31, డిసెంబర్ 2017, ఆదివారం

సమస్య - 2560 (దౌర్భాగ్యంబుల నిచ్చి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"దౌర్భాగ్యము నిచ్చి ప్రోచు దామోదరుఁడే"
(లేదా...)
"దౌర్భాగ్యంబుల నిచ్చి ప్రోవగదరా దామోదరా సత్కృపన్"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు గారు ఇచ్చిన సమస్య)

30, డిసెంబర్ 2017, శనివారం

దత్తపది - 129 (హస్త-చిత్త-స్వాతి-మూల)

హస్త - చిత్త - స్వాతి - మూల
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
షడ్రసోపేత భోజనాన్ని వర్ణిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో రాంభట్ల వేంకటరామ శర్మ గారు ఇచ్చిన దత్తపది)

29, డిసెంబర్ 2017, శుక్రవారం

సమస్య - 2559 (ఏకాదశి నాటి పూజ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"ఏకాదశి నాటి పూజ లిడుములఁ గూర్చున్"
(లేదా...)
"ఎలమిన్ గష్టము లెన్నొ కూర్చును గదా యేకాదశీ పూజలే"

28, డిసెంబర్ 2017, గురువారం

సమస్య - 2558 (భార్యకు సేవఁ జేయ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"భార్యను సేవించునట్టి భర్త తరించున్"
(లేదా...)
"భార్యకు సేవఁ జేయ భువి భర్త తరించును జన్మజన్మకున్"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో ఎలపర్తి రమణయ్య గారు ఇచ్చిన సమస్య)

27, డిసెంబర్ 2017, బుధవారం

సమస్య - 2557 (సవతినిఁ జూచి సీత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"సవతినిఁ గని సీత మిగుల సంతస మందెన్"
(లేదా...)
"సవతినిఁ జూచి సీత కడు సంతస మందెను రాము తోడుతన్"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో పైడి హరినాథరావు గారు ఇచ్చిన సమస్య)

26, డిసెంబర్ 2017, మంగళవారం

సమస్య - 2556 (విల్లది రామునకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"విల్లది రామునకునైన విఱువఁ దరమ్మే"
(లేదా...)
"విల్లది రాఘవుం డయిన విక్రముఁడై విఱువంగఁ జాలునే"

25, డిసెంబర్ 2017, సోమవారం

దత్తపది - 128 (మేరీ-యేసు-సిలువ-చర్చి)

మేరీ - యేసు - సిలువ - చర్చి
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
శ్రీకృష్ణుని స్తుతిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

24, డిసెంబర్ 2017, ఆదివారం

సమస్య - 2555 (పోరాటముఁ జేయ శస్త్రముల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పోరాటముఁ జేయ శస్త్రముల పని యేలా"
(లేదా...)
"పోరాటమ్మును జేయ నాయుధములన్ బూనంగ నేలా యనిన్"

23, డిసెంబర్ 2017, శనివారం

సమస్య - 2554 (బారనంగ మురిసె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"బారనంగ మురిసె బాపనయ్య"
(లేదా...)
"బారని చెప్పగానె విని బాపఁడు సంతసమందెఁ జూడుమా"
(ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు)

22, డిసెంబర్ 2017, శుక్రవారం

సమస్య - 2553 (తెలుఁగుఁ జదువువారు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"తెలుఁగుఁ జదువువారు దేహి యనరె"
(లేదా...)
"తెలుఁగుఁ బఠించువారలిక దేహి యటంచును జేయిఁ జాపరే"
(ఈ సమస్యను పంపిన వీటూరి భాస్కరమ్మ గారికి ధన్యవాదాలు)

21, డిసెంబర్ 2017, గురువారం

సమస్య - 2552 (బడి యనంగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"బడి యనంగఁ బ్రజలు భయపడుదురు"
(లేదా...)
"బడి యన్నంత ప్రజల్ వడంకెదరు దుర్వారోగ్రభీతాత్ములై"

20, డిసెంబర్ 2017, బుధవారం

సమస్య - 2551 (దమయంతినిఁ బెండ్లియాడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"దమయంతినిఁ బెండ్లియాడె ధర్మసుతుఁ డొగిన్"

19, డిసెంబర్ 2017, మంగళవారం

సమస్య - 2547 (తెలుఁగు సభలకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"తెలుఁగు సభలకు నేగువారలు మొరకులె"
(లేదా...)
"లలినిఁ బ్రపంచ తెల్గు సభలన్ గన నేగెడువారు మూర్ఖులే"

18, డిసెంబర్ 2017, సోమవారం

సమస్య - 2549 (పిడికిటఁ గనుఁగొంటి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పిడికిటఁ గనుఁగొంటి సూర్య విధు బింబములన్"
(లేదా...)
"పిడికిలిలోన నాకుఁ గనుపించె దివాకర చంద్ర బింబముల్"

17, డిసెంబర్ 2017, ఆదివారం

దత్తపది - 127 (ఆట-పాట-బాట-మాట)

ఆట - పాట - బాట - మాట
పై పదాలను ఉపయోగిస్తూ
ప్రపంచ తెలుగు మహాసభలను గురించి
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

