11, మే 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 701 (అందఱు నందఱే మఱియు)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందఱే!


ఇది ప్రసిద్ధమైన సమస్య. దీనికి కవిసార్వభౌముడు శ్రీనాథుని పూరణ....


కొందఱు భైరవాశ్వములు, కొందఱు పార్థుని తేరి టెక్కెముల్,
కొందఱు ప్రాక్కిటీశ్వరులు కొందఱు కాలుని యెక్కిరింతలున్,
కొందఱు కృష్ణజన్మమున కూసిన వారలు నీ సదస్సులో
నందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందఱే!


(భైరవాశ్వములు = కుక్కలు, పార్థుని తేరి టెక్కెములు = కోతులు, ప్రాక్కిటీశ్వరులు = పందులు, కాలుని యెక్కిరింతలు = దున్నపోతులు, కృష్ణజన్మమున కూసినవారలు = గాడిదలు)

22 కామెంట్‌లు:

  1. కొందరు సత్కవీశ్వరులు కొందరు యోగ విశేషవైభవుల్
    కొందరు పండితోత్తములు కొందరు సర్వ కళావిశారదుల్
    సుందర శంకరాభరణ శోభలలోన జెలంగు సభ్యులౌ
    నందరు నందరే మరియు నందరు నందరె యందరందరే

    రిప్లయితొలగించండి
  2. (కలిమిగల వేళ అందరును అందుతారు, లేకుంటే ఎవ్వరునూ అందరు అనే భావముతో ఈ పూరణ)

    అందెద రందరున్ బ్రతుకు హాయిగ సంపదలందు వెల్గునా
    డందరు చుట్టు చేరుచు మదాప్తుడ వీవె యటంచు, లేమి ని
    బ్బందులలోన చిక్కునెడ బంధులు, మిత్రులునేని నెందునే
    నందరు నందరే, మరియు నందరు నందరె, యందరందరే

    రిప్లయితొలగించండి
  3. కొందరు స్వార్థపూరితులు, కొందరు చోరకళాప్రవీణులున్,
    కొందరు దుర్మదాంధు, లిక కొందరు దుష్టులు, ధర్మదూరులున్
    కొందరు ప్రాంతవాదులిట కూడిన నేతల తీరుచూడగా
    నందఱు నందఱే మఱియు నందఱు నందఱె యందఱందఱే.

    రిప్లయితొలగించండి
  4. సుందరపద్యపాదసుమశోభితసభ్యులు కొందఱీసభన్,
    చిందులువేయగల్గిన విశేషపదంబుల వారుకొందఱున్,
    అందరిభావజాలములనంచిత రీతినదెల్పుగుర్వులున్,
    అందఱు నందఱే మరియు నందఱు నందఱె యందఱందఱే.

    రిప్లయితొలగించండి
  5. కొందరుదక్క నాయకులు కోట్లను దోచుటనందు జూడగా
    నందఱు నందఱే మరియు నందఱు నందఱె యందఱందఱే!
    కొందరు దక్క వారలతి గుట్టుగ చట్టము చేయి చాపగా
    అందరు నందరే, మరియు నందరు నందరె, యందరందరే!

    రిప్లయితొలగించండి
  6. కుందన చారుభాస సుమకోమల గాత్రలు,నీరజాస్యలున్
    సుందర, రమ్య, భావ రస సూన శుకోన్నతకంఠులున్గనన్
    ముందుతరమ్మునందు నటపూర్ణలు,నాంధ్రుల చిత్రసీమలో
    నందఱు నందఱే మరియు నందఱు నందఱె యందఱందఱే.

    శుకోన్నతకంఠి - శుకము కన్నా ఉన్నత మైన కంఠం కలది అన్న అర్ధమ్ వస్తుందేమోనని ఉపయోగించానండీ - తప్పొప్పులు పెద్దలు చెప్పాలి.


    ఎంత సాభిప్రాయం తో వాడినా "నటపూర్ణలు" ఇబ్బంది గానే ఉంది గానీయండి, మరేమీ తోచలేదు..

    భవదీయుడు

    రిప్లయితొలగించండి
  7. కొందఱు కాళిదాసు లగు కొందఱు తిక్కన పొతనా ర్యులే
    ఎందరొ విశ్వనాధు లన నెందరొ వేమన రామదాసు లౌ
    చందన పుష్ప రాగముల సౌరులు జిమ్మిన పండితోత్త ముల్
    అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యందఱం దఱే

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని వారూ,
    మీ రెండు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    సత్యనారాయణ మూర్తి గారూ,
    నేటి నాయకుల స్వరూప స్వభావాలను వివరిస్తున్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    ఊకదంపుడు గారూ,
    నటీమణుల గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘శుకోన్నతకంఠులు’ అనడంలో నాకు దోషం ఏమీ కనపడలేదు. అలాగే నటపూర్ణలు కూడా.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    అందమైన పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. పొందెను బొమ్మజేయగనుపుట్టిన వాణిని బ్రహ్మదేవుడున్!
    అందెను నల్లనయ్యతనె అష్టసతీగణగోపికాదులన్!
    పొందెను మోహినిన్ శివుడు! మోహము నందు త్రిమూర్తులందరున్
    అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందఱే!

