ఇంద్రవంశ -
ఇది 12వ ఛందమైన ‘జగతి’లో 1381వ వృత్తము.
లక్షణములు -
గణములు - త త జ ర
యతి - 8వ అక్షరము
ప్రాస నియమము కలదు
ఇంద్రవజ్ర కంటే ఇందులో ఒక అక్షరము ఎక్కువగా ఉంటుంది(చివరలో).
ఉదా:
ఇందీవరశ్యామ! నరేశ్వరేశ్వరా!
బృందారక ప్రస్తుత విక్రమోజ్జ్వలా!
మందస్మితాస్యాంబుజ! క్ష్మాసుతా ప్రియా!
వందారు మందార! భవప్రణాశకా!
చూచేరు కదండీ. ఇక ప్రయత్నించండి. స్వస్తి!
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
ఇది 12వ ఛందమైన ‘జగతి’లో 1381వ వృత్తము.
లక్షణములు -
గణములు - త త జ ర
యతి - 8వ అక్షరము
ప్రాస నియమము కలదు
ఇంద్రవజ్ర కంటే ఇందులో ఒక అక్షరము ఎక్కువగా ఉంటుంది(చివరలో).
ఉదా:
ఇందీవరశ్యామ! నరేశ్వరేశ్వరా!
బృందారక ప్రస్తుత విక్రమోజ్జ్వలా!
మందస్మితాస్యాంబుజ! క్ష్మాసుతా ప్రియా!
వందారు మందార! భవప్రణాశకా!
చూచేరు కదండీ. ఇక ప్రయత్నించండి. స్వస్తి!
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
దేవా! జగద్రక్షక! దీనబాంధవా!
రిప్లయితొలగించండికైవల్య యోగప్రద! కామనాశకా!
భావింతు నీ తత్త్వము ఫాలలోచనా!
కావింతు నీ సేవల కంజజార్చితా!
అయ్యప్పదీక్షల్ పరమాద్భుతంబుగా
రిప్లయితొలగించండినెయ్యంబునుం జూపుచు నిర్మలాత్ములై
శయ్యాదిసౌఖ్యంబులు సంస్మరించ కే
కయ్యంబులం బూనక కర్మనిష్ఠులై
అత్యంతభక్తిన్ పరమాత్ముదల్చుచున్
సత్యంబునుం బల్కుచు సాధుశీలురై
నిత్యంబు పూజాదులు నిర్వహించగా
నత్యాదరంబుల్ ధరనందుచుండెడున్.
సంతోషముల్ గల్గును, సర్వపాపముల్
సాంతంబుగా నాశమునంది, కీర్తులున్
సొంతంబులై గూడును, శోభలందెడున్,
చెంతన్ మహైశ్వర్యము చేరుచుండెడున్.
చేలమ్ములన్ సొంపులు చిందు జాతిగా
రిప్లయితొలగించండిశ్రీలెన్నొ పొంగారగ జేయు తల్లిగా
శాలీన వంశంబుల జన్మభూమిగా
నీ లీల నా భారత మింక వెల్గునే!
శ్రీమతి లక్ష్మీ దేవి గారికి మరియు శ్రీ హరి వెంకట సత్యనారాయణ మూర్తి గారికి శుభాశీస్సులు. మీ పద్యములు చక్కగా అలరారుచు నున్నవి.
రిప్లయితొలగించండిపండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిమీ శివస్తుతి బాగున్నది. అభినందనలు.
*
సత్యనారాయణ మూర్తి గారూ,
అయ్యప్ప దీక్షా ప్రాశస్త్యాన్ని అద్భుతమైన పద్యాల్లో వివరించారు. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.