16, డిసెంబర్ 2017, శనివారం

సమస్య - 2548 (నన్నయ రచించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"నన్నయ రచించెఁ గావ్యముఁ గన్నడమున"
(లేదా...)
"నన్నయభట్టు కన్నడమునన్ రచియించెను మేటికావ్యమున్"

15, డిసెంబర్ 2017, శుక్రవారం

సమస్య - 2547 (తెలుఁగు తెలుఁగని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"తెలుఁగు తెలుఁగని ధీవరుల్ వలుకఁ దగునె"
(లేదా...)
"తెలుఁగు తెలుంగు తెల్గని సుధీవరు లెల్లరుఁ బల్కు టొప్పునే"

సర్వతోముఖ బంధము

               మదన వృత్త దేవీ ప్రార్ధన 

 మాతా! సనాతని! సతీ! మరుతల్లి!  శ్యామా! 
మాతంగి! అంబిక! శివా! మలయమ్మ! బీమా
మారీ! అనంత! రమ! శ్యామల! హీర! వామా! 
మాహేశ్వరీ! విజయ! హైమ! భవాని! శ్రీ! మా!
 
                                కవి :  పూసపాటి కృష్ణ సూర్య కుమార్

14, డిసెంబర్ 2017, గురువారం

సమస్య - 2546 (పదములు లేకుండ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్"
(లేదా...)
"పదములు లేని పద్యముల వ్రాయవలెన్ కవు లెల్ల రౌననన్"

13, డిసెంబర్ 2017, బుధవారం

సమస్య - 2545 (వెన్నెలయే చెలి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"వెన్నెలయే చెలి తనువును వెచ్చఁగఁ జేసెన్"
(లేదా...)
"వెన్నెలరేయియే తనువు వెచ్చఁగఁ జేసెను సుందరాంగికిన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

12, డిసెంబర్ 2017, మంగళవారం

సమస్య - 2544 (రమ్ముఁ గ్రోల జబ్బు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రమ్ముఁ గ్రోల జబ్బు రాదు దరికి"
(లేదా...)
"రమ్ముం గ్రోలిన రావు రోగము లికన్ రాజిల్లు నారోగ్యమున్"
(శారదా విజయోల్లాసం వారికి ధన్యవాదాలతో...)

11, డిసెంబర్ 2017, సోమవారం

సమస్య - 2543 (పున్నమి దినమయ్యెను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పున్నమి దినమయ్యెను శశి పొడఁగట్టఁడుగా"
(లేదా...)
"పున్నమి వేళ యయ్యె నికఁ బూర్తిగఁ జంద్రుఁడు మాయమయ్యెడిన్"
(శారదా విజయోల్లాసం వారికి ధన్యవాదాలతో...)

10, డిసెంబర్ 2017, ఆదివారం

సమస్య - 2542 (అమ్మా యని పిలువని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"అమ్మా యని పిలువని సుతుఁ డతిపూజ్యుఁ డగున్"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

9, డిసెంబర్ 2017, శనివారం

సమస్య - 2541 (కుట్మలదంతీ కలిగెను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కుట్మలదంతీ కలిగెను గోరిక నీపై" 
(లేదా...)
"కుట్మలదంతి నీ పయినఁ గోరిక లీరికలెత్తె నామదిన్"
(ఒకానొక అవధానంలో ఇచ్చిన సమస్య)

8, డిసెంబర్ 2017, శుక్రవారం

ఆహ్వానము (అష్టావధానము)


ఆహ్వానము (అష్టావధానము)


సమస్య - 2540 (సవతిని గని సీత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"సవతిని గని సీత మిగుల సంతసమందెన్"
(లేదా...)
"సవతిని గాంచి సీత కడు సంతసమొందెను మెచ్చి నెమ్మదిన్"
(ఒకానొక అవధానంలో ఇచ్చిన సమస్య)

ఖేట (డాలు) బంధము


తేటగీతి
రమను గొలువుము సతతము రమ్య గతిని,
నిరవధికముగ గలుగును నీకు గలిమి,
మిసిమి పెరుగ చెడుతలంపు మెదడు జేరు,
రుత్త యగును మనువు గడుసొత్తు లమర.
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

7, డిసెంబర్ 2017, గురువారం

సమస్య - 2539 (రావణుఁడు ప్రియాత్మజుండు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రావణుఁడు ప్రియాత్మజుండు రఘురామునకున్"
(లేదా...)
"రావణుఁ డాత్మజుండు రఘురామునకున్ సఖుఁ డా బలారికిన్"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

6, డిసెంబర్ 2017, బుధవారం

సమస్య - 2538 (రాయలకున్ దెలుఁగు రాదు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రాయలకున్ దెలుఁగు రాదు రసముం గ్రోలన్"
(లేదా...)
"రాయల వారికిన్ దెలుఁగు రాదు గదా రసమున్ గ్రహింపగన్"
(బులుసు శ్రీరామమూర్తి అవధాని గారు పూరించిన సమస్య)

5, డిసెంబర్ 2017, మంగళవారం

సమస్య - 2537 (వేంకటపతికి భామలు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"వేంకటపతికి భామలు వేయిమంది"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

4, డిసెంబర్ 2017, సోమవారం

సమస్య - 2536 (కుంతికి శతసుతుల్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కుంతికి శతసుతుల్ గల్గ సంతసిల్లె"
(లేదా...)
"కుంతికి వందమంది కొడుకుల్ జనియించినఁ బొందె మోదమున్"
ఈ సమస్యను పంపిన ప్రసన్నకుమారాచారి గారికి ధన్యవాదాలు.

