21, మే 2012, సోమవారం

సమస్యాపూరణం - 711 (పందిరిమంచమున ముండ్లు)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

పందిరిమంచమున ముండ్లు పఱచుటె మేలౌ.  


ఈ సమస్యను సూచించిన
పోచిరాజు సుబ్బారావు గారికి
ధన్యవాదాలు.  



20 కామెంట్‌లు:

  1. నందికి గౌరవ మీయగ
    పందిరిమంచమున పూలు పఱచుటె మేలౌ
    పందియె వచ్చిన పిలువక
    పందిరిమంచమున ముండ్లు పఱచుటె మేలౌ.

    రిప్లయితొలగించండి
  2. రాత్రివేళ కట్నాలు, కానుకలు అనే విషయం పై వాదులాడుకొన్న భార్యా భర్తల సంభాషణ చివరికి :

    అందిన మేరకు కట్నము
    నందుకొనరె నాడు క్రుంగ నమ్మానాన్నల్
    యెందులకీ నయగారము
    పందిరిమంచమున ముండ్లు పఱచుటె మేలౌ.

    రిప్లయితొలగించండి
  3. మొదటి రాత్రి వధువు వరునితో

    అందిన మేరకు కానుక
    లందుకొనరె ప్రేయసీ యటందురె నేడున్
    వందనములు మీ ప్రేమకు
    పందిరిమంచమున ముండ్లు పఱచుటె మేలౌ.

    రిప్లయితొలగించండి
  4. విందులలో దేలి కడు ప
    సందుగ మందెక్కువగుచు స్వస్థత లేకే
    చిందుల నాడుచు వీరూ
    పందిరి మంచమున ముళ్ళు పరచుట మేలౌ

    రిప్లయితొలగించండి
  5. నిందలు సరికాదెప్పుడు
    పందిరిమంచమున, ముండ్లు పఱచుటె మేలౌ
    చందం బెరుగక సతులను
    బందీలను చేయువారి పథముల యందున్.

    రిప్లయితొలగించండి
  6. అందునొ సొమ్ములు; విడువకు
    పందిరి మంచమున,ముళ్ళు పరచుట మేలౌ
    కందువ దొంగలు వత్తురొ,
    విందులు జరిగిన భవంతి వెలుపలి త్రోవన్.

    రిప్లయితొలగించండి
  7. అధికారము దక్కినప్పుడు దేశ సంపదలను కొల్లగొట్టిన వారి నిప్పుడు శిక్షించడము న్యాయమేనా ? పాపం !

    అందల మెక్కిన సందడి
    యందిన భాగ్యముల నెన్నొ నంకింపంగాఁ
    గుందగఁ జేయుట దగునౌ ?
    పందిరిమంచమున ముండ్లు పఱచుటె మేలౌ !

    రిప్లయితొలగించండి
  8. నల్లుల గురించి ఓ అతిధి గృహస్థుని నిందిస్తున్నాడు,

    వందల యంకెల నల్లులు
    విందుల సౌఖ్యంబు గాంచె విందుకుఁ బిదపన్
    అందుకు మీ వగ పేలను ?
    పందిరి మంచమున ముళ్ళు పఱచుటె మేలౌ !

    పద్యములో ' పేలను ' కూడా యిమడ్చ గలిగాను !

    రిప్లయితొలగించండి
  9. అందమగు పూల జల్లుట
    పందిరి మంచమున , ముండ్లు పరచు టె మేలౌ
    పందుల బారిని రక్షకు
    వందలుగా లింకు గూర్చి భవనము చుట్టున్ .

    రిప్లయితొలగించండి
  10. తొందర బడి మరదలు చని
    పందిరి మంచమున ముండ్లు పఱచుటె మేలౌ !
    సందడే సందడి జంటకు
    చిందులు వేయగ నటునిటు శివరాత్రి యటన్ !

    రిప్లయితొలగించండి
  11. అందెను సమరఫు వార్తలు
    సుందరికన్నులుచెమరెను,శోభనమగడే
    తొందరజేయుచువెడలన్
    పందిరిమంచమునముండ్లుపఱచుటె మేలౌ!

    రిప్లయితొలగించండి
  12. నా పూరణ సైన్యములో పనిజేసే శోభన మగనికి యుద్దభూమికి రమ్మని పిలుపువచ్చినపుడు భార్య మనోవేదన

    రిప్లయితొలగించండి
  13. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ రెండు పూరణలూ చక్కగా ఉన్నాయి. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలూ చక్కగా ఉన్నాయి. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. రాజేశ్వరి అక్కయ్యా,
    చమత్కారభరితంగా చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    మూడవ పాదంలో ‘సందడె’లో ‘డే’ అని టైపాటు.
    ‘శివరాత్రి యటన్’ కంటే ‘శివరాత్రి యయెన్’ అంటే బాగుంటుందేమో!
    *
    సహదేవుడు గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘శోభనమగడే’ అనడమే దోషం. ఆ పాదాన్ని ఇలా సవరిస్తే బాగుంటుందని నా సూచన....
    ‘సుందరి దుఃఖించె మగడు శోభనమందే’

    రిప్లయితొలగించండి
  15. హమ్మయ్య ! అక్కడి దాకా వచ్చి సవరణ ఆగి పోయిందంటే ఛాలా భయ పడ్డాను . ఇప్పుడే చెరి పెద్దా మను కుంటున్నాను. గణ దోషాలున్నా ఫరవా లేదు . భావంలో ఉంటే కష్టం .అందుకని
    [ ఒకోసారి టైప్ ఇక్కడ బాగానే ఉంటుంది . ప్రింటి గులో కొచ్చే సరికి దీర్ఘాలు , వత్తులు , చెదరి పోతుంటాయి . పదే పదే చేరపాల్సి వస్తుంది ] ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  16. శ్రీగురుభ్యోనమః
    ఆర్యా!
    తప్పులెన్నగగొప్పగజెప్పనేర్తు
    మీసవరణ బాగుంది.ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  17. ఎందులకో నేనీ పోర్
    బందరు గాంధీని జేరి బందీ నైతిన్ !
    ముందరగా తొందరపడి
    పందిరిమంచమున ముండ్లు
    పఱచుటె మేలౌ

    రిప్లయితొలగించండి
  18. మాయావతి:

    తొందర పడి యాదవునకు
    గందర గోళమ్మునందు కౌగిలి నిడితిన్
    బందుగులారా! నాకిక
    పందిరిమంచమున ముండ్లు పఱచుటె మేలౌ

    రిప్లయితొలగించండి