కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...
కోయవాఁడు గొట్టెఁ గుపితుఁ డగుచు.
ఈ సమస్యను సూచించిన
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి
ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...
కోయవాఁడు గొట్టెఁ గుపితుఁ డగుచు.
ఈ సమస్యను సూచించిన
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి
ధన్యవాదాలు.
తోట లోన జేరి తుంటరి బాలుండు
రిప్లయితొలగించండిచెట్టునెక్కి మిగుల దిట్టయగుచు
కాచు(పు)వాని యునికి గాంచక పండ్లను
కోయ, వాడు గొట్టె కుపితుడగుచు.
నెత్తిమీద నాల్గు నెమలీకలను గట్టి
రిప్లయితొలగించండిఆకు లలదియున్న కోకఁ జుట్టి
తిరుగువాని బాలు రరయుచు నవ్వంగ
కోయవాడు గొట్టెఁ గుపితుడగుచు.
కిరాతార్జునీయం భూమికగా...
రిప్లయితొలగించండిసవ్యసాచివేటు సవ్యత ప్రశ్నించ
కోయఁగాని బ్రతుకుకోయుశూళి
పడినమృగముగూర్చిపట్టువీడనిపార్థు
కోయవాడుగొట్టె కుపితుడగుచు
పంది నాదనుచును పందెముతో పోరె
రిప్లయితొలగించండినరుడు కోయరూప హరుడు నాడు
అర్జునుండు కొట్ట నావేశమున మాయ
కోయవాఁడు గొట్టెఁ గుపితుఁ డగుచు.
రెండవ పాదం సవరణ:
రిప్లయితొలగించండికోయ కాని బ్రతుకు కోయు శూళి
రాము తోట లోని రామ ఫలములను
రిప్లయితొలగించండికోయ , వాడు గొట్టె గుపితు డగుచు
అడుగ కుండ కోయ నవసర మేమొ చ్చె?
రంగ ! యిటుల జేసి దొంగ కాకు .
భారతీయులెపుడు పతకమ్మునొకటైన
రిప్లయితొలగించండిగెలువలేదని విని క్రీడలందు,
దేశకీర్తి కొఱకు దీక్షబూని మదిని
కోయవాఁడు గొట్టెఁ గుపితుఁ డగుచు.
మల్లె తోట లోన మెల్లగా జొరబడి
రిప్లయితొలగించండిపూలు కోయ నెంచి పూజ కొఱకు
తోట మాలి కసిరె మాటమాత్ర మనక
కోయ వాడు గొట్టె కుపితు డగుచు
--------------------------------------------
కోయ దొరలు మేము చెయిజూసి చెబుతాము
వేయి జన్మ లైన వెలుగు యశము
వంక లేక వినుము శంకించ పనిలేదు
కోయ వాడు గొట్టె కుపితు డగుచు !
వైవిధ్యంగా, ప్రశంసనీయంగా పూరణలు చేసిన కవిమిత్రులు...
రిప్లయితొలగించండిసత్యనారాయణ మూర్తి గారికి,
సహదేవుడు గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సుబ్బారావు గారికి,
ఊకదంపుడు గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
................. అభినందనలు, ధన్యవాదాలు.