విశ్వ ముఖ మత్స్య త్రయ బంధ చంపకమాల


చదువు విధానము - 
ఆకుపచ్చ రంగు చేపలోని కన్నువద్ద గల (ప) తో మొదలు బెట్టాలి. తోక దగ్గిర భక్తుల తోటి ఆపి భక్తుల కోర్కె దీర్చుమా అని చదువు కోవాలి. ఆవిధముగా గులాబీ రంగు, కాషాయరంగు చేపల లోని అక్షరాలు చదువు కోవాలి. అప్పటికి మూడు పాదాలు అవుతాయి. చివరిగా వృత్తములోని కరివదనుండ అని చదువు కోవాలి. దీనిలో విశేషము 3 పాదములలోని చివరి అక్షరము (మా) ఆఖరి పాదములో 3 సార్లు వస్తుంది.

పరుల దనూజుడా యరయు భక్తుల, భక్తుల గోర్కె దీర్చుమా
హరుని శరీరజా, జవురు యంగద, యంగద బాపి గాచుమా,
సురవర పూజితా యిడుము శోభను, శోభను జూపి యేలుమా,
కరి వదనుండ మా జనుల గాచుచు మాకు ప్రపత్తి నివ్వుమా.

భావము -
పార్వతి పుత్రా! భక్తులను రక్షించు. భక్తుల కోర్కె దీర్చు.  శివుని పుత్రుడా! తొలగించు దు:ఖము. ఆపద బాపి కాచుము. దేవతల పూజిత! అందము నిడుము. కాంతి నిచ్చి యేలుమా. ఏనుగు ముఖము గలవాడ! మా ప్రజలను గాచి రక్షణ నిడుము.

పూసపాటి కృష్ణ సూర్య కుమార్ 

3, డిసెంబర్ 2017, ఆదివారం

సమస్య - 2535 (మది మెచ్చిన సుందరాంగి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"మది మెచ్చిన సుందరాంగి మర్కట మయ్యెన్"

2, డిసెంబర్ 2017, శనివారం

సమస్య - 2534 (శ్రీరాముం డపహరించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"శ్రీరాముం డపహరించె సీతాదేవిన్"
(లేదా...)
"సీతను దొంగిలించెఁ గద శ్రీరఘురాముఁడు దండకాటవిన్"
ఈ సమస్యను పంపిన ప్రసన్న కుమారాచారి గారికి ధన్యవాదాలు.

ఘటికా బంధ చంపక మాల వృత్తము

శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యుల వారు వారి కుడ్యముపై ప్రచురించిన ఘటికాయంత్రబంధము స్ఫూర్తితో కూర్చబడినది. వారికి ధన్యవాద సహస్ర  నమస్కారములు. కుండలీకరణములలోని 12 (క) అక్షరములకు గడియారము మధ్యలోనున్న (క) వర్తిస్తుంది. మొత్తము 84 వర్ణములు. ఈ 12 (క)  కారములను తీసివేస్తే, మిగిలిన 72 లో కొన్ని ద్వితీయ  వలయములో   నుంచగా మిగిలినవి చుట్టు నున్న ప్రధమ     వలయములో నమర్చబడినవి

(క){రి}వదనుండు (క)న్ను వలె గాచు, (క)పర్ది శమించు(క)ష్టముల్,
పరుల, (క)రాళి , కన్యక,  (క)పాలి,  యొసంగు (క)టాక్ష వీక్షణల్,
(క)రుణ ఘటిల్ల (క)ర్త శుభ కాంత (క)బ్బము విదుర్చు (క)ల్పముల్
సిరుల (క)ళిoగ యిచ్చు సి{రి} శ్రేష్టు సమంబుగ యుర్వి నెపుడున్.

- పూసపాటి కృష్ణ సూర్య కుమార్

1, డిసెంబర్ 2017, శుక్రవారం

సమస్య - 2533 (సత్యమును బల్కఁడఁట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"సత్యమును బల్కఁడఁట హరిశ్చంద్ర నృపతి"
(లేదా...)
"సత్యమ్మున్ గలనైనఁ బల్కఁడు హరిశ్చంద్రుండు ముమ్మాటికిన్"

30, నవంబర్ 2017, గురువారం

సమస్య - 2533 (గౌరికిఁ గేశవుఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"గౌరికిఁ గేశవుఁడు భర్త గావలె నెన్నన్"
(లేదా...)
"గౌరికిఁ గేశవుండు పతి గావలె శంకరుఁ డన్న గావలెన్"
(శతావధాని పోకూరి కాశీపతి పూరించిన సమస్య)

29, నవంబర్ 2017, బుధవారం

పదవీ విరమణ సన్మాన పత్రము


పదవీ విరమణ సన్మాన పత్రము

శ్రీ గుండు మధుసూదన్ గారు, తెలుగు స్కూల్ అసిస్టెంటు,
ప్రభుత్వోన్నత పాఠశాల, శంభునిపేట, వరంగల్లు నుండి
తేది: 30-11-2017న పదవీ విరమణ చేయు సందర్భమున తేది: 29-11-2017నాడు సమర్పించిన
-:సన్మాన పద్య నవ రత్నములు:-
శ్రీయాదాద్రి నృసింహుం
డా యముడాల నిలయుఁడగునట్టి త్రినేత్రుం
డాయత కరుణా సాంద్రులు
నై యీ మధుసూదనుని ప్రియదులుగ నగుతన్!

ప్రథిత గుండు వంశ వారాశి పూర్ణ శ
శాంకుఁడీవు; మల్లికాంబ పుణ్య
శీల, సత్త్వగుణ విశిష్ట  రామస్వామి 
దంపతులకు ముద్దు తనయుఁ డీవు!

అడుగడుగున నాటంకము 
లిడుములఁ బెట్టంగ నోర్చి హితమగు విద్యల్
గడియించి జీవనమునకు 
నెడ నెడ నుద్యోగభార మెటు సైఁచితివో?

ఎడతెగని యీతిబాధలఁ 
బడి ప్రావీణ్యమునఁ దెలుఁగు భాషోపాధ్యా
యుఁడవై విద్యాబోధనఁ 
గడు నంకితభావ మొప్పఁగాఁ జేసితివే!

సంప్రదాయ కవిత్వమున్ సంస్కృతమును 
చిన్ననాఁటనె యభ్యసించితివి నీవు;
తత్ప్రభావమె నిన్నిట్లు సత్ప్రసాద 
గుణ కవిత్వరచనఁ బారగునిగఁ జేసె!

వేలకొలఁది పద్యము లవ
లీలన్ రచియించి లెక్కలేనట్టి కృతుల్
హేలన్ వెలయించిన కవి
తాలోలాత్మ! మధురకవి! ధన్యుఁడవయ్యా!

మధుసూదన! సత్కవితా 
సుధ లొల్కెడు నీదు పద్యశోభలఁ గనియున్
బుధు లెల్లరు నిను మెచ్చియు 
"మధురకవీ" యనుచుఁ బిలిచి మన్నించిరయా!

పెక్కు బిరుదు లంది, పెక్కు సన్మానమ్ము
లంది, యశముఁ గంటివయ్య నీవు!
బ్లాగుల నడిపించి వాట్సప్ సమూహాల
యందు కవుల మెప్పు లందినావు!!

ఎద యుప్పొంగ సమర్పిం
చెద మధుసూదన! సదా నృసింహుని కృపతోఁ
గొదువయె లేని శుభముఁ గనఁ 
బదవీ విరమణ సమయ శుభాకాంక్ష లివే!

సమర్పణ
కంది శంకరయ్య
"శంకరాభరణం" బ్లాగు నిర్వాహకులు


సమస్య - 2532 (పగతుర పాదముల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పగతుర పాదములఁ బట్టవలె వీరులకున్"
(లేదా...)
"పగతుర పాదపద్మములఁ బట్టఁగ వీరుల కొప్పు నాజిలోన్"

28, నవంబర్ 2017, మంగళవారం

నిషిద్ధాక్షరి - 39

కవిమిత్రులారా,
అంశము - శివధనుర్భంగము
నిషిద్ధాక్షరములు - శ-ష-స-హ.
ఛందస్సు - మీ ఇష్టము.

వీణా బంధ ఉత్పలమాల (శివస్తుతి)


కారుణమూర్తి,  కోకనద,   ల్మషకంఠ,     కపాలధారి, కే
దార,యగస్త్య, ధూర్జటి, సదాశివ,యీశ్వర,  లోకపాలకా,
కారణ కారణమ్ము,శివ, గంగపతీ,భవ,  చంద్ర శేఖరా,  
మారిపతీ, యనారతము మమ్ముల గాచుము  లోకరక్షకా. 

  
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

27, నవంబర్ 2017, సోమవారం

సమస్య - 2531 (పద్మములు ముకుళించెను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పద్మములు ముకుళించెను భానుఁ జూచి"
(లేదా...)
"పద్మము లెల్ల భానుఁ గని వైళముగన్ ముకుళించెఁ జూడుమా"
(శతావధాని అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పూరించిన సమస్య)

26, నవంబర్ 2017, ఆదివారం

సమస్య - 2530 (శంకరుఁ డెత్తె హిమగిరిని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"శంకరుఁ డెత్తె హిమగిరిని సతి వెఱఁ గందన్"
(లేదా...)
"శంకరుఁ డెత్తె వెండిమల శైలతనూభవ సంభ్రమింపఁగన్"
(ఆకాశవాణి వారి సమస్య)

25, నవంబర్ 2017, శనివారం

సమస్య - 2529 (అవధానముఁ జేయువాఁడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"అవధానముఁ జేయువాఁడె యతిమూర్ఖుఁ డగున్"
(లేదా...)
"అవధానమ్మునుఁ జేయునట్టి కవి మూర్ఖాగ్రేసరుండౌ జుమీ"

24, నవంబర్ 2017, శుక్రవారం

సమస్య - 2528 (చోరుని సముఁడు కవి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"చోరుని సముఁడు కవి యనుట చోద్యమ్మౌనే?"
(లేదా...)
"చోరునకున్ సముండు కవి చోద్యము గా దిది నిత్యసత్యమే"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

23, నవంబర్ 2017, గురువారం

ఆహ్వానం (అష్టావధానం)

శ్రీ వేంకట సోమయాజుల ఆంజనేయ శర్మ (విరించి) గారు
తమ కుమారుని శుభవివాహ సందర్భంగా ఏర్పాటు చేసిన
అష్టావధానం
అవధాని       -          శ్రీ తాతా సందీప్ శర్మ గారు (రాజమండ్రి)
అధ్యక్షులు    -          శ్రీ చింతా రామకృష్ణారావు గారు
పృచ్ఛకులు...
నిషిద్ధాక్షరి       -        శ్రీ కంది శంకరయ్య గారు
సమస్య          -        శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు
దత్తపది          -        శ్రీ మాచవోలు శ్రీధర్ రావు గారు
వ్యస్తాక్షరి        -        శ్రీ బండకాడి అంజయ్య గారు
ఆశువు          -        శ్రీ తిగుళ్ళ నరసింహమూర్తి శర్మ గారు
వర్ణన            -        శ్రీ ఫణీంద్ర కుమార్ శర్మ గారు
వారగణనం    -        శ్రీ వెన్ను చక్రపాణి గారు
అప్రస్తుత ప్రసంగం -  శ్రీ డా. ఎస్.బి. శ్రీధరాచార్యులు

తేదీ                -          25-11-2017 (శనివారం)
సమయం     -          ఉ. 10-30 గం. నుండి

వేదిక
టెలీఫోన్ కమ్యూనిటీ హాల్,
జ్ఞాన సరస్వతీ దేవాలయం ప్రక్కన,
రోడ్ నెం. 1, టెలీఫోన్ కాలనీ,
ఆర్.కె.పురం, కొత్తపేట,
హైదరాబాదు.


అందరికీ ఆహ్వ్వానం!

సమస్య - 2527 (వాణికి దేహార్ధ మొసఁగె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"వాణికి దేహార్ధ మొసఁగె ఫాలాక్షుఁ డొగిన్"
(లేదా...)
"వాణికి నర్ధదేహమును వాసిగ నిచ్చె శివుండు వేడుకన్"
ఈ సమస్యను పంపిన వీటూరి భాస్కరమ్మ గారికి ధన్యవాదాలు.

విరించి గారి ఆహ్వానం!


22, నవంబర్ 2017, బుధవారం

సమస్య - 2526 (రమణికిన్ బూలు చేటగు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రమణికిన్ బూలు చేటగుఁ బ్రాయమందు"
(లేదా...)
"రమణికిఁ బూలు చేటగును బ్రాయమునం దనుమాన మేటికిన్"
ఈ సమస్యను పంపిన బొగ్గరం ప్రసాద రావు గారికి ధన్యవాదాలు.

మహా నాగ బంధము

సీస బంధ దేవి స్తుతి 

సీ.
చాముండ, చల, యుమ, సతి, భవ్య, శాంభవి,
          మాత, యమున, శివ, మారి, సౌమ్య, 
మాలిని, ఆర్యాణి, మాధవి, గిరిజ, నా
          రాయణి, భార్గవి, రామ, సత్య, 
చండ, కాత్యాయని, చండిక, హీర, యా
          నంద భైరవి, రమ్య, నందయంతి,
నగనందిని, నగజ, భగవతి, నగజాత,
          దాక్షాయణీ, తల్లితల్లి, జలధి
జ, నటరాజసతి, భంజ, నికుంభిల, విజయ,
          చలిమల పట్టి, చపల, శివాని,
శాకంబరి, భవాని, శ్యామల, సావిత్రి,
          శాంతి, యిందిర, లంబ,  శాకిని, సిరి,
శాక్రి, సనాతని, సని, రమ, శాంకరి,
          కాళిక, శైలజ, కాళి, పాత్రి,
సంపద, పార్వతి, శైలేయి, మాతంగి,
          సాత్వికి, మాతృక, షష్టి, వాణి,
తే.గీ.
బాణ, గీర్దేవి, వాగ్దేవి, బాస, విద్య
దాత, లక్కిమి, పద్మిని, సీత, లక్ష్మి,
దాక్షి,  శ్యామ, లలన, దక్ష తనయ, రామ,
కరుణ తోడ మమ్ము సతము గాచ వలయు.

రచన :- పూసపాటి కృష్ణ సూర్య కుమార్ 

21, నవంబర్ 2017, మంగళవారం

సమస్య - 2525 (పండు ముసలిని వరియించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పండు ముసలిని వరియించెఁ బంకజాక్షి"
(లేదా...)
"పండు ముసలినిన్ వరించెఁ బంకజాక్షి ప్రీతితో"
(శ్రీ నరాల రామారెడ్డి గారికి ధన్యవాదాలతో...)

20, నవంబర్ 2017, సోమవారం

న్యస్తాక్షరి - 48 (అ-న్న-మ-య్య)

అంశము - అన్నమయ్య పదవైభవం.
ఛందస్సు- మీ యిష్టం.
స్యస్తాక్షరములు... 
అన్ని పాదాల మొదటి అక్షరములు వరుసగా "అ - న్న - మ - య్య" ఉండవలెను.
(ఈ నియమంతో తేటగీతిలో పద్యం వ్రాయడం కుదరదు)

ఆందోళికా బంధ తేటగీతి (దేవీ ప్రార్ధన)



మాత, మంగళ, శ్రీగౌరి, మారి, గిరిజ,
బాల, కాల, లలన, సీత, భవ్య, లంభ,
రంభ, శాంభవి, యుమ, రమ, రామ, భీమ, 
యగజ, దుర్గ, శ్రీమాతృక, యంబిక, జయ,
మలయ వాసిని శారద, మాలిని, కళ
భార్గవి, శివ, సరస్వతి, భంజ, శాక్రి, 
సౌమ్య, దశభుజ, సావిత్రి, శక్తి, శాంతి,
నీల లోహిత, రక్షి, సని, సురస, భయ 
నాశిని, యమున, మలయమ్మ, నంద, సతము 
కరుణతో  జూచుచును మమ్ము గాచ వలయు
రచన :- పూసపాటి కృష్ణ సూర్య కుమార్  

19, నవంబర్ 2017, ఆదివారం

సమస్య - 2524 (శ్రీకృష్ణుని కంటె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... 
"శ్రీకృష్ణుని కంటె ఘనుఁడు శిశుపాలుండే"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

18, నవంబర్ 2017, శనివారం

సమస్య - 2523 (భరతుఁ దునిమె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... 
"భరతుఁ దునిమె రాఘవుండు భామిని కొఱకై"
(లేదా...)
"భరతు వధించె రాఘవుఁడు భామినికై సదసద్వివేకియై"
(కంద పాద సమస్య పంచసహస్రావధాని జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పూరించినది - 
'అవధాన విద్యాసర్వస్వము' నుండి)

17, నవంబర్ 2017, శుక్రవారం

సమస్య - 2522 (పరమపదము లభ్యము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... 
"పరమపదము లభ్యమగును పాపాత్ములకే"
(లేదా...)
"పరమపదమ్ము లభ్యమగుఁ బాపులకే సులభమ్ముగా భువిన్"

16, నవంబర్ 2017, గురువారం

దత్తపది - 126 (దొర-డబ్బు-అప్పు-వడ్డి)

దొర - డబ్బు - అప్పు - వడ్డి
పై పదాలను ఉపయోగిస్తూ
ఋణగ్రస్తుని బాధను వర్ణిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(పై పదాలను అన్యార్థంలోనే ఉపయోగించాలన్న నియమమేమీ లేదు.
 అన్యార్థంలొ ఉపయోగిస్తే సంతోషం!)

15, నవంబర్ 2017, బుధవారం

సమస్య - 2521 (పట్టపగలు వెన్నెల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... 
"పట్టపగలు వెన్నెల విరిసెన్" (ఛందోగోపనము)
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.
(ఛందోగోపనము - పృచ్ఛకుడు సమస్యను పూర్తి పాదంగా కాకుండా కొంత భాగాన్ని, లేదా మూడవ పాదంలో కొంత భాగం నుండి మొదలు పెట్టి ఇస్తాడు. అవధాని అది ఏ ఛందస్సులో ఇముడుతుందో గ్రహించి పూరించాలి.
ఉదాహరణకు... "శివుఁడు గరుఁడు నెక్కి వడివడిఁ బారెన్" అని సమస్య ఇచ్చారనుకోండి. కందపాదం ప్రారంభంలో కొంత వదలిపెట్టారు. కవి అక్కడ మూడు లఘువులను చేర్చి కాని (పరమశివుఁడు...), ఒక గురువు ఒక లఘువు వేసికొని కాని (మూడుకనులు నయముగ గల। వాఁడు శివుఁడు...) పూరించవచ్చు.
అలాగే... "అర్జునుఁ డూరువులన్ భంగపఱచె నుగ్రుం డగుచున్" అని సమస్య ఇచ్చారనుకోండి. ఇక్కడ కందంలో మూడవ పాదం చివర నుండి సమస్య ఇవ్వబడింది. "అర్జునుఁ। డూరువులన్ భంగపఱచె నుగ్రుం డగుచున్" అని భావించాలి).

14, నవంబర్ 2017, మంగళవారం

సమస్య - 2520 (బొంకునట్టివాఁడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... 
"బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును" 

13, నవంబర్ 2017, సోమవారం

సమస్య - 2519 (పొడి యొనర్చువాని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పొడి యొనర్చువానిఁ బొగడ వశమె"
ఈ సమస్య సూచించిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

12, నవంబర్ 2017, ఆదివారం

సమస్య - 2518 (పుస్తకముఁ బఠింత్రు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పుస్తకముఁ బఠింత్రు మూర్ఖజనులు"
(లేదా...)
"పుస్తకముల్ బఠించెదరు మూర్ఖజనాళి వివేకశూన్యులై"

11, నవంబర్ 2017, శనివారం

సమస్య - 2517 (కవులఁ బురస్కృతుల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కవులఁ బురస్కృతులఁ జేయఁగా వల దెపుడున్"
(లేదా...)
"కవులం బిల్వఁగరాదు దండుగ పురస్కారమ్ము లందిచ్చుటల్"

10, నవంబర్ 2017, శుక్రవారం

సమస్య - 2516 (శివభక్తవరేణ్యుఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"శివభక్తవరేణ్యుఁ డనఁగ శ్రీశ్రీయె కదా"
(లేదా...)
"శివభక్తాగ్రణి యెవ్వరో యెఱుఁగవా శ్రీశ్రీయె సత్యం బిదే"

ఖడ్గబంధములు

రచన - పూసపాటి కృష్ణసూర్య కుమార్

ఖడ్గ బంధ తేటగీతి - 1 (పార్వతీ ప్రార్ధన)

గౌరి, మారి, గిరిజ, భీమ, కాళి, చండ,
శారద, విజయ, మాలిని, సత్య, శంక
రి, యగజ, బహుభుజా, కర్వరి, పురుహుతి, 
కరుణ జూపి సతము మమ్ము  గాచవలయు

ఖడ్గ బంధ తేటగీతి - 2 (పార్వతీ ప్రార్ధన)

రంభ, లంభ, శాంభవి, దుద్దుర, గుహ జనని, 
గట్టు పట్టి, కాత్యాయణి, కౌసిని, శివ,
పార్వతి, పురల, యీశ్వరి, భగవతి, స్తుతి, 
వందనమ్ము మాతా నీకు వందనమ్ము.

ఖడ్గ బంధ తేటగీతి - 3 (లక్ష్మి స్తుతి)

 రామ, రమ, కమలాలయ, రమ్య వదన, 
జలదిజ, కలిమిగుబ్బెత, చంద్ర వదన, 
మరుని తల్లి,  మా, మాత, యమల, యతిచర,
యెల్ల కాలము గాపాడు మిందు వదన.

9, నవంబర్ 2017, గురువారం

సమస్య - 2515 (కరణమ్మును నమ్ముకొనిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్"
(లేదా...)
"కరణము నమ్మువారలకుఁ గల్గు సుఖమ్ములు కచ్చితమ్ముగా"
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...

8, నవంబర్ 2017, బుధవారం

సమస్య - 2514 (భీముఁడు చెలరేగి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భీముఁడు చెలరేగి చంపె భీష్ము రణమునన్"
(లేదా...)
"భీముఁడు యుద్ధరంగమున భీష్మునిఁ జంపెఁ బరాక్రమోద్ధతిన్"
ఈ సమస్యను పంపిన ప్రసన్న కుమారాచారి గారికి ధన్యవాదాలు.

7, నవంబర్ 2017, మంగళవారం

సమస్య - 2513 (సంపదలు కొల్లగొట్టెద...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సంపదలు కొల్లగొట్టెద జనులు మెచ్చ"
(లేదా...)
"సంపదఁ గొల్లగొట్టెదఁ బ్రశస్తముగా జనులెల్ల మెచ్చఁగన్"
ఈ సమస్యను పంపిన ప్రసన్న కుమారాచారి గారికి ధన్యవాదాలు.

6, నవంబర్ 2017, సోమవారం

సమస్య - 2512 (పతులు గల రైదుగురు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పతులు గల రైదుగురు సాధ్వి భానుమతికి"
(లేదా...)
"పతులు గణింప నైదుగురు భానుమతీసతికిన్ సుయోధనా"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

5, నవంబర్ 2017, ఆదివారం

సమస్య - 2511 (సింగమ్మును గాంచి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సింగమ్మును గాంచినపుడె చింతలు దొలఁగున్"
(లేదా...)
"సింగముఁ జెంగటం గనినఁ జింతలు దీరుట తథ్యమే కదా"
ఈ సమస్యను పంపిన ప్రసన్న కుమారాచారి గారికి ధన్యవాదాలు.

4, నవంబర్ 2017, శనివారం

ఆకాశవాణి వారి 'సమస్యాపూరణం' - 2

ఈవారం సమస్య....
"అమృతము విషమయ్యెఁ జూడ నాశ్చర్యముగన్"
11-11-2017 (శనివారం) ఉదయం 7-30 గం.లకు ప్రసారమౌతుంది. 
పూరణలను పంపవలసిన చిరునామాలు....
email :
padyamairhyd@gmail.com

Postal Address :
సమస్యాపూరణం,
c/o స్టేషన్ డైరెక్టర్,
ఆకాశవాణి,
సైఫాబాద్,
హైదరాబాద్ - 500 004.

సమస్య - 2510 (కార్తిక పూర్ణిమను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కార్తిక పూర్ణిమను గంటిఁ గద నెలవంకన్"

3, నవంబర్ 2017, శుక్రవారం

సమస్య - 2509 (పలలమ్మును గోరి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్" 
ఈ సమస్యను సూచించిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.

2, నవంబర్ 2017, గురువారం

ఆహ్వానము (అష్టావధానము)


నిషిద్ధాక్షరి - 38

కవిమిత్రులారా,
అంశము - కుచేలుని వృత్తాంతము
నిషిద్ధాక్షరములు - కకారము (క - దాని గుణితాలు, అది సంయుక్తంగా ఉన్న అక్షరాలు)
ఛందస్సు - మీ ఇష్టము.

1, నవంబర్ 2017, బుధవారం

సమస్య - 2508 (కవి కిద్దఱు భార్యలు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కవి కిద్దఱు భార్యలున్నఁ గను సుఖ కీర్తుల్"
ఈ సమస్యను సూచించిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.

31, అక్టోబర్ 2017, మంగళవారం

న్యస్తాక్షరి - 48 (స-ర-స్వ-తి)

అంశము- సరస్వతీ స్తుతి
ఛందస్సు- తేటగీతి (లేదా) చంపకమాల
స్యస్తాక్షరములు... 
అన్ని పాదాల మొదటి అక్షరములు వరుసగా "స - ర - స్వ - తి" ఉండవలెను.
(దయచేసి మొత్తం పద్యాన్ని సంబోధనలతో నింపకండి)

30, అక్టోబర్ 2017, సోమవారం

సమస్య - 2507 (దుర్యోధనుఁ బెండ్లియాడి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దుర్యోధనుఁ బెండ్లియాడి ద్రోవది మురిసెన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

29, అక్టోబర్ 2017, ఆదివారం

సమస్య - 2506 (తండ్రితో రతికేళిని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తండ్రితో రతికేళినిఁ దనయ కోరె"
ఈ సమస్యను పంపిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.

28, అక్టోబర్ 2017, శనివారం

సమస్య - 2505 (నాగపూజ సేయ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నాగపూజ సేయ నరకమబ్బు"
(లేదా...)
"నాగుల పూజ సేయు నెలనాగలకున్ నరకంబు ప్రాప్తమౌ"
ఈ సమస్యను పంపిన వీటూరి భాస్కరమ్మ గారికి ధన్యవాదాలు.

27, అక్టోబర్ 2017, శుక్రవారం

దత్తపది - 125 (తల-మెడ-కడుపు-వీపు)

తల - మెడ - కడుపు - వీపు
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
భారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

26, అక్టోబర్ 2017, గురువారం

సమస్య - 2504 (జిహ్వికకుఁ బంచదార...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"జిహ్వికకు పంచదారయె చేదు గాదె?"
ఈ సమస్యను పంపిన తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదాలు.

25, అక్టోబర్ 2017, బుధవారం

లింగ బంధ ఈశ్వర స్తుతి


సీ.
శంభుడు,యచలుడు,చంద్రశేఖరుడు,పంచాస్వుడు,ఈశుడు, చదిర ధరుడు,
కాంతిమంతుడు,కురంగాంకుడు,సాంబుడు, ఫాలుడు,జలజుడు,భర్గుడు,శశి,
శ్రీవర్దనుడు, శూలి,సింధు జన్ముడు, అంబుజన్ముడు,బుద్నుడు, చండుడు,పుర
హరుడు,అఘోరుడు,యక్షికౌక్షేయుడు, నభవుడు, భానువు, నటన ప్రియుడు,
ముక్కంటి,పురభిత్తు,మృడుడు,కంకటీకుడు,అంధకరిపువు,కోడె రౌతు,
అంగమోముల వేల్పు,అంబర కేశుడు,,బుడిబుడి తాల్పుడు, బూచులదొర,
మదనారి,సుబలుడు,మరుగొంగ,వామార్ధజాని,గజరిపువు,జంగమయ్య,
జడముడి జంగము,శంకువు,,శర్వుడు,సగమాట దేవర,జ్వాలి,ఖరువు,
గోపాలుడు,విలాసి,కోకనదుడు, విష ధరుడు, జోటింగుడు త్ర్యంగటముడు,
అంబరీషుడు, స్వామి,  అజితుడు నకులుడు  , చండీశుడు ,పురారి, చంద్ర ధరుడు
హరకుడు అభవుడు హంసుడు  సాంఖ్యుడు, అనిరుద్ద్డుడు,కపర్ది, అజుడు. విధుడు,
రాజధరుడు మందరమణి, భూతేశుడు, ధూర్జటి,తుంగుడు ధూర్తుడు పశు
తే.గీ.
పతి,అసమనేత్రుడు, కపాలి  భార్గవుండు,
పంచ వక్త్రుడు ,కామారి, పంచ ముఖుడు,
శమన రిపుడు మలహరుడు ,  శశివకాళి,
గరళ కంఠుడు   సతతము కాచు చుండు                  

కవి : పూసపాటి కృష్ణ సూర్య కుమార్