    రిప్లయితొలగించండి
  10. సహదేవుడు గారూ,
    త్రిమూర్తులూ అందరి వంటి వారే అన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. శ్రీపతిశాస్త్రిశనివారం, మే 12, 2012 2:40:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    నందుని సంహరించి నవనందులు రాజ్యమునేలుచుండి యి
    బ్బందుల పాలజేసిరట పాటలిపుత్రపు దేశపౌరులన్
    ఎందరు యుండనేమి భువనీశులు కౄరులు నీచులైరి వా
    రందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందఱే!

    చంద్రగుప్తుని తండ్రి మహానందులవారిని ఒకనమ్మకమైన సేవకుడు హత్య చేయించి తను నందుల వారి వారసుడనే యని ప్రజలను నమ్మించుటకు తనపేరు పద్మనందుడని మార్చుకొని తన 8 మంది కుమారులతో కలసి రాజ్య పాలన చేసేవాడు. తర్వాతకాలంలో అసలైన వారసుడు చంద్రగుప్తుడు చాణుక్యుని సహాయమున మౌర్య సామ్రాజ్యమును స్థాపించినాడు.

    రిప్లయితొలగించండి
  12. శ్రీపతి శాస్త్రి గారూ,
    రాజ్యకాంక్షలో అందరు అందరే అన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. కొందరు భూబకాసురులు కొందరు మద్యము మాఫియా ఘనుల్
    కొందరు బందుబంధమను కూపమునందునకూలినంధులున్
    కొందరు మౌనప్రేక్షకులుకొందరునల్లకుభేరులున్ గనన్
    అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందఱే!

    రిప్లయితొలగించండి
  14. మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    రెండవ పాదాన్ని ఇలా చెప్తే బాగుంటుందేమో...
    ‘కొందరు బంధుబంధమను కూపమునన్ బడినట్టి యంధులున్’

    రిప్లయితొలగించండి
  15. కొందరు భూబకాసురులు కొందరు మద్యము మాఫియా ఘనుల్
    కొందరు పుత్రబాంధవుల కూరిమిబెంచెడు రాజశేఖరుల్
    కొందరు మౌన ప్రేక్షకులు కొందరు నల్లకుభేరులున్ గనన్
    అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందఱే!

    రిప్లయితొలగించండి
  16. విమర్శనాత్మకంగా |- కొందరు రాజకీయులు నిగూఢవిశేష ధనార్జనాపరుల్,
    కొందరు దుష్ప్రవర్తనులు, కుత్సితతంత్ర వికారబుద్ధులున్,
    కొందరు క్రూరమానసులు,కొందరు కామపిశాచు లెన్నగా
    అందరు నందరే మరియు నందరు నందరె యందరందరే!

    ప్రశంసాత్మకంగా \ - చందనగంధ శుభ్రసుమ చారుశరీర లెంచగా
    సుందర చంచలాంచల విశోభిత వారిజనేత్రలున్ గనన్
    మందమరాళ గామినులు మన్మథ బాణ సమానలెందరో
    అందరు నందరే మరియు నందరు నందరె యందరందరే !

    రిప్లయితొలగించండి
  17. కొందరు గొప్ప పండితులు కొందరు వ్యాకరణాన దిట్టలున్
    కొందరు సత్కవీంద్రులును కొందరు భాషను పట్టభద్రులున్
    విందొన రించుచుందు రిట వింతయె జూచిన కంది శంకరా!
    అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందఱే!

    రిప్లయితొలగించండి
  18. మంద పీతాంబర్ గారూ,
    సవరించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    సవ్యసాచి అనిపించుకున్నారు చక్కని మీ వైవిధ్యమైన పూరణలతో. అభినందనలు.
    రెండవ పూరణ మొదటి పాదంలో గణదోషం. ‘చారు శరీర..’ ను ‘చారు మనోజ్ఞ శరీర....’ అంటే ఎలా ఉంటుందంటారు?
    *
    మిస్సన్న గారూ,
    వింతల విందు చేసిన మీకు ధన్యవాదాలు తప్ప ఇంకేమి ఇవ్వగలను?

    రిప్లయితొలగించండి
  19. మీరన్నది నిజమే.మరచిపోయాను.ప్రశంసా పద్యంలో మొదటి పాదాన్ని 'చారుమనోజ్ఞశరీరలు 'అని సరిచేస్తున్నాను.కృతజ్ఞతలు తెల్పుకొంటున్నాను.

    రిప్లయితొలగించండి
  20. "సరదా" శంకరాభరణం:

    కొందరు పండితోత్తములు కొందరు మణ్డిత శబ్దశాస్త్రులున్
    కొందరు కావ్యకంఠులిట కొందరు మెండు వితండవాదులున్
    పొందుగ కంది శంకరుని ప్రొద్దున రాత్రియు బోరుగొట్టు వా
    రందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందఱే!

    రిప్లయితొలగించండి