14, మే 2012, సోమవారం

సమస్యాపూరణం - 704 (నరకలోకము గలదండ్రు)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

నరకలోకము గలదండ్రు నాకమందు.

ఈ సమస్యను పంపిన  
పోచిరాజు సుబ్బారావు గారికి 
ధన్యవాదాలు.

22 కామెంట్‌లు:

  1. మందు వేసుక జెప్పెను "మందుడొకడు"
    నాక లోకము కనుపించు నాక 'మందు '
    చేరి జెప్పితి నీలాటి వారి కొరకు
    నరకలోకము గలదండ్రు నాక మందు.

    రిప్లయితొలగించండి
  2. వేద విజ్ఞానమయమయి విశ్వమందు
    ధర్మనిలయమ్మునౌ భరత భువి నేడు
    సకల దౌష్ట్యనిధాన ప్రశస్తి గనుట
    నరకలోకమ్ము గలదండ్రు నాకమందు

    రిప్లయితొలగించండి
  3. భక్తి భావంబు నందను రక్తిలేక
    వృజినయుతులగు దాతృత్వ హీన తతికి
    నరకలోకము గలదండ్రు; నాకమందు
    సతత హరిసేవనము జేయు జనత భువిని

    రిప్లయితొలగించండి
  4. పాపకర్మలు చేసెడు వారికెల్ల
    నరకలోకము గలదండ్రు; నాకమందు
    చోటు దొరకుట కఠినమ్ము చూడగాను;
    మంచి చెడులకు ఫలితమ్ము మరువరాదు.

    రిప్లయితొలగించండి
  5. గుండా సహదేవుడు గారి పూరణ.........

    వర్తమానంలో జీవించడం రానివాళ్ళు నాకంలో వున్నా నరకంలో వున్నట్లే నన్న భావంతో వ్రాస్తున్నాను.

    భూతభవితము లన్నవి భూతములయి
    యెదను నిశ్చల పరచక బెదరగొట్టు
    వర్తమానాన మనలేనివార లంత
    నరకలోకము కలదండ్రు నాకమందు.

    రిప్లయితొలగించండి
  6. స్వర్గలోకమ్ము, భూలోక చందముగను
    నరకలోకమ్ము గలదండ్రు; నాకమందు
    సుఖము, నరకమందున దుఃఖ,శోకమనుచు
    భువిని జనులకు భావన బుఱ్ఱయందు.

    రిప్లయితొలగించండి
  7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    త్రాగుబోతు మాటలకు అర్థాలుండవనేగదా! బాగుంది. చక్కని పూరణ. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    స్వర్గతుల్యమైన భరతభూమి నరకమైందన్న మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
    బహుకాల దర్శనం! చాలాకాలానికి మీ పూరణ ఆనందాన్ని కలిగించింది. ధన్యవాదాలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    చక్కని విరుపుతో మంచి పూరణలు చెప్పారు. అభినందనలు.
    *
    గుండా సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. తప్పు పనులను జేసిన తప్పదండ్రు
    నరకలోకము గలదండ్రు; నాకమందు
    శాంతి సౌఖ్యమ్ము సురమైత్రి సాదరమును
    దీన జనసేవ జేసిన ధీయుతులకు !!!

    రిప్లయితొలగించండి
  9. మంద పీతాంబర్ గారూ,
    చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. అన్నయ్య గారి పూరణ అద్భుతము. మిత్రుల పూరణలన్నీ చాలా బాగున్నాయి. శర్మ గారూ ! వృజినము అంటే పాపము అని నిఘంటువు సహాయముతో తెలుసుకొన్నాను. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  11. చి. తమ్ముడు డా. నరసింహమూర్తికి శుభాశీస్సులు మంచి భావముతో పద్యము బాగున్నది.
    శ్రీమతి లక్ష్మీ దేవి గారు గోసేవ యొక్క ఫలశ్రుతిని చక్కగా వివరించేరు. అభినందనలు. అందరికీ శుభాశీస్సులు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. అన్నయ్య గారికి నమస్సులు. కాని మార్పు చేయాలని పించింది. మన్నించండి

    వర్గ షట్కము వీడిన వారి కెల్ల
    నవని యనిమిష లోకమై యలరు చుండుఁ
    జింత మధనము నొందెడి శిష్టులకును
    నరకలోకము గల దండ్రు నాక మందు.

    రిప్లయితొలగించండి
  13. నరక నాకము లన్నవి వేరు లేవు
    దైవ చింతన లోపించి తర్క మిడుచు
    బుద్ధి ఖర్మల వెంబడి ప్రొద్దు దిరుగ
    నరక లోకము కలదండ్రు నాక మందు

    రిప్లయితొలగించండి
  14. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    అరిషడ్వర్గాన్ని జయించిన వారికి భూలోకమే స్వర్గలోకమన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    అది ‘కర్మ’... ఖర్మ కాదు.

    రిప్లయితొలగించండి
  15. అందరికీ నమస్సులు, ధన్యవాదములు. శంకరయ్య గారు కొన్ని కారణాల వల్ల ఆన్ లైన్ రాకపోయాను. ఇకపై తప్పక సమస్యాపూరణంలో పాల్గొంటాను.

    నరసింహమూర్తి గారు అభివందనాలు.

    నెంఎని తాతగారికి పాదాభివందనాలు.

    రిప్లయితొలగించండి