20, మే 2012, ఆదివారం

రవీంద్రుని గీతాంజలి - 18

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

18

CLOUDS heap upon clouds and it darkens.
Ah, love, why dost thou let me wait
outside at the door all alone ?

In the busy moments of the noontide
work I am with the crowd, but on this
dark lonely day it is only for thee that
I hope.

If thou showest me not thy face, if
thou leavest me wholly aside, I know
not how I am to pass these long, rainy
hours.

I keep gazing on the far away gloom
of the sky, and my heart wanders wail-
ing with the restless wind. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదం....

కప్పె నుప్పరమందు మేఘములమీద
మేఘముల్, చిట్టు చీకట్లు, మెండుకొనియె,
నెదురుచూపుల వాకిటియెదుట నన్ను
ప్రియతమా! యొంటిఁ గూర్చుండఁ బెట్టి తేల? ||

పలుపనులఁ జిక్కి యూపిరి సలపకుందు
బహుజన పరీవృతంబుగఁ బగళులందుఁ
గాని యీ యిర్లు క్రమ్ము నేకాంతవేళ
నాస పడియుంటి నీ సమాశ్వాసమందె ||

ప్రియసఖా! నాకు మోము చూపింపకుండ
నీవె బొత్తుగ న న్నుపేక్షింతువేని
యొక్క రవ్వంతయుం దోచదోయి నాకు
పొడవు లీ మబ్బు గడియలు గడచుటెట్లొ? ||

నేను దవుదవ్వు నల్లని నింగివైపు
గనుచునే యుంటి రెప్పలు కదలనీక,
త్రిమ్మరుచునుండె హృదయ మీ తెరపి లేని
వాయువుం గూడి పుట్టెడు వగపుతోడ ||

ఎదురుచూపుల వాకిటి యెదుట నన్ను
ప్రియతమా! యొంటిఁ గూర్చుండఁ బెట్టితేల? ||

2 కామెంట్‌లు:

  1. చిన్న ప్రయత్నము:

    క్రమ్మెను గారు చీకటులు గాఢతమమ్మున నుంచితేల మి
    త్రమ్మ? యెటేగినాడవొ కదా! నిను జూడకయున్న దోచునే
    యెమ్మెయి నాకు కాలమిక యెవ్విధి నే గడుపంగలాడనో?
    ద్రిమ్మరుచుండె నీ కొరకిదే మది నన్నిట నుంచితేలనో?

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని వారూ,
    అద్భుతంగా ఉంది మీ వృత్తపరివర్తన. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి