్పదంటున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రస్తుతానికైతే నొప్పి పూర్తిగా తగ్గకున్నా, సన్నగిల్లి నేనున్నానని గుర్తు చేస్తున్నది.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ చక్కని విరుపుతో బాగుంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
గురువు గారూ, నమస్సులు, ధన్యవాదములు. మఱి మూత్రనాళములో చిక్కుకొని పరిమాణము పెద్దదిగా ఉంటే యూరాలజిస్టు వారి సలహా పాటించాలను కొంటాను. శబ్ద తరంగాలతో శిలా విచ్ఛేదనము చేయ గలరేమో ( అక్కడ అందుబాటులో ఉంటే ) కనుక్కొండి. చిక్కం లోనుంచి కూడా రాళ్ళు తొలగించే పధ్ధతు లుంటాయి. అలా కూడా ప్రయత్నిస్తారేమో చూడండి . మీ అరోగ్యము కుదుట పడాలని మా ప్రార్ధనలు.
రిప్లయితొలగించండిగుండు మధుసూదన్ గారి పూరణ....
రిప్లయితొలగించండివరముఁ బొంది వెంటపడఁగఁ దాఁ బరుగెత్తి
రొప్పుచుండె ఫాలలోచనుండు!
పాపి సుమ్ము నిజము భస్మాసురుఁడు వాఁడు
పాలు ద్రావు విషపుఁ బాము గాఁడె!
కిడ్నీలో రాయి పెద్దదైతే సర్జరీతప్పదు.మందులు,ఇంజెక్షన్ల్లు, తాత్కాలిక ఉపశాంతికే.వరంగల్ లోగాని,హైద్రాబాద్ లో గాని నిపుణుల చేత సర్జరీ చేయించుకోక తప్పదు.(సాధ్యమైనంత త్వరలో).మీరు A.p,Govt.service నుంచి రిటైరు అయివుంటే మీకు ఖర్చులు reimbursement ఉంటుంది.
రిప్లయితొలగించండికమనీయం గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
నేను పని చేసినది ‘ఎయిడెడ్ స్కుల్’లో. మాకు రీఅంబర్స్‌మెంట్ సౌకర్యం లేదు. అదే సమస